తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jyothi Rai: పోస్ట్‌లు చూసి మ‌నోవేద‌న‌కు గుర‌య్యా - వారికి శిక్ష ప‌డాల్సిందే - లీక్‌డ్ వీడియోలపై జ్యోతిరాయ్ రియాక్ట్‌

Jyothi Rai: పోస్ట్‌లు చూసి మ‌నోవేద‌న‌కు గుర‌య్యా - వారికి శిక్ష ప‌డాల్సిందే - లీక్‌డ్ వీడియోలపై జ్యోతిరాయ్ రియాక్ట్‌

09 May 2024, 11:06 IST

  • Jyothi Rai: త‌న అశ్లీల వీడియోలు సోష‌ల్ మీడియాలో లీక‌వ్వ‌డంపై గుప్పెడంత మ‌న‌సు న‌టి జ్యోతి రాయ్ ఫైర్ అయ్యింది. ఈ అశ్లీల వీడియోలు పోస్ట్ చేసిన వారిపై చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్చ‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేసింది.

జ్యోతి రాయ్
జ్యోతి రాయ్

జ్యోతి రాయ్

Jyothi Rai: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ఫేమ్‌ జ్యోతి రాయ్ అశ్లీల వీడియోలు సోష‌ల్ మీడియాలో లీక‌వ్వ‌డం క‌న్న‌డ నాట సంచ‌న‌లంగా మారింది. తొలుత ట్విట్ట‌ర్‌లో EDIT_BY_ABHI అనే అకౌంట్ జ్యోతిరాయ్ చీర‌లో ఉన్న ఓ ఫొటోను పోస్ట్ చేస్తూ తమ దగ్గర ఆమె అశ్లీల వీడియోలు ఉన్నట్లు పోస్ట్ క‌నిపించింది.

ట్రెండింగ్ వార్తలు

Heeramandi 2: హీరామండి వెబ్ సిరీస్‍ రెండో సీజన్ వస్తుందా? డైరెక్టర్, యాక్టర్ ఏం చెప్పారంటే..

OTT Web Series: నేహా శర్మ పాపులర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

త‌న యూట్యూబ్ ఛానెల్ కు 1000 మంది సబ్‌స్క్రైబర్లు కాగానే ఆ అశ్లీల‌ వీడియో అప్‌లోడ్ చేస్తాన‌ని ఈ పోస్ట్‌లో స‌ద‌ర యూజ‌ర్ పేర్కొన్నాడు. జ్యోతిరాయ్ వీడియో తన‌ దగ్గర ఉందని హింట్ ఇస్తూ అందులోని స్క్రీన్ షాట్లను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్‌చేశారు. ఆ త‌ర్వాత జ్యోతిరాయ్‌వి అంటూ ఓ మూడు వీడియోలు, కొన్ని ఫొటోలు కూడా మ‌రికొన్ని ట్విట్ట‌ర్ ఖాతాల్లో క‌నిపించాయి.

జ్యోతిరాయ్ ఫైర్‌...

జ్యోతిరాయ్‌వేన‌ని చెబుతోన్న‌ అశ్లీల వీడియోలు, ఫొటోలు సోష‌ల్‌ మీడియాతో పాటు వాట్స‌ప్‌లో తెగ చ‌క్క‌ర్లు కొడుతోన్నాయి. ఈ లీక్ వీడియోలు, ఫొటోల‌పై జ్యోతిరాయ్ రియాక్ట్ అయ్యింది. త‌న‌తో పాటు త‌న కుటుంబ గౌర‌వ మ‌ర్యాద‌లు, పేరు ప్ర‌తిష్ట‌ల‌కు దిగ‌జార్చ‌డానికే కొంద‌రు ఇలాంటి నీచ‌మైన చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని, వారిపై చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్చ‌ల‌ను తీసుకోవాల‌ని డిమాండ్ చేసింది.

