తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Janasena B Forms: జనసేన అభ్యర్థులకు బి ఫారంలు అందించిన పవన్ కళ్యాణ్.. రేపటి నుంచి నామినేషన్లు వేయనున్న అభ్యర్థులు

Janasena B Forms: జనసేన అభ్యర్థులకు బి ఫారంలు అందించిన పవన్ కళ్యాణ్.. రేపటి నుంచి నామినేషన్లు వేయనున్న అభ్యర్థులు

Sarath chandra.B HT Telugu

17 April 2024, 12:23 IST

    • Janasena B Forms: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో  ఎన్డీఏ కూటమి తరపున జనసేన పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయలంలో పవన్ కళ్యాణ్ నామినేషన్ పత్రాలను అందచేశారు. 
జనసేన తరపున పోటీ చేసే అభ్యర్థులతో పవన్ కళ్యాణ్
జనసేన తరపున పోటీ చేసే అభ్యర్థులతో పవన్ కళ్యాణ్

జనసేన తరపున పోటీ చేసే అభ్యర్థులతో పవన్ కళ్యాణ్

Janasena B Forms: సార్వత్రికల ఎన్నికల్లో Elections నామినేషన్ల Nominations పర్వం ప్రారంభం కానుండటంతో మంగళగిరిలోని జనసేన janasena పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ pawan Kalyan అభ్యర్థులకు బిఫారంలు అందించారు.

ట్రెండింగ్ వార్తలు

Factcheck: ఇండియా టుడే, టైమ్స్ నౌ సహా సంస్థలు ఎటువంటి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయలేదు

EC Serious On CS DGP : ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్- సీఎస్, డీజీపీలకు నోటీసులు

CEO AP Meena: నాలుగు దశల్లో దేశంలోనే అత్యధికం.. ఏపీలో82శాతం పోలింగ్‌ నమోదు.. పట్టణ ప్రాంతాల్లో పెరిగిన ఓటింగ్

Bandi sanjay: పోలింగ్ ముగియడంతో అభ్యర్థుల రిలాక్స్.. కుటుంబ సభ్యులతో కాలక్షేపం

మే 13న జరిగే ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి తరపున ఎన్నికల్లో పోటీ చేయనుంది. జనసేన పార్టీ అభ్యర్థులు 21 అసెంబ్లీ స్థానాల్లో, రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ బిఫారంలు అందచేశారు.

2024 సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున జనసేన పోటీ చేస్తోంది. సీట్ల సర్దుబాటులో ఆ పార్టీకి 21 అసెంబ్లీ స్థానాలను Assembly elections, రెండు పార్లమెంటు స్థానాలను కేటాయించారు.

జనసేన పోటీ చేసే అసెంబ్లీ నియోజక వర్గాల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌, నెల్లిమర్లలలో లోకం మాధవి, అనకాపల్లిలో కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్‌లో పంతం నానాజీ, రాజానగరంలో బత్తుల రామకృష్ణ, తెనాలిలో నాదెండ్ల మనోహర్, నిడదవోలులో కందుల దుర్గేష్, పెందుర్తిలో పంచకర్ల రమేష్ బాబు ఉన్నారు.

యలమంచిలిలో సుందరపు విజయ్‌కుమార్‌, పి.గన్నవరంలో గిడ్డి సత్యనారాయణ, రాజోలులో దేవ వరప్రసాద్, తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్, భీవరంలో పులివర్తి ఆంజనేయులు, నరసాపురంలో బొమ్మిడి నాయకర్, ఉంగటూరులో పత్సమట్ల ధర్మరాజు, పోలవరంలో చిర్రి బాలరాజు, తిరుపతిలో ఆరణి శ్రీనివాసులు, రైల్వే కోడూరులో శ్రీధర్‌, అవనిగడ్డలో మండలి బుద్దప్రసాద్, పాలకొండలో నిమ్మక జయకృష్ణ పోటీ చేస్తున్నారు.

ఎంపీ అభ్యర్థులుగా కాకినాడలో టీ టైమ్‌ ఓనర్‌ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్, మచిలీపట్నంలో వల్లభనేని బాలశౌరిలను ఖరారు చేశారు. శ్రీరామ నవమి పర్వదినం కావడంతో అదే రోజు జనసేన తరపున పోటీ చేసే అభ్యర్థులకు పవన్ కళ్యాణ్‌ బిఫారంలను అందచేశారు.

తదుపరి వ్యాసం