Pushpa 2 Teaser: పుష్ప 2 టీజర్ రెడీ.. ఆల్‍సెట్ అంటూ అప్‍డేట్ ఇచ్చిన మూవీ టీమ్: వివరాలివే..
Pushpa 2 Teaser Release: పుష్ప 2 టీజర్ రెడీ అయింది. ఈ విషయంపై మూవీ టీమ్ మరోసారి అప్‍డేట్ ఇచ్చింది. ఆల్ సెట్ అంటూ ఓ ఫొటో పోస్ట్ చేసింది. ఆ వివరాలివే..
Pushpa 2 Teaser Release: ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘పుష్ప 2: ది రూల్’ ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ హైవోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా కోసం సినీ ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్నారు. సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్ బస్టర్ పుష్ప: ది రైజ్‍కు సీక్వెల్‍గా వస్తున్న ‘పుష్ప: ది రూల్’ ఆగస్టు 15వ తేదీన విడుదల కానుంది. ఫుల్ క్రేజ్ ఉన్న ఈ చిత్రం నుంచి టీజర్ వచ్చేందుకు రెడీ అయింది. రేపు (ఏప్రిల్ 8) ఈ సినిమా టీజర్ రానుంది.
అంతా రెడీ
హీరో అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా రేపు (ఏప్రిల్ 8) పుష్ప 2 టీజర్ రానుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ ఇటీవలే అధికారికంగా ప్రకటించింది. అయితే, ఈ టీజర్ అంతా సిద్ధమైందంటూ నేడు (ఏప్రిల్ 7) అప్‍డేట్ ఇచ్చింది. టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ఆల్‍సెట్ అని పేర్కొంది.
టీజర్ పనులు పూర్తయినట్టు ఇన్‍స్టూడియో ఫొటోలను పుష్ప 2 టీమ్ పోస్ట్ చేసింది. “హై అలర్ట్. పుష్ప 2 ది రూల్ టీజర్ రేపు వచ్చేస్తోంది. దేశం మొత్తం ఉర్రూతలూగనుంది” అని మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది.
పుష్ప 2 టీజర్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2021లో పుష్ప చిత్రం తెలుగుతో పాటు హిందీలోనూ భారీ బ్లాక్ బస్టర్ అయింది. అల్లు అర్జున్ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్‍కు వెళ్లింది. బన్నీ యాక్టింగ్, మేనరిజమ్స్, యాక్టింగ్, డ్యాన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. హిందీ ప్రేక్షకులు కూడా పుష్ప 2 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దీంతో.. ఈ మూవీ టీజర్ వ్యూస్, లైక్‍ల విషయంలో రికార్డులను బద్దలుకొట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
మాస్ ‘జాతర’
పుష్ప 2 చిత్రాన్ని భారీ యాక్షన్ సీక్వెన్సులతో గ్రాండ్ స్కేల్‍లో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్. ఈ మూవీలో జాతర సీక్వెన్స్ హైలైట్‍గా ఉంటుందని టాక్ వచ్చింది. ఈ టీజర్లోనూ జాతర ఎపిసోడ్ ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది. పుష్ప మాస్ జాతర అంటూ టీమ్ టీజ్ చేస్తోంది. అలాగే, టీజర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ కూడా జాతరకు సంబంధించినదే.
పుష్ప 2 చిత్రంలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్‍గా శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్నా నటిస్తున్నారు. ఇటీవల రష్మిక పుట్టిన రోజు సందర్భంగా రష్మిక కొత్త పోస్టర్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. పుట్టుచీర కొట్టుకొని, భారీగా ఆభరణాలు ధరించిన రష్మిక లుక్ ఆకట్టుకుంది.
పుష్ప 2 మూవీలో ఎస్‍పీ భన్వర్ సింగ్ షెకావత్‍గా ఫాహద్ ఫాజిల్‍ది కీలకపాత్రగా ఉంది. జగదీప్ ప్రతాప్ భండారీ, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ, రావు రమేశ్, ధనుంజయ ఈ మూవీలో కీరోల్స్ చేశారు. ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేనీ, యలమంచిలి రవిశంకర్ ప్రొడ్యూజ్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
టాపిక్