సోష‌ల్ మీడియాలో ఫొటోలు, వీడియోల‌తో పాటు త‌న‌కు వ‌స్తోన్న మెసేజ్‌లు చూసి బాధ‌తో పాటు భ‌యం కూడా క‌లుగుతోంద‌ని జ్యోతిరాయ్ అన్న‌ది. వారి వ‌ల్ల త‌న‌తో పాటు త‌న కుటుంబానికి కూడా హాని ఉంద‌ని త‌న పోస్ట్‌లో పేర్కొన్న‌ది.

వ‌దిలేస్తే న‌ష్టం...

ఈ ఫొటోలు, వీడియోలు చూసి తాను ఎంతో మ‌నోవేద‌న‌కు గుర‌య్యాన‌ని, ఇలాంటి దిగ‌జారుడు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోన్న వారిని ఉపేక్షించి వ‌దిలేస్తే త‌న‌ వ్య‌క్తిగ‌త జీవితానికి భంగం వాటిల్ల‌డ‌మే కాకుండా కెరీర్‌కు తీవ్ర‌మైన న‌ష్టం జ‌రిగే ఆస్కార‌ముంద‌ని జ్యోతి రాయ్ అన్న‌ది.

అశ్లీల వీడియోల‌ను పోస్ట్ చేసిన యూజ‌ర్ల అకౌంట్స్ జ‌త చేస్తూ వారిపై వివిధ సెక్ష‌న్ల ప్ర‌కారం క‌ఠిన చ‌ర్య‌ల‌ను తీసుకోవాల‌ని జ్యోతిరాయ్ డిమాండ్ చేసింది. ఆ సెక్ష‌న్ల‌ను కూడా పేర్కొన్న‌ది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో జ్యోతిరాయ్ చేసిన ఈ పోస్ట్ వైర‌ల్ అవుతోంది. ఈ అశ్లీల వీడియో లీక్ ఘ‌ట‌న‌ల‌తో చాలా మంది ఫ్యాన్స్ జ్యోతిరాయ్‌ను స‌పోర్ట్‌చేస్తున్నారు. ఈ లీక్‌డ్ వీడియోల‌ను పోస్ట్ చేసిన వారితో పాటు ఫార్వ‌ర్డ్ చేసిన వారిని ప‌ట్టుకొని శిక్షించాల‌ని పోలీసుల‌ను డిమాండ్ చేస్తున్నారు.

జ‌గ‌తి పాత్ర ద్వారా...

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో జ‌గ‌తి పాత్ర ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైంది జ్యోతిరాయ్‌. ఈ సీరియ‌ల్‌లో త‌ల్లి పాత్ర‌లో సెంటిమెంట్ రోల్‌లో త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. ఇటీవ‌లే జ్యోతిరాయ్ చ‌నిపోయిన‌ట్లుగా చూపించి సీరియ‌ల్‌లో ఆమె క్యారెక్ట‌ర్‌ను మేక‌ర్స్ ఎండ్ చేశారు.

ప్ర‌స్తుతం తెలుగులో ఏ మాస్ట‌ర్ పీస్ అనే మూవీలో జ్యోతిరాయ్ కీల‌క పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాకు సుకు పూర్వ‌జ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. ఈ సినిమా షూటింగ్‌లోనే జ్యోతిరాయ్ డైరెక్ట‌ర్ సుకు పూర్వ‌జ్‌తో ప్రేమ‌లో ప‌డింద‌ని, వారిద్ద‌రు రిలేష‌న్‌షిప్‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

భ‌ర్త‌తో విడాకులు...

కాగా జ్యోతిరాయ్‌కి ఇదేవ‌ర‌కు పెళ్ల‌యింది. మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో భ‌ర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆమెకు ప‌ద‌కొండేళ్ల కొడుకు ఉన్నాడు. క‌న్న‌డంలో జెర్సీ నంబ‌ర్ 10, దియాతో పాటు ప‌లు సినిమాలు చేసింది జ్యోతిరాయ్‌.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం