తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Liger: సుదర్శన్‌ థియేటర్లో ఫ్యాన్స్‌తో కలిసి లైగర్‌ చూసిన విజయ్‌, అనన్య

Liger: సుదర్శన్‌ థియేటర్లో ఫ్యాన్స్‌తో కలిసి లైగర్‌ చూసిన విజయ్‌, అనన్య

HT Telugu Desk HT Telugu

25 August 2022, 10:14 IST

    • Liger: లైగర్‌ సినిమాను ఫ్యాన్స్‌తో కలిసి సుదర్శన్‌ థియేటర్లో చూసింది ఈ మూవీ టీమ్‌. విజయ్‌ దేవరకొండ, అనన్యతోపాటు కొంతమంది ఈ మూవీ టీమ్‌కు చెందిన వాళ్లు థియేటర్‌కు వచ్చారు.
సుదర్శన్ థియేటర్లో సినిమా చూస్తున్న విజయ్ దేవరకొండ, అనన్య పాండే
సుదర్శన్ థియేటర్లో సినిమా చూస్తున్న విజయ్ దేవరకొండ, అనన్య పాండే (Twitter)

సుదర్శన్ థియేటర్లో సినిమా చూస్తున్న విజయ్ దేవరకొండ, అనన్య పాండే

Liger: ఇప్పుడు దేశమంతా లైగర్‌ మానియా నడుస్తోంది. ఈ ఏడాది మచ్‌ అవేటెడ్‌ మూవీ అయిన లైగర్‌ గురువారం (ఆగస్ట్‌ 25) రిలీజ్‌ అయిన విషయం తెలిసిందే. దీంతో పూరి జగన్నాథ్‌, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌ హంగామా మామూలుగా లేదు. యూఎస్‌ ప్రీమియర్స్‌తోపాటు అర్ధరాత్రి నుంచి స్పెషల్‌ షోలను చూస్తూ ట్విటర్‌లో ఈ మూవీ రివ్యూస్‌ను రాస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ వదులుకున్న నాలుగు సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇవే

Prasar Bharati OTT: ప్రభుత్వ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఆనెలలో ప్రారంభం కానుందా?

Aranmanai 4 Collection: యావరేజ్ టాక్‌తో దుమ్ముదులుపుతున్న తమన్నా హారర్ మూవీ అరణ్మనై 4.. ఎన్ని కోట్లో తెలుసా?

Kalvan OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ మూవీ కల్వన్.. తెలుగులో కూడా..

మరోవైపు హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉన్న సుదర్శన్‌ 35ఎంఎం థియేటర్లో ఫ్యాన్స్‌తో కలిసి ఈ సినిమా చూశారు లైగర్‌ మూవీ హీరో, హీరోయిన్‌ విజయ్ దేవరకొండ, అనన్య పాండే. గురువారం ఉదయం నుంచి సుదర్శన్‌ థియేటర్‌ దగ్గర ఫ్యాన్స్‌ హంగామా మొదలు కాగా.. ఈ ఇద్దరూ అక్కడికి వచ్చేసరికి వాళ్లను చూడటానికి ఎగబడ్డారు.

ఆ తర్వాత థియేటర్లో ఫ్యాన్స్‌ ఈలలు, గోలల మధ్య సినిమాను చూశారు. అభిమానులు వీళ్ల దగ్గరికి వెళ్లకుండా విజయ్‌, అనన్య చుట్టూ బౌన్సర్లు నిల్చొని ఉండటం విశేషం. మూవీ రిలీజ్‌కు ముందే విజయ్‌, అనన్య దేశమంతా తిరుగుతూ ప్రమోషన్లలో పాల్గొన్నారు. స్పెషల్‌ స్క్రీనింగ్స్‌ కూడా చూశారు. ఇక ఇప్పుడు ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూస్తూ ఆ మ్యాజిక్‌ ఎన్విరాన్‌మెంట్‌ను ఎంజాయ్‌ చేశారు.

మరోవైపు ఈ సినిమాకు ట్విటర్‌లో చాలా వరకూ నెగటివ్‌ రివ్యూలు వస్తున్నాయి. విజయ్‌ దేవరకొండ పర్ఫార్మెన్స్‌ అదుర్స్‌ అనిపించేలా ఉన్నా.. స్టోరీ, స్క్రీన్‌ప్లే విషయంలో చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పూరి జగన్నాథ్‌ మార్క్‌ ఎక్కడా కనిపించలేదని, చాలా వరకూ పాత సీన్లనే మళ్లీ అతికించి సినిమా తీసినట్లుగా ఉందని ట్వీట్లు చేశారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం