Liger Twitter Review: లైగర్‌ ట్విటర్‌ రివ్యూ.. విజయ్‌ పర్ఫార్మెన్స్‌కు ఆడియెన్స్‌ ఫిదా-liger twitter review says vijay deverakonda performance is terrific ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Liger Twitter Review: లైగర్‌ ట్విటర్‌ రివ్యూ.. విజయ్‌ పర్ఫార్మెన్స్‌కు ఆడియెన్స్‌ ఫిదా

Liger Twitter Review: లైగర్‌ ట్విటర్‌ రివ్యూ.. విజయ్‌ పర్ఫార్మెన్స్‌కు ఆడియెన్స్‌ ఫిదా

HT Telugu Desk HT Telugu
Aug 25, 2022 08:31 AM IST

Liger Twitter Review: లైగర్‌ ట్విటర్‌ రివ్యూలు వచ్చేస్తున్నాయి. విజయ్‌ దేవరకొండ పర్ఫార్మెన్స్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. యూఎస్‌ ప్రీమియర్స్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ స్పెషల్‌ షోలు చూసిన ఫ్యాన్స్‌ ట్విటర్లో రివ్యూలు రాస్తున్నారు.

అనన్యా పాండే, విజయ్ దేవరకొండ
అనన్యా పాండే, విజయ్ దేవరకొండ (Twitter)

Liger Twitter Review: మచ్‌ అవేటెడ్‌ పాన్‌ ఇండియా మూవీ లైగర్‌ గురువారం (ఆగస్ట్‌ 25) ప్రపంచవ్యాప్తంగా అభిమానుల ముందుకు వచ్చింది. బుధవారం రాత్రి నుంచే యూఎస్‌లో ప్రీమియర్‌ షోలు వేశారు. ఈ షోలు చూసిన అభిమానులు ట్విటర్‌లో తమ రివ్యూలు షేర్‌ చేస్తున్నారు. ఉదయం నుంచి వస్తున్న రివ్యూలు చూస్తుంటే తెలిసింది ఒక్కటే.. ఈ మూవీలో విజయ్‌ దేవరకొండ పర్ఫార్మెన్స్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.

అయితే సినిమా స్టోరీ, స్క్రీన్‌ప్లే విషయంలోనే చాలా మంది పెదవి విరిచారు. అసలు పూరి మార్క్‌ ఎక్కడా కనిపించలేదని, పూరి ఈ మూవీ డైరెక్షన్‌పై అసలు సరిగ్గా దృష్టి సారించాడా అని కూడా కొందరు ప్రశ్నించారు. ఇక అనన్య పాండే నటన అస్సలు బాగా లేదని మరికొందరు రివ్యూలు రాశారు. అయితే ట్విటర్‌లోనూ ఫ్యాన్స్‌ మధ్య వార్‌ నడుస్తోంది.

కావాలనే కొందరు విజయ్‌ దేవరకొండను వ్యతిరేకించే వాళ్లు నెగటివ్‌ రివ్యూలు ఇస్తున్నారంటూ అతని ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. కానీ కొందరు న్యూట్రల్‌ ప్రేక్షకులు కూడా ఈ మూవీకి నెగటివ్ రివ్యూలే ఇస్తున్నారు. ఈ సినిమాకు విజయ్‌ అతి పెద్ద ప్లస్‌ పాయింట్‌ అని, అంతకుమించి చెప్పుకోవడానికి ఏమీ లేదని తేల్చేస్తున్నారు. ముఖ్యంగా రైటింగ్ మరీ దారుణంగా ఉందని ఫ్యాన్స్‌ ట్విటర్‌ రివ్యూల్లో తేల్చేశారు.

మూవీ ఫస్ట్‌ హాప్‌ ఫర్వాలేదనిపించినా.. సెకండాఫ్‌ దారి తప్పినట్లు మరికొందరు తమ రివ్యూల్లో చెప్పారు. చాలా తక్కువ మంది మాత్రమే ఓవరాల్‌గా సినిమా బాగుందని, ఇది పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ అని చెప్పడం విశేషం. ఇక క్లైమాక్స్‌లో మైక్‌ టైసన్‌ ఎంట్రీ అదిరిపోయేలా ఉన్నదని మరికొందరు చెప్పారు.

లైగర్‌ మూవీని సుమారు మూడేళ్లపాటు షూట్‌ చేశారు. ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ పూర్తిగా ఓ కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ బాడీ షేప్‌ కోసం అతడు రెండేళ్ల పాటు శ్రమించాడు. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ బాక్సర్‌గా లైగర్‌లో విజయ్‌ కనిపించాడు.

IPL_Entry_Point