(1 / 7)
జనసేనకు విజయోస్తు అని మెగాస్టార్ చిరంజీవి ఆంజనేయుని పాదాల చెంత జనసేన పార్టీ అధ్యక్షుడు, తన తమ్ముడైన పవన్ కల్యాణ్ ను ఆశీర్వదించారు. జనసేన ఎన్నికల ప్రచారాల కోసం ఐదుకోట్ల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో పవన్ కల్యాణ్, నాగబాబుకు అందించారు.
(2 / 7)
హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ లో నిర్విరామంగా జరుగుతున్న ‘విశ్వంభర’ షూటింగ్ లొకేషన్ కు సోమవారం పవన్ కల్యాణ్, నాగబాబు..జనసేన నేతలు వెళ్లారు.
(3 / 7)
పవన్ కల్యాణ్ కు చిరంజీవి ప్రేమపూర్వక ఆలింగనంతో స్వాగతం పలికారు. చిరంజీవి ఆశీర్వచనం అందుకున్న పవన్ కల్యాణ్ ఉద్వేగానికి లోనయ్యారు. అన్నయ్య పాదాలకు నమస్కరించారు.
(4 / 7)
జనసేన పార్టీ స్థాపించి పదేళ్లు పూర్తవుతున్న తరుణంలో చిరంజీవి ఆశీర్వచనం కోసం ఎదురుచూస్తున్న పవన్ కల్యాణ్ కు నీ వెనుక నేనున్నాను అనే భరోసా ఇచ్చారు.
(5 / 7)
చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు ముగ్గురు అన్నదమ్ములు కొంత సేపు మాట్లాడుకున్నారు.
(6 / 7)
చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్ కు తన ఆశీర్వాద బలంతో పాటు ఆర్థికంగా అండగా నిలబడాలని రూ.5 కోట్ల చెక్కును అందించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా జనసేనకు ఆర్థికంగా అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు.
(7 / 7)
విశ్వంభర సెట్ లో పవన్ కల్యాణ్, చిరంజీవి, నాగబాబు
ఇతర గ్యాలరీలు