తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Animal In Netflix: ఓటీటీలో అన్ని రికార్డులూ బ్రేక్ చేసిన యానిమల్.. ఆర్ఆర్ఆర్‌కూ సాధ్యం కాలేదు

Animal in Netflix: ఓటీటీలో అన్ని రికార్డులూ బ్రేక్ చేసిన యానిమల్.. ఆర్ఆర్ఆర్‌కూ సాధ్యం కాలేదు

Hari Prasad S HT Telugu

07 February 2024, 14:54 IST

    • Animal in Netflix: రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన యానిమల్ మూవీ థియేటర్లలోనేకాదు.. ఓటీటీలోనూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. గత నెలలోనే నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైన ఈ మూవీ.. పది రోజుల్లోనే రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంది.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రికార్డులు బ్రేక్ చేస్తున్న యానిమల్ మూవీ
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రికార్డులు బ్రేక్ చేస్తున్న యానిమల్ మూవీ

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రికార్డులు బ్రేక్ చేస్తున్న యానిమల్ మూవీ

Animal in Netflix: సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన యానిమల్ పై ఎన్ని విమర్శలు వచ్చినా, వస్తున్నా కూడా ఇప్పటికీ ఓటీటీలోనూ రికార్డుల పరంపర కొనసాగిస్తూనే ఉంది. జనవరి 26న నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ మూవీ.. రిలీజైనప్పటి నుంచీ టాప్ ట్రెండింగ్స్ లోనే ఉండటం విశేషం. అంతకు వారం ముందు వచ్చిన సలార్ మూవీని వెనక్కి నెట్టి ఈ ఓటీటీలో అన్ని ఇండియన్ మూవీస్ రికార్డులను బ్రేక్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Prabhas Instagram Story: ప్రభాస్ పెళ్లి కాదు.. అతని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వెనుక అసలు విషయం ఇదీ

Preminchoddu: షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడు.. మూడేళ్లు కష్టపడి సినిమా తీశాడు.. హీరో కామెంట్స్

Suriya Kanguva: సూర్య కంగువ.. పది వేల మందితో సూర్య, బాబీ డియోల్ వార్ సీన్ షూటింగ్

Kajal Agarwal Kannappa: మంచు విష్ణు కన్నప్పలో కాజల్ అగర్వాల్.. అప్పుడు చెల్లెలిగా ఇప్పుడు?

ఓటీటీలో యానిమల్ దూకుడు

రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా కలిసి నటించిన యానిమల్ మూవీకి 10 రోజుల్లోనే ఏకంగా ఏకంగా 3.93 కోట్ల గంటల వ్యూయర్‌షిప్ నమోదు కావడం విశేషం. తొలి వారంలో ఇండియన్ టాప్ ట్రెండింగ్ చార్ట్స్ లో నంబర్ వన్ గా నిలిచిన ఈ సినిమా.. రెండో వారం కూడా అదే దూకుడు కొనసాగిస్తోంది. ఇప్పటికే ఆల్ టైమ్ అత్యధిక వ్యూయర్‌షిప్ సాధించిన ఇండియన్ సినిమాగా యానిమల్ నిలిచింది.

ఇండియన్ నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్స్ లో నంబర్ వన్ సినిమాగా ఉన్న యానిమల్.. ఇంగ్లిషేతర సినిమాల్లో ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో ఉండటం విశేషం. నెట్‌ఫ్లిక్స్ లో తొలి వారంలో ఇండియాలో ఎక్కువ మంది చూసిన సినిమా ఇదే. ఇదే ఊపులో 10 రోజుల్లోనే ఈ ఓటీటీలో అత్యధిక మంది చూసిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

యానిమల్ మూవీకి ఇప్పటి వరకూ 55 లక్షల వ్యూస్ వచ్చినట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది. ఈ మూవీ నిడివి 3 గంటల 21 నిమిషాలుగా ఉంది. దీంతో మొత్తంగా చూస్తే 3.93 కోట్ల గంటల వ్యూయర్షిప్ నమోదైంది.

ఆర్ఆర్ఆర్ రికార్డు బ్రేక్

ఆర్ఆర్ఆర్ మూవీ గతంలో నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన తొలి 10 రోజుల్లో అత్యధిక వ్యూయర్‌షిప్ సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. ఆ మూవీకి 2.55 కోట్ల గంటల వ్యూయర్‌షిప్ వచ్చింది. గతేడాది షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీకి కూడా ఇదే స్థాయిలో నమోదైంది.

ఇప్పుడా రెండు సినిమాల కంటే చాలా ఎక్కువ వ్యూయర్‌షిప్ ను యానిమల్ సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైన ఏ సినిమాకూ ఈ స్థాయిలో ఆదరణ లభించలేదు. థియేటర్లలో రూ.900 కోట్లకుపైగా వసూలు చేసిన యానిమల్.. ఓటీటీలోనూ అదే స్థాయిలో సత్తా చాటుతోంది.

సలార్ డౌన్

మరోవైపు ప్రభాస్ నటించిన సలార్ మూవీ కూడా జనవరి 20న నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చింది. తొలి వారంలో టాప్ ట్రెండింగ్స్ లో నంబర్ వన్ గా ఆ సినిమా నిలిచింది. కానీ జనవరి 26న యానిమల్ అడుగుపెట్టిన తర్వాత కథ మారిపోయింది. సలార్ మళ్లీ నంబర్ వన్ లోకి రాలేకపోయింది.

ఓటీటీలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే యానిమల్ టాప్ లోకి వెళ్లి అదే స్థానంలో కొనసాగుతోంది. సలార్ మూవీ హిందీ వెర్షన్ రిలీజ్ కాకపోవడం కూడా యానిమల్ కు కలిసి వచ్చిందని చెప్పాలి. ఇప్పుడు కూడా యానిమల్ ఫస్ట్ ప్లేస్ లో, సలార్ ఐదో స్థానంలో ఉన్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం