తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ktr Comments: హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే కుట్ర జరుగుతోందన్న Ktr, కాంగ్రెస్‌, బీజేపీ ఒక్కటయ్యాయని ఆరోపణ

KTR Comments: హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే కుట్ర జరుగుతోందన్న KTR, కాంగ్రెస్‌, బీజేపీ ఒక్కటయ్యాయని ఆరోపణ

Sarath chandra.B HT Telugu

29 April 2024, 7:56 IST

    • KTR Comments: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఒక్కటయ్యాయని హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే కుట్రలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. 
హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తున్నారన్న కేటీఆర్
హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తున్నారన్న కేటీఆర్

హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తున్నారన్న కేటీఆర్

KTR Comments: సార్వత్రిక ఎన్నికల్లో Congress కాంగ్రెస్ , BJP బీజేపీలు ఒక్కట్టయ్యాయని, వాటిని ప్రశ్నించేందుకు BRS బిఆర్ఎస్ ను గెలిపించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కేటిఆర్ విజ్ఞప్తి చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Mamata Banerjee: ‘కేంద్రంలో ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతిస్తాం’: మమతా బెనర్జీ

Factcheck: ఇండియా టుడే, టైమ్స్ నౌ సహా సంస్థలు ఎటువంటి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయలేదు

EC Serious On CS DGP : ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్- సీఎస్, డీజీపీలకు నోటీసులు

CEO AP Meena: నాలుగు దశల్లో దేశంలోనే అత్యధికం.. ఏపీలో82శాతం పోలింగ్‌ నమోదు.. పట్టణ ప్రాంతాల్లో పెరిగిన ఓటింగ్

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తే Hyderabadహైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా మారుతుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ రెండు పార్టీలు ఒక్కటై బిఆర్ఎస్ ను ఓడించేందుకు కుట్ర పన్నుతున్నాయని విమర్శించారు. ఆ కుట్రను అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గంలో కేటిఆర్ సుడిగాలి పర్యటనతో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్ తో కలిసి ప్రచారం నిర్వహించారు. వేములవాడ, మానకొండూర్, కరీంనగర్ లో పార్టీ ముఖ్యకార్యకర్తలతో సమావేశమైన కేటిఆర్, చొప్పదండిలో రోడ్ షో నిర్వహించి కాంగ్రెస్, బిజేపి తీరుపై మండిపడ్డారు.

జూన్‌2 తర్వాత ప్రయత్నాలు..

రాష్ట్ర పునఃర్విభజన చట్ట ప్రకారం వచ్చే జూన్ 2వరకే హైదరాబాద్ ఉమ్మడి రాజదాని ఉంటుందని ఆతర్వాత హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు కేటిఆర్ ఆరోపించారు.

దేశంలో రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్ రద్దు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ ప్రయత్నాలను అడ్డుకోవాలంటే బిఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో పది నుంచి 12 ఎంపీ స్థానాలు బిఆర్ఎస్ గెలిస్తే ఏడాదిలోగా కేసిఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయిలో ఉంటారని స్పష్టం చేశారు. ఇప్పుడు కేసులు పెట్టి వేధించే వారు మళ్ళీ మన వెంట తిరిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలిపారు.

కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్..

కేంద్రంలో బడే బాయ్ మోదీ బడా మోసం.. రాష్ట్రంలో చోటా బాయ్ రేవంత్ చోటా మోసం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్, బిజేపి రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని విమర్శించారు. అందుకు కరీంనగర్ లో బిజేపి అభ్యర్థి బండి సంజయ్ గెలిపించుకునేందుకు కాంగ్రెస్ బలహీనమైన అభ్యర్థిని బరిలో నిలిపిందని ఆరోపించారు. ముక్కుమోహం లేని వ్యక్తిని పోటీలో పెట్టారంటేనే వారి కుమ్మక్కు రాజకీయాలను తేటతెల్లం చేస్తుందన్నారు. వారి ఎన్ని కుట్రలు పన్నినా కరీంనగర్ లో బండిని షెడ్డుకు పంపించడం ఖాయమన్నారు.

బిఆర్ఎస్ పై విష ప్రచారం...

కాంగ్రెస్ బీజేపీ ఒక్కటై కూడబలుక్కుని అభ్యర్థులను బరిలో నిలిపి కాంగ్రెస్ నేతలు బిజేపితో బిఆర్ఎస్ కుమ్మక్కయ్యిందని విష ప్రచారం చేస్తున్నారని కేటిఆర్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్, హుజురాబాద్, కోరుట్ల, దుబ్బాక లో బిజెపి అభ్యర్థులను ఓడించింది బిఆర్ఎస్ అని తెలిపారు.

బీజేపి బీఆర్ఎస్ ఒక్కటైతే వారిని ఎందుకు ఓడిస్తామని... మన ఆడబిడ్డను ఏలా జైల్ లో పెడుతారని ప్రశ్నించారు. బీజేపీతో కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందం ఉండడంతోనే రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ ఒక్క సీటు గెలువదని అంటున్నారని తెలిపారు. జూన్ 4 తర్వాత రేవంత్ రెడ్డి ఉండడని చెప్పారు. దేవుళ్ళను.. రాముడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే వారికి గుణపాఠం చెప్పాని కోరారు.

(రిపోర్టింగ్ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రతినిధి)

తదుపరి వ్యాసం