తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Fighter Twitter Review: ఫైటర్ ట్విట్టర్ రివ్యూ.. దేశభక్తి మూవీకి అదిరిపోయే టాక్.. హ్యాట్రిక్ కొట్టాడంటూ!

Fighter Twitter Review: ఫైటర్ ట్విట్టర్ రివ్యూ.. దేశభక్తి మూవీకి అదిరిపోయే టాక్.. హ్యాట్రిక్ కొట్టాడంటూ!

Sanjiv Kumar HT Telugu

25 January 2024, 8:26 IST

  • Hrithik Roshan Fighter Twitter Review: హృతిక్ రోషన్, దీపికా పదుకొణె జంటగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫైటర్ మూవీ ట్విట్టర్ రివ్యూ రానే వచ్చేసింది. ఫైటర్ ట్విట్టర్ రివ్యూలో సినిమాపై నెటిజన్స్, ఆడియెన్స్ టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం.

ఫైటర్ ట్విట్టర్ రివ్యూ.. దేశభక్తి మూవీకి అదిరిపోయే టాక్.. హ్యాట్రిక్ కొట్టాడంటూ!
ఫైటర్ ట్విట్టర్ రివ్యూ.. దేశభక్తి మూవీకి అదిరిపోయే టాక్.. హ్యాట్రిక్ కొట్టాడంటూ!

ఫైటర్ ట్విట్టర్ రివ్యూ.. దేశభక్తి మూవీకి అదిరిపోయే టాక్.. హ్యాట్రిక్ కొట్టాడంటూ!

Fighter Movie Twitter Review:బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, హాట్ సుందరి దీపికా పదుకొణె మొదటిసారి జోడీ కట్టిన సినిమా ఫైటర్. ఏరియల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఫైటర్ మూవీకి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఆయన ఇదివరకు బ్యాంగ్ బ్యాంగ్, వార్, పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను అందించారు. బ్యాంగ్ బ్యాంగ్, వార్ సినిమాల తర్వాత హృతిక్ రోషన్‌తో సిద్ధార్థ్ ఆనంద్ చేస్తున్న మూడో సినిమా ఇది.

ట్రెండింగ్ వార్తలు

Yuvaraj OTT: తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన కాంతార హీరోయిన్ మూవీ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏదంటే?

Bollywood Actor: 200 సినిమాల్ని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ న‌టుడు - సూప‌ర్‌స్టార్ కావాల్సినోడు .. సీరియ‌ల్స్ చేస్తోన్నాడు

Prabhas Marriage: ప్రభాస్ లైఫ్‌లోకి స్పెషల్ పర్సన్.. కాబోయే భార్య గురించేనా డార్లింగ్ పోస్ట్?

Baahubali Crown Of Blood OTT: ఓటీటీలోకి వచ్చేసిన బాహుబలి ప్రీక్వెల్.. కానీ, అదొక్కటే నిరాశ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అలాగే.. బచ్నా ఏ హసీనో, పఠాన్ సినిమాల మూవీస్ తర్వాత దీపికా పదుకొణెతో కూడా సిద్ధార్థ్ ఆనంద్ చేస్తున్న మూడో సినిమా ఫైటర్. దీంతో ఫైటర్ మూవీపై బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకరకమైన క్రేజ్ ఏర్పడింది. అలాగే ఫైటర్ మూవీ దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కించారు. ఫైటర్ మూవీని వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ బ్యానర్లపై మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. విశాల్ శేఖర్ సంగీతం అందించగా.. అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు కీలక పాత్రలు చేశారు. రిషబ్ సాహ్ని విలన్‌గా నటించాడు.

ఫైటర్ మూవీని 2024 జనవరి 25న అంటే గురువారం వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫైటర్ ట్విట్టర్ రివ్యూ రానే వచ్చేసింది. ఇప్పటికే పలు షోలు పడగా.. ఫైటర్ మూవీ చూసిన నెటిజన్స్, మూవీ క్రిటిక్స్, ఆడియెన్స్ స్పందిస్తూ ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు.

"ఫైటర్ వన్ వర్డ్ రివ్యూ. ఫైటర్ బ్రిలియంట్. నాలుగున్నర స్టార్ రేటింగ్. వార్, పఠాన్.. ఇప్పుడు ఫైటర్. డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ హ్యాట్రిక్ కొట్టాడు. ఏరియాల్ కంబాట్, డ్రామా, ఎమోషన్స్‌తోపాటు దేశభక్తితో నిండిపోయింది. హృతిక్ రోషన్ సాహసోపేతమైన నటనతో ఫైటర్ ఒక కింగ్ సైజ్ ఎంటర్టైనర్. అస్సలు మిస్ కాకండి. టాప్ క్లాస్ మూవీ. దేశం కోసం నిస్వార్థంగా సేవలు అందిస్తోన్న, దేశ రక్షణ కోసం పాటుపడుతున్న వీరులకు ఫైటర్ ఘన నివాళి అర్పిస్తుంది. సెకండాఫ్ చాలా బాగుంది. ప్రేక్షకులతో క్లాప్స్ కొట్టించే డైలాగ్స్ ఉన్నాయి. లార్జర్ దేన్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే మూవీ ఫైటర్" అని ప్రముఖ క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ రివ్యూ ఇచ్చారు.

"ఫైటర్ రివ్యూ. మూడు పదాల్లో చెప్పాలంటే బ్లాక్ బస్టర్ ఏరియల్ యాక్షనర్. ఫైటర్ మూవీని ఆస్ట్రేలియాలో ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాను. సినిమాను టాప్ నాచ్‌లో సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించాడు. దేశభక్తి ఉన్న ఇలాంటి ఏరియాల్ యాక్షన్‌ను ఇంతవరకు చూడలేదు. ఇలాంటి జోనర్‌లో హృతిక్ రోషన్ మాస్టర్. మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. దీపికా పదుకొణె తన కెరీర్‌లో మంచి ఫేజ్‌లో ఉంది. దాన్ని ఈ సినిమాతో చెడగొట్టుకోలేదు. సెక్సీగా ఉంటూ గట్టి పోటీ ఇచ్చింది. ట్విస్ట్ బాగుంటుంది. అనిల్ కపూర్ మరో సిక్సర్. అతను సినిమాకు ఆత్మలాంటివాడు. మ్యూజిక్ కూడా బాగుంది. ఫైటర్ కచ్చితంగా బ్లాక్ బస్టర్. హృతిక్ రోషన్‌కు అతిపెద్ద గ్రాసర్ మూవీ అవుతుంది" అని 4 స్టార్ రేటింగ్ ఇచ్చాడు ఒక నెటిజన్.

"ఫైటర్ మూవీ కచ్చితంగా చూడాల్సిన సినిమా. అస్సలు మిస్ అవ్వకండి. నాలుగున్నర స్టార్ రేటింగ్. ఆకాశమే హద్దుగా ఉంది సినిమా. జస్ట్ వావ్. సెకండాఫ్ టెర్రిఫిక్‌గా ఉంది. లార్డ్ సిద్ధార్థ్ ఆనంద్ గొప్ప విజనరీ డైరెక్టర్. వార్, పఠాన్ తర్వాత ఫైటర్‌తో హ్యాట్రిక్ కొట్టాడు. హృతిక్ రోషన్ సూపర్ స్టార్. 2024 సంవత్సరాన్ని బ్లాక్ బస్టర్‌తో ప్రారంభించాడు. 2024లో రిపబ్లిక్ డేకు ఫైటర్ కంటే మెరుగ్గా ఏది ఉండదు" అని మూవీ హబ్ రివ్యూ ఇచ్చింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం