Ram Charan Mahesh Babu: ఒకే ఫ్రేములో రామ్ చరణ్, మహేష్ బాబు ఫ్యామిలీస్.. ఫొటో వైరల్
Ram Charan Mahesh Babu: ఒకే ఫ్రేములో రామ్ చరణ్, మహేష్ బాబు ఫ్యామిలీస్ కనిపించాయి. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. ఓ ప్రైవేట్ పార్టీలో ఈ అరుదైన కలయిక సాధ్యమైంది.
Ram Charan Mahesh Babu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకే ఫ్రేములో కనిపించడమే అత్యంత అరుదు. అలాంటిది ఈ ఇద్దరు స్టార్లూ తమ ఫ్యామిలీస్ తో కలిసి ఫొటోలకు పోజులివ్వడం ఎలా ఉంటుందో ఊహించుకోండి. ప్రస్తుతం అదే జరిగింది. చరణ్, మహేష్ తమ కుటుంబాలతో కలిసి ఫొటోకు పోజులిచ్చారు.
ఓ ప్రైవేట్ పార్టీలో ఈ ఇద్దరి కుటుంబాలు ఇలా కలిశాయి. ఈ ఫొటో ప్రస్తుతం ఇంటర్నెట్ ను ఊపేస్తోంది. రామ్ చరణ్, మహేష్ బాబుతోపాటు ఈ ఫొటోలో ఉపాసన, నమ్రతా, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే ఇందులో వీళ్ల పిల్లలు మాత్రం కనిపించలేదు. ఉపాసన తన ఫేవరెట్ కుక్క పిల్లను ఎత్తుకొని ఫొటోలకు పోజులిచ్చింది. ఇదే పార్టీలో వెంకటేశ్ తోనూ మహేష్ బాబు కనిపించాడు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో హుందాగా ఉండే ఈ ఇద్దరు స్టార్లు బయట చాలా తక్కువగా మాట్లాడుతుంటారు. రామ్ చరణ్ అప్పుడప్పుడూ బయట కనిపించినా.. మహేష్ మాత్రం చాలా అరుదుగా ప్రైవేట్ పార్టీల్లో కనిపిస్తుంటాడు. అలాంటిది ఈ ఇద్దరూ ఫ్యామిలీస్ తో ఇలా కలవడం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్య పోతున్నారు. మొన్న వరుణ్ తేజ్ పెళ్లిలో మెగా హీరోలంతా ఒకే ఫ్రేములో కనిపించిన ఫొటో ఎలా వైరల్ అయిందో ఈ ఫొటో కూడా అలాగే మారింది.
ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్ హీరోలు తమ నెక్ట్స్ సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత వచ్చిన ఆచార్య ఢమాల్ అనడంతో చెర్రీ గేమ్ ఛేంజర్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. శంకర్ తో చేస్తున్న ఈ సినిమా చాలా ఆలస్యమవుతోంది. ఇంకా షూటింగ్ కొనసాగుతూనే ఉంది. వచ్చే ఏడాది సమ్మర్ హాలిడేస్ లో గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ఈ మధ్యే వరుణ్, లావణ్య పెళ్లి కోసం ఇటలీ వెళ్లి వచ్చిన చరణ్.. మళ్లీ ఈ మూవీ షూటింగ్ లో బిజీ కానున్నాడు. మరోవైపు సంక్రాంతి రిలీజ్ కు సిద్ధమవుతున్న గుంటూరు కారంతో మహేష్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ దమ్ మసాలా మంగళవారం (నవంబర్ 7) ఫ్యాన్స్ ముందుకు రానుండగా.. ఇప్పటికే ప్రోమో రిలీజ్ చేశారు. ఈ సినిమా తర్వాత రాజమౌళితో ఓ భారీ బడ్జెట్ సినిమా చేయనున్నాడు మహేష్ బాబు.
టాపిక్