తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Writer Padmabhushan Trailer: అరకొర రైటర్‌కు అంతులేని కష్టాలు.. సుహాస్ కామెడీ సూపర్

Writer Padmabhushan Trailer: అరకొర రైటర్‌కు అంతులేని కష్టాలు.. సుహాస్ కామెడీ సూపర్

20 January 2023, 17:19 IST

    • Writer Padmabhushan Trailer: టాలీవుడ్ నటుడు సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం రైటర్ పద్మభూషణ్. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 3న విడుదల కానుంది.
రైటర్ పద్మభూషణ్ ట్రైలర్ విడుదల
రైటర్ పద్మభూషణ్ ట్రైలర్ విడుదల

రైటర్ పద్మభూషణ్ ట్రైలర్ విడుదల

Writer Padmabhushan Trailer: కలర్ ఫొటో సినిమాతో హీరోగా అరంగేట్రం చేసి తొలి చిత్రంతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు కమెడియన్ సుహాస్. ఈ సినిమాలో అతడు కామెడీతో పాటు ఎమోషనల్‌గానూ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం అతడు మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు ముందుకొస్తున్నాడు. అదే రైటర్ పద్మభూషణ్ సినిమా. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాట, గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్‌లు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

సుహాస్ నటించిన రైటర్ పద్మభూషణ్ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. సుహాస్ తన దైన కామెడీతో అలరించాడు. ట్రైలర్ ఆద్యంతం హాస్యభరితంగా సాగింది. కామెడీ డైలాగులు, పంచులతో ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగించింది.

అనగనగా మన విజయవాడ మహానగరంలో నెల బడ్జెట్‌లో వెయ్యి రూపాయలు మిగిలినా పొంగిపోయే నాన్న, సీరియల్స్‌లో ట్విస్టులు ముందే కనిపెట్టే అమ్మ, రాబోయే కాలంలో కాబోయే గొప్ప రైటర్‍‌ను అని పీళయ్యే నేను అంటూ సుహాస్ పలికే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రంలో సుహాస్ సరసన టీనా శిల్పరాజ్ హీరోయిన్‌గా చేస్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ చిత్రానికి షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహిస్తున్నాడు. విజయవాడ నేపథ్యంలో ఈ సినిమా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆశిశ్ విద్యార్థి, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్‌లో ఈ సినిమా రుపొందుతోంది. ఫిబ్రవరి 3న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం