తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Game Changer Jaragandi Song: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జరగండి సాంగ్ వచ్చేస్తోంది

Game Changer Jaragandi Song: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జరగండి సాంగ్ వచ్చేస్తోంది

Hari Prasad S HT Telugu

07 November 2023, 15:08 IST

    • Game Changer Jaragandi Song: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. గేమ్ ఛేంజర్ మూవీ నుంచి ఎంతో ఆసక్తి రేపుతున్న జరగండి సాంగ్ వచ్చేస్తోంది. ఇండియాలోనే అతి భారీ బడ్జెట్ సాంగ్ గా ఈ పాట నిలిచిన విషయం తెలిసిందే.
గేమ్ ఛేంజర్ సాంగ్ జరగండిలో రామ్ చరణ్
గేమ్ ఛేంజర్ సాంగ్ జరగండిలో రామ్ చరణ్

గేమ్ ఛేంజర్ సాంగ్ జరగండిలో రామ్ చరణ్

Game Changer Jaragandi Song: రామ్ చరణ్ నెక్ట్స్ మూవీ గేమ్ ఛేంజర్ నుంచి మొత్తానికి ఓ కీలకమైన అప్డేట్ వచ్చింది. ఈ మూవీ నుంచి జరగండి అనే సాంగ్ దీపావళికి రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ మంగళవారం (నవంబర్ 7) సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన పోస్టర్ కొన్ని రోజుల కిందట రిలీజైన విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు

Katrina Kaif: హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీపై రూమర్లు.. స్పందించిన టీమ్!

Raajadhani Files TV Premiere: పోలింగ్‍కు ఒక్క రోజు ముందు టీవీ ఛానెల్‍లో రాజధాని ఫైల్స్ సినిమా.. టెలికాస్ట్ టైమ్ ఇదే

Kannappa Movie: ఒక క్యారెక్టర్ చెబితే ప్రభాస్ మరొకటి చేస్తానన్నారు.. ఆ విషయంలో పుకార్లు వద్దు: మంచు విష్ణు

OTT Telugu Latest Releases: ఈవారం తెలుగులో ఓటీటీల్లోకి వచ్చిన 5 సినిమాలు ఇవే.. ఈ వీకెండ్ ప్లాన్ చేసుకోండి!

భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ జరగండి పాటపై రామ్ చరణ్ అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. తన పాటల్లో భారీతనం చూపించే అలవాటు ఉన్న డైరెక్టర్ శంకర్.. ఈ జరగండి పాటను కూడా అదే రేంజ్ లో చిత్రీకరించినట్లు మూవీ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ గేమ్ ఛేంజర్ మూవీ ఆడియో హక్కులను ప్రముఖ సంస్థ సారెగామ దక్కించుకున్నట్లు కూడా ఈ సందర్బంగా మేకర్స్ తెలిపారు.

ఈ ఫస్ట్ సింగిల్ దీపావళికి వస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా చెప్పారు. ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్ కూడా చాలా కలర్‌ఫుల్ గా కనిపిస్తోంది. ఇక ఈ గేమ్ ఛేంజర్ సాంగ్ లీకైన కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసిన మరుసటి రోజే మూవీ ఆడియో హక్కులు, ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్ రావడం గమనార్హం. గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది.

దిల్ రాజు సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. నిజానికి ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలవాలని అభిమానులు ఆశించినా.. షూటింగ్ చాలా ఆలస్యమవుతోంది. ఓవైపు ఇండియన్ 2 సినిమా చేస్తూనే మరోవైపు శంకర్ ఈ గేమ్ ఛేంజర్ కూడా చేస్తున్నాడు. ఇండియన్ 2 నుంచి ఈ మధ్యే ఇంట్రో వీడియో కూడా రిలీజైన విషయం తెలిసిందే.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం