Bindu Madhavi Web Series: బిగ్‌బాస్ విన్నర్ బిందుమాధవి లాంగ్ గ్యాప్ తర్వాతvవెబ్‌సిరీస్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. యాంగర్ టేల్స్ పేరుతో రూపొందుతోన్న ఈ వెబ్‌సిరీస్ త్వరలోనే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.,యాంగర్ టేల్స్ టీజర్‌ను సోమవారం రిలీజ్ చేశారు. నలుగురి జీవితాలు, నాలుగు కథలతో ఈ సిరీస్ తెరకెక్కుతోంది. ఇందులో రాధ అనే పాత్రలో బిందుమాధవి కనిపించబోతున్నది. పూజగా మడోనా సెబాస్టియన్ నటిస్తోంది. రంగ, గిరి అనే మరో రెండు పాత్రలను టీజర్‌లో చూపించారు.,ఈ సిరీస్‌లో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ తరుణ్ భాస్కర్, వెంకటేష్ మహా నటిస్తున్నారు. వారితో పాటు సుహాస్ కీలక పాత్ర పోషిస్తోన్నాడు. అందరి ఎజెండా ఒకటే తిరగుబాటు అంటూ టీజర్‌లో కనిపిస్తోన్న అక్షరాలు ఆసక్తిని పంచుతున్నాయి. ఇందులో గృహిణిగా బిందుమాధవి కనిపిస్తుండగా మోడ్రన్ యువతిగా మడోన్నా సెబాస్టియన్ నటిస్తోంది. సుహాస్ మాస్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు.,యాంగర్ టేల్స్ సిరీస్‌కు సుహాన్ ఓ నిర్మాతగా వ్యవహరిస్తోన్నాడు. ఈ సిరీస్‌తోనే అతడు ప్రొడ్యూసర్‌గా అరంగేట్రం చేస్తున్నాడు. తిలక్ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచిన తర్వాత బిందుమాధవి చేస్తోన్న ఫస్ట్ వెబ్ సిరీస్ ఇది.,అవకాయ్ బిర్యానీ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది బిందుమాధవి. బంపర్ ఆఫర్, పిల్ల జమీందార్ సినిమాలు చేసింది. కానీ ఆ తర్వాత పరాజయాల కారణంగా టాలీవుడ్‌కు దూరమైన బిందుమాధవి సుదీర్ఘ విరామం తర్వాత యాంగర్ టేల్స్ సిరీస్‌తో తెలుగులో రీఎంట్రీ ఇవ్వబోతున్నది., ,