తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ap Congress Mp Candidates : ఏపీలో మరో 9 ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు - జాబితా ఇదే

AP Congress MP Candidates : ఏపీలో మరో 9 ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు - జాబితా ఇదే

21 April 2024, 21:30 IST

    • AP Congress MP Candidates List 2024 : లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మరో జాబితాను విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మరో 2 స్థానాలు జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవి ఉన్నాయి.
ఏపీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు
ఏపీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు

ఏపీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు

AP Congress MP Candidates List 2024: ఏపీలో పోటీ చేసే లోక్ సభ అభ్యర్థులకు సంబంధించి మరో జాబితాను ప్రకటించింది కాంగ్రెస్(Congress) అధినాయకత్వం. తొలి జాబితాలో ఐదు మందిని ఖరారు చేయగా…తాజాగా విడుదల చేసి లిస్ట్ లో 9 మందిని ఫైనల్ చేసింది.  శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పి.పరమేశ్వరరావు పేరు ఖరారు కాగా…. విజయనగరం సీటు నుంచి బొబ్బిలి శ్రీనుకు అవకాశం ఇచ్చింది. అమలాపురం నుంచి జంగా గౌతమ్‌, మచిలీపట్నం స్థానం నుంచి గొల్లు కృష్ణ పేరు ఖరారైంది.అనంతపురం  పార్లమెంట్ స్థానం నుంచి మల్లికార్జున్‌ వజ్జలకు అవకాశం దక్కింది.

ట్రెండింగ్ వార్తలు

Transfers in AP : ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ - పల్నాడు కలెక్టర్ బదిలీ, పలువురు ఎస్పీలపై సస్పెన్షన్ వేటు

Khammam Bettings: ఏపీలో ఎన్నికల ఫలితాలపై తెలంగాణలో లెక్కలు.. జోరుగా బెట్టింగులు!

YS Jagan With IPac: ఐపాక్‌ బృందంతో జగన్ భేటీ.. మళ్లీ అధికారంలోకి వస్తున్నామని ధీమా..

Lok Sabha Elections Phase 5: ఐదో దశలో లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచిన ప్రముఖులు వీరే..

ఏపీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల మూడో జాబితా

  1. శ్రీకాకుళం - పి.పరమేశ్వరరావు
  2. విజయనగరం - బొబ్బిలి శ్రీను
  3. అమలాపురం - జంగా గౌతమ్‌
  4. మచిలీపట్నం - గొల్లు కృష్ణ
  5. విజయవాడ - వల్లూరు భార్గవ్‌
  6. ఒంగోలు - ఈద సుధాకర్‌రెడ్డి
  7. నంద్యాల - జె.లక్ష్మీ నరసింహ యాదవ్‌
  8. అనంతపురం - మల్లికార్జున్‌ వజ్జల
  9. హిందూపురం - బీఏ సమద్‌ షహీన్‌

ఏపీ కాంగ్రెస్ రెండో జాబితా లిస్ట్…

  1. విశాఖపట్నం-పులుసు సత్యనారాయణ రెడ్డి
  2. అనకాపల్లె-వేగి వెంకటేశ్
  3. ఏలూరు-కావూరి లావణ్య
  4. నరసరావుపేట-గర్నేపూడి అలెగ్జాండర్ సుధాకర్
  5. నెల్లూరు-కొప్పుల రాజు
  6. తిరుపతి(ఎస్సీ)-డా.చింతా మోహన్

కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్…

  1. కడప పార్లమెంట్‌ స్థానం నుంచి ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల
  2. కాకినాడ నుంచి మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు
  3.  రాజమండ్రి-గిడుగు రుద్రరాజు,
  4.  బాపట్ల- జేడీశీలం, 
  5. కర్నూలు నుంచి రాంపుల్లయ్య యాదవ్‌ 

తదుపరి వ్యాసం