తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Congress Manifesto : మహిళల ఖాతాల్లో ఏడాదికి రూ.లక్ష -5 గ్యారంటీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

Congress Manifesto : మహిళల ఖాతాల్లో ఏడాదికి రూ.లక్ష -5 గ్యారంటీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

06 April 2024, 20:18 IST

    • Congress Manifesto : తెలంగాణ తరహాలో జాతీయ స్థాయిలో 5 గ్యారంటీలు పక్కా అమలుచేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. ఐదు గ్యారంటీలతో కాంగ్రెస్ మేనిఫెస్టోను రాహల్ గాంధీ విడుదల చేశారు.
కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

Congress Manifesto : కాంగ్రెస్ మేనిఫెస్టోను(Congress Manifesto) ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆవిష్కరించారు. హైదరాబాద్ తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జన జాతర సభలో 5 గ్యారంటీలతో మేనిఫెస్టోను(Nyay Patra) విడుదల చేశారు. ఈ సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahu Gandhi) మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అంటే తప్పనిసరిగా అమలవుతుందనే నమ్మకం ప్రజల్లో ఉందని రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలతో మేనిఫెస్టో విడుదల చేసి...అమలుచేస్తున్నామన్నారు. ఇప్పుడూ జాతీయ స్థాయిలో 5 గ్యారంటీలు అమలు చేసేందుకు కాంగ్రెస్ మేనిఫెస్టో రూపొందించామన్నారు.

ట్రెండింగ్ వార్తలు

SIT Report on AP Violence : ఏపీలో అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదిక- పోలీసుల నిర్లక్ష్యం, రాజకీయ నేతల పాత్రపై విచారణ!

TG Graduate MLC Election 2024 : బీఆర్ఎస్ లో 'ఎమ్మెల్సీ' ఎన్నికల కుంపటి - తలో దారిలో నేతలు..!

Post poll violence in AP : 3 జిల్లాలకు కొత్త ఎస్పీలు, పల్నాడు కలెక్టర్‌గా బాలాజీ లఠ్కర్‌ - అల్లర్లపై 'సిట్' దర్యాప్తు

Peddapalli Politics : అంతుచిక్కని పెద్దపల్లి ఓటర్ల మనోగతం-అనూహ్యంగా బీజేపీకి పెరిగిన ఓటింగ్!

