తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aavesham Box Office: మలయాళంలో మరో బిగ్గెస్ట్ హిట్.. ఫహాద్ ఫాజిల్ ఆవేశం కలెక్షన్స్ అదుర్స్

Aavesham Box Office: మలయాళంలో మరో బిగ్గెస్ట్ హిట్.. ఫహాద్ ఫాజిల్ ఆవేశం కలెక్షన్స్ అదుర్స్

Sanjiv Kumar HT Telugu

12 April 2024, 12:33 IST

  • Aavesham Box Office Collections Day 1: మలయాళంలో మరో సినిమా సూపర్ క్రేజ్ తెచ్చుకుంటోంది. పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ హీరోగా జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆవేశం'. ఈ సినిమాకు తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

మలయాళంలో మరో బిగ్గెస్ట్ హిట్.. ఫహాద్ ఫాజిల్ ఆవేశం కలెక్షన్స్ అదుర్స్
మలయాళంలో మరో బిగ్గెస్ట్ హిట్.. ఫహాద్ ఫాజిల్ ఆవేశం కలెక్షన్స్ అదుర్స్

మలయాళంలో మరో బిగ్గెస్ట్ హిట్.. ఫహాద్ ఫాజిల్ ఆవేశం కలెక్షన్స్ అదుర్స్

Aavesham Box Office Collections: మలయాళ సినీ ఇండస్ట్రీలో తోపు యాక్టర్స్‌లలో ఫహాద్ ఫాజిల్ ఒకరు. కరోనా తర్వాత ఓటీటీల ద్వారా నేషనల్ వైడ్‌గా పేరు క్రేజ్ తెచ్చుకున్న ఆయన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో మరింత పాపులర్ అయ్యారు. హీరోగా, యాక్టర్‌గా, విలన్‌గా అదరగొడుతూ సత్తా చాటుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Blink OTT Streaming: వీకెండ్‌లో ఈ కన్నడ సై-ఫి థ్రిల్లర్ మూవీ అస్సలు మిస్ కావద్దంటున్న ఓటీటీ ప్రేక్షకులు

Flop Movies With super hit songs: పాట హిట్.. బొమ్మ ఫట్.. తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్న ఫ్లాప్ మూవీస్ ఇవే

Korean Movies in Cannes: కేన్స్‌లో దుమ్ము రేపిన ఈ కొరియన్ సినిమాలను ఏ ఓటీటీల్లో చూడాలంటే..

Love Me Trailer: భయపెడుతున్న వైష్ణవి చైతన్య లవ్ మి ట్రైలర్.. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు?

ఫుల్ పాజిటివ్ టాక్

ఫహద్ ఫాజిల్ నటించిన మలయాళ సినిమా ఆవేశం. జీతూ మాధవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మంచి ఆదరణ వస్తోంది. ఏప్రిల్ 11న మలయాళంలో విడుదలైన ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి ఫుల్ పాజిటివ్ టాక్ వస్తోంది. అలాగే ఈ మూవీకి తొలిరోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ అదిరిపోయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఆవేశం డే 1 కలెక్షన్స్

ఆవేశం సినిమా తొలి రోజున డీసెంట్ ఓపెనింగ్స్ అందుకుంది. ట్రేడ్ వర్గాల నివేదికల ప్రకారం.. ఈ మలయాళ చిత్రం గురువారం భారతదేశంలో రూ. 3.26 కోట్లు వసూలు చేసింది. అంతేకాకుండా గురువారం మొత్తం 73.57 శాతం మలయాళ ఆక్యుపెన్సీని కలిగి ఉంది. ఉదయం షోలకు 62.97 శాతం, మధ్యాహ్నం షోలకు 73.67 శాతం, సాయంత్రం షోలకు 78.85 శాతం, రాత్రి షోలకు 78.78 శాతంగా ఆక్యుపెన్సీ నమోదు అయింది.

హైదరాబాద్‌లోనూ క్రేజ్

ఇక హైదరాబాద్‌లో అత్యధికంగా 94 శాతం ఆక్యుపెన్సీతో ఈ ఆవేశం చిత్రం రికార్డు సృష్టించింది. ఇది తెలుగులో పుష్ప విలన్ క్రేజ్ అని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమాను అన్వర్ రషీద్ ఎంటర్టైన్మెంట్స్, ఫహద్ ఫాజిల్ అండ్ ఫ్రెండ్స్ సంయుక్తంగా నిర్మించారు.

విమర్శకుల ప్రశంసలు

ఆవేశం సినిమాలో ఫహాద్ ఫాజిల్, ఆశిష్ విద్యార్థి, మన్సూర్ అలీ ఖాన్, సజిన్ గోపు కీలక పాత్రలు పోషించారు. రంగాగా ఫహాద్ నటనను, అంబన్‌గా సజిన్ నటనను అభిమానులు, ఆడియెన్స్ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అంతేకాకుండా విమర్శకుల నుంచి సైతం అవేశం సినిమా పాజిటివ్ రివ్యూలు తెచ్చుకుంది.

బెంగళూరు డాన్‌గా

ఈ సినిమా మత్సకారులకు సంబంధించినదిగా టాక్. ఓ ముగ్గురు కాలేజీ స్టూడెంట్స్ అనుకోని పరిస్థితులలో చిక్కుకుంటారు. ఆ తర్వాత వారి జీవితాల్లో ఏర్పడిన పరిణామాల కథాంశంగా ఆవేశం తెరెకక్కించారు. ఈ సినిమాలో ఫహద్ బెంగళూరుకు చెందిన డాన్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక ఫహద్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా ఇదే అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.

100 కోట్లు కలెక్ట్ చేస్తుంది

అలాగే మలయాళంలో ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ సినిమాల తర్వాత వాటి జాబితాలో ఆవేశం కూడా నిలిచిపోతుందని అంటున్నారు. సినిమాపై ట్విట్టర్‌లో అభిమానులు తెగ పొగుడుతూ ట్వీట్స్ చేస్తున్నారు. 

"అవేశం మూవీ చాలా కామెడీ, యాక్షన్‌తో సూపర్ ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది", "ఫాఫా (ఫహాద్ ఫాజిల్)ను ఇంతకు ముందెన్నడూ అత్యంత కమర్షియల్‌గా చూడలేదు. ఫహద్ ఫాజిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలవడం ఖాయం. మాలీవుడ్ లో రూ.100 కోట్ల వసూళ్లు సాధిస్తుంది" అని ఒకరు ట్వీట్ చేశారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం