తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Yuvraj Singh 6 Sixes: యువరాజ్ ఆరు సిక్స్‌లు కొట్టింది ఈ రోజే.. అద్భుతమైన శాండ్ ఆర్ట్ వీడియో చూశారా?

Yuvraj Singh 6 Sixes: యువరాజ్ ఆరు సిక్స్‌లు కొట్టింది ఈ రోజే.. అద్భుతమైన శాండ్ ఆర్ట్ వీడియో చూశారా?

Hari Prasad S HT Telugu

19 September 2023, 15:42 IST

    • Yuvraj Singh 6 Sixes: యువరాజ్ ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టింది ఈ రోజే (సెప్టెంబర్ 19). 16 ఏళ్ల కిందట జరిగిన ఈ అద్భుతాన్ని మరో అద్భుతమైన శాండ్ ఆర్ట్ గా మలిచాడు ఓ ఆర్టిస్ట్. దీనికి సంబంధించిన వీడియోను యువీ షేర్ చేశాడు.
యువరాజ్ సింగ్
యువరాజ్ సింగ్

యువరాజ్ సింగ్

Yuvraj Singh 6 Sixes: టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టిన చారిత్రక ఘట్టం గుర్తుందా? 2007లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో యువీ ఈ అరుదైన అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ఇది జరిగిన మంగళవారానికి (సెప్టెంబర్ 19) సరిగ్గా 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దానిని గుర్తు చేసుకుంటూ యువీ ఓ వీడియోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

DC vs LSG: లక్నోకు భారీ దెబ్బేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. తన చివరి లీగ్ మ్యాచ్‍లో అలవోకగా గెలిచిన పంత్ సేన

DC vs LSG: స్టబ్స్, పోరెల్ మెరుపులు.. ఢిల్లీ దీటైన స్కోరు.. సూపర్ క్యాచ్ పట్టిన రాహుల్.. చప్పట్లతో అభినందించిన ఓనర్

Rohit Sharma: టీ20 ప్రపంచకప్‍కు ముందు రోహిత్ శర్మ ఫామ్ కోల్పోవడంపై స్పందించిన సౌరవ్ గంగూలీ

Rohit Sharma vs Hardik Pandya: హార్దిక్ పాండ్యా రాగానే లేచి వెళ్లిపోయిన రోహిత్, సూర్యకుమార్

ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో యువరాజ్ ఈ ఆరు సిక్స్ లు బాదాడు. సౌతాఫ్రికాలోని డర్బన్ కింగ్స్‌మీడ్ స్టేడియంలో యువీ ఆకాశమే హద్దుగా చెలరేగి ఒకే ఓవర్లు ఆరు సిక్సర్లతోపాటు 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కూడా చేశాడు. బ్రాడ్ ఓవర్ ప్రారంభానికి ముందు ఇంగ్లండ్ ప్లేయర్ ఫ్లింటాఫ్ తో కాస్త గొడవ జరిగింది. దీంతో తన ఆవేశాన్ని యువీ ఇలా బంతిపై చూపించాడు.

ఆరు సిక్స్‌ల శాండ్ ఆర్ట్ అద్భుతం

అయితే యువరాజ్ కొట్టిన ఆ ఆరు సిక్స్‌లను ఓ అద్భుతమైన శాండ్ ఆర్ట్ గా మలిచాడు ఓ ఆర్టిస్ట్. సరిగ్గా ఆ రోజు ఏం జరిగిందో కళ్లకు కట్టేలా ఈ ఆర్ట్ ఉంది. ఫ్లింటాఫ్ తో గొడవ నుంచి చివరి సిక్స్ కొట్టి, నాన్ స్ట్రైకింగ్ లో ధోనీతో కలిసి యువీ తన ఆనందాన్ని పంచుకోవడం వరకూ ఈ శాండ్ ఆర్ట్ ఆ దృశ్యాన్ని కళ్లు ముందు ఆవిష్కరించింది.

యువరాజ్ ప్రతి సిక్స్ ఎలా కొట్టాడో అలాగే అతన్ని చిత్రీకరిస్తూ మధ్యలో ఫ్లింటాఫ్ ఫీలవడం, బౌలింగ్ చేసిన బ్రాడ్ తలపట్టుకోవడంలాంటివన్నీ ఈ ఆర్ట్ లో సదరు ఆర్టిస్ట్ చూపించడం విశేషం. క్రిస్టీ వలియవీట్టిల్ అనే ఆర్టిస్ట్ ఈ ఆర్ట్ రూపొందించాడు.

ఈ వీడియోను యువీ షేర్ చేస్తూ.. "ఈ లవ్లీ శాండ్ ఆర్ట్ క్రియేట్ చేసినందుకు క్రిస్టీ వలియవీట్టిల్ కు థ్యాంక్స్. నిజానికి దీనిని నా బర్త్ డే సందర్భంగా క్రియేట్ చేసినా.. ఇవాళ్టి సందర్భానికి కూడా ఇది ఉపయోగపడుతుంది" అని యువీ పోస్ట్ చేశాడు.

ఈ మ్యాచ్ లో యువరాజ్ క్రియేట్ చేసిన ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు ఇప్పటికీ అలాగే ఉంది. ఏ ఫార్మాట్ లో అయినా 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ రికార్డు మరెవరికీ సాధ్యం కాలేదు. యువీ కొట్టిన ఆ ఆరు సిక్స్ లే మ్యాచ్ ను మలుపు తిప్పాయి. ఇండియా భారీ స్కోరు చేసి ఇంగ్లండ్ ను చిత్తు చేసింది. చివరికి అదే టీ20 వరల్డ్ కప్ ను ఇండియా గెలుచుకుంది.

తదుపరి వ్యాసం