  • యువ న్యాయం- భారతదేశంలో నిరుద్యోగులకు రూ. లక్ష శిక్షణ భృతి, ఉద్యోగ నైపుణ్యాలు పెంపొందించేందుకు ఏడాది పాటు అప్రెంటిస్ షిప్, 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, యువత కోసం రూ.5 వేల కోట్ల కొత్త స్టార్టప్ ఫండ్
  • నారీ న్యాయం(Naari Nyay) -మహిళలు అటు ఆఫీసుల్లో, ఇటు ఇంట్లో రెండు చోట్లా ఉద్యోగాలు చేస్తున్నారని రాహుల్ గాంధీ తెలిపారు. మోదీ సర్కారు వచ్చాక చాలా మంది నిరుపేదలుగా మారారని ఆరోపించారు. అందుకే నారీ న్యాయ్ పథకాన్ని తీసుకువస్తున్నామన్నారు. నారీ న్యాయ్ కింద ప్రతీ కుటుంబంలో ఒక మహిళకు రూ.లక్ష ఆర్థిక సాయం(One Lakh for Woman) చేస్తామన్నారు. ఈ పథకం ద్వారా దేశ ముఖ చిత్రం మారబోతుందన్నారు. నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.లక్ష జమ చేస్తామని ప్రకటించారు. దేశంలో పేదరికాన్ని తగ్గించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు.
  • రైతు న్యాయం(Kisan Nyay)- దేశంలో ప్రతి రోజు 30 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని రాహుల్ గాంధీ అన్నారు. మోదీ ప్రభుత్వం దేశంలోని సంపన్నులకు రూ.16 లక్షల కోట్లు రుణమాఫీ(Loan Waiver) చేసిందని ఆరోపించారు. కానీ రైతులు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదన్నారు. అందుకే రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం కనీస మద్దతు ధరకు చట్ట బద్దత కల్పిస్తుందన్నారు. దేశంలోని ప్రతీ రైతు పండించే పంటకు MSP ప్రకటిస్తామన్నారు. స్వామి నాథన్ కమిటీ సిపార్సుల ప్రకారం ఎమ్ఎస్పీ ధరలు నిర్ణయిస్తామన్నారు.
  • శ్రామిక న్యాయం- కార్మికులకు, కూలీలకు కనీస వేతనాలు తీసుకువస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. MGNREGA కింద రోజుకు రూ.400 ఇస్తామన్నారు.
  • సామాజిక న్యాయం- దేశంలో 50 శాతం జనాభా వెనుకబడిన తరగతులు, 15 శాతం దళితులు, 8 శాతం గిరిజనులు, 15 శాతం మైనర్టీలు, 5 శాతం జనరల్ కేటగిరీ ప్రజలు ఉన్నారని రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. మొత్తం 90 శాతం జనాభాలో పెద్ద కంపెనీల్లో వీళ్లు కనిపించడంలేదన్నారు. దేశంలోని పెద్ద కంపెనీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీల ఓనర్లు లేరన్నారు. బడ్జెట్ లోని 100 రూపాయల్లో కేవలం 6 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలపై ఖర్చు పెడుతున్నారన్నారు. కాంగ్రెస్(Congress) అధికారంలోకి రాగానే దేశాన్ని ఎక్స్ రే తీస్తుందన్నారు. తెలంగాణలో మాదిరిగా దేశం మొత్తం కుల గణన(Caste Census) అమలుచేస్తామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఆర్థికపర సర్వే చేస్తామన్నారు. దేశ సంపద ఎవరి దగ్గర ఉందో ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఈ చారిత్రక అడుగుతో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తామన్నారు. దేశంలోని అన్ని రంగాల్లో వెనుకబడిన తరగతులకు వారి హక్కులు కల్పిస్తామన్నారు.

ఎన్నికల సంఘంలోనూ మోదీ మనుషులు

"బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా పనిచేసిందో మీకు తెలుసు. వేల మంది ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping)చేశారు. మాజీ సీఎం కేసీఆర్(KCR) పోలీసులు, ఇన్ టెలిజెన్స్ అధికారులను దుర్వినియోగం చేసి వేల మంది ఫోన్లు ట్యాపింగ్ చేశారు. ప్రభుత్వం మారగానే గత ప్రభుత్వ డేటాను ధ్వంసం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడి వేల కోట్లలో డబ్బులు వసూలు చేసింది. మాజీ సీఎం కేసీఆర్ తరహాలా దిల్లీలో మోదీ(PM Modi) ప్రభుత్వం పనిచేస్తుంది. ఈడీ గతంలో కేంద్ర సంస్థ...ఇప్పుడు ఎక్స్ టార్షన్ సంస్థగా మారింది. బీజేపీ(BJP) ప్రపంచంలోనే పెద్ద వాషింగ్ మిషన్. ఎన్నికల సంఘంలో కూడా నరేంద్ర మోదీ మనుషులు ఉన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద కుంభకోణం ఎలక్టోరల్ బాండ్లు. సీబీఐ దాడులు చేసిన సంస్థలు బీజేపీకి వేల కోట్ల ఎలక్టోరల్ బాండ్లు(Electoral Bonds) ఇచ్చాయి. వేల కోట్ల ప్రాజెక్టులు తమ దగ్గర సంస్థలకు ఇచ్చుకుంది బీజేపీ. తెలంగాణలో బీజేపీ బీ టీమ్ ను ఓడించాం. దేశంలో బీజేపీని ఓడిస్తాం."- రాహుల్ గాంధీ

తదుపరి వ్యాసం