తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Teaser Release Time: గెట్ రెడీ.. పుష్ప 2 టీజర్ రిలీజ్‍కు టైమ్‍ కూడా ఖరారు.. ఇంటెన్స్‌గా కొత్త పోస్టర్

Pushpa 2 Teaser Release Time: గెట్ రెడీ.. పుష్ప 2 టీజర్ రిలీజ్‍కు టైమ్‍ కూడా ఖరారు.. ఇంటెన్స్‌గా కొత్త పోస్టర్

07 April 2024, 16:58 IST

    • Pushpa 2 Teaser Release Time: పుష్ప 2 సినిమా టీజర్ విడుదలకు టైమ్‍ను కూడా మూవీ టీమ్ ఖరారు చేసింది. ఈ విషయంపై అధికారిక ప్రకటన చేసింది. 
Pushpa 2 Teaser Release Time: గెట్ రెడీ.. పుష్ప 2 టీజర్ రిలీజ్‍కు టైమ్‍ కూడా ఖరారు.. కొత్త పోస్టర్ కూడా..
Pushpa 2 Teaser Release Time: గెట్ రెడీ.. పుష్ప 2 టీజర్ రిలీజ్‍కు టైమ్‍ కూడా ఖరారు.. కొత్త పోస్టర్ కూడా..

Pushpa 2 Teaser Release Time: గెట్ రెడీ.. పుష్ప 2 టీజర్ రిలీజ్‍కు టైమ్‍ కూడా ఖరారు.. కొత్త పోస్టర్ కూడా..

Pushpa 2 Teaser Release Time: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సందర్భానికి టైమ్ ఖరారైంది. పుష్ప 2: ది రూల్ సినిమా టీజర్‌ రిలీజ్ టైమ్ కూడా ఫిక్స్ అయింది. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 8వ తేదీన ఈ టీజర్ వస్తోంది. ఈ విషయం ఇటీవలే వెల్లడి కాగా.. టైమ్‍ను నేడు (ఏప్రిల్ 7) ప్రకటించింది మూవీ టీమ్. పుష్ప 2: ది రూల్ టీజర్ విడుదల ముహూర్తాన్ని వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

Katrina Kaif: హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీపై రూమర్లు.. స్పందించిన టీమ్!

Raajadhani Files TV Premiere: పోలింగ్‍కు ఒక్క రోజు ముందు టీవీ ఛానెల్‍లో రాజధాని ఫైల్స్ సినిమా.. టెలికాస్ట్ టైమ్ ఇదే

Kannappa Movie: ఒక క్యారెక్టర్ చెబితే ప్రభాస్ మరొకటి చేస్తానన్నారు.. ఆ విషయంలో పుకార్లు వద్దు: మంచు విష్ణు

OTT Telugu Latest Releases: ఈవారం తెలుగులో ఓటీటీల్లోకి వచ్చిన 5 సినిమాలు ఇవే.. ఈ వీకెండ్ ప్లాన్ చేసుకోండి!

టైమ్ ఇదే

పుష్ప 2: ది రూల్ సినిమా టీజర్ రేపు (ఏప్రిల్ 8) ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా నేడు వెల్లడించింది. గూజ్‍బంప్స్ గ్యారెంటీ అంటూ పోస్ట్ చేసింది.

“రేపే ఆరోజు. ఉదయం 11.07 గంటలకు వచ్చేస్తోంది. బాక్సాఫీస్‍ను గడగడలాడించే పుష్పరాజ్ ఎంట్రీని పుష్ప 2 ది రూల్ టీజర్ తీసుకొస్తోంది. గూజ్‍బంప్స్ గ్యారంటీ” అని ఆ మూవీ టీమ్ ట్వీట్ చేసింది.

కొత్త పోస్టర్ రిలీజ్

టీజర్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా పుష్ప 2 సినిమా నుంచి అల్లు అర్జున్ కొత్త పోస్టర్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో.. సింహాసనంలా గ్రాండ్‍గా ఉన్న కుర్చీపై కూర్చున్న అల్లు అర్జున్ గొడ్డలి పట్టుకున్నారు. ఆ గొడ్డలికి రక్తపు మరకలు ఉన్నాయి. ఇంటెన్స్‌గా ఈ పోస్టర్ ఉంది. అల్లు అర్జున్ వెనుక జగదీశ్ ప్రతాప్ భండారీ సహా మరికొందరు ఉన్నారు.

“అన్ని ఇబ్బందులను దాటివచ్చి అతడు ఎగిగాడు. ఇక ఇప్పుడు పరిపాలించేందుకు వచ్చేస్తున్నాడు” అంటూ ఈ నయా పోస్టర్‌ను మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. పుష్ప 2 ది రూల్ మూవీ టీజర్ సిద్దమైందని కూడా నేడే అప్‍డేట్ ఇచ్చింది మూవీ టీమ్. ఇన్ స్టూడియో ఫొటోను కూడా పోస్ట్ చేసింది.  

'పుష్ప 1 ది రైజ్' సినిమా 2021లో వచ్చి సెన్సేషనల్ హిట్ అయింది. గ్లోబల్ రేంజ్‍లో అల్లు అర్జున్ పాపులర్ అయ్యారు. తెలుగు, హిందీ సహా రిలీజైన అన్ని భాషల్లో ఈ చిత్రం వసూళ్ల సునామీ సృష్టించింది. దానికి సీక్వెల్‍గా సుమారు మూడేళ్ల తర్వాత వస్తున్న పుష్ప 2: ది రూల్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. బాక్సాఫీస్ రికార్డులను ఈ చిత్రం బద్దలుకొడుతుందనే ఎక్స్‌పర్టేషన్స్ ఉన్నాయి.  

సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప 2 చిత్రంలో భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉండనున్నాయి. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే పూర్తికానుంది. ప్రస్తుతం చిత్రీకరణ జోరుగా సాగుతోంది. ఈ మూవీలో అల్లు అర్జున్‍కు జోడీగా హీరోయిన్ రష్మిక మందన్నా నటిస్తున్నారు. మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్, జగదీశ్ ప్రతాప్ భండారీ, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి దేవీ శ్రీప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నారు. 

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం