తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sunil Gavaskar: ఆ పాకిస్థాన్ మూర్ఖులు, మెదడు లేని వాళ్ల చెంప చెళ్లుమనిపించే గెలుపు ఇది: గవాస్కర్ తీవ్రమైన కామెంట్స్

Sunil Gavaskar: ఆ పాకిస్థాన్ మూర్ఖులు, మెదడు లేని వాళ్ల చెంప చెళ్లుమనిపించే గెలుపు ఇది: గవాస్కర్ తీవ్రమైన కామెంట్స్

Hari Prasad S HT Telugu

18 September 2023, 11:12 IST

    • Sunil Gavaskar: ఆ పాకిస్థాన్ మూర్ఖులు, మెదడు లేని వాళ్ల చెంప చెళ్లుమనిపించే గెలుపు ఇది అంటూ మాజీ కెప్టెన్ గవాస్కర్ తీవ్రమైన కామెంట్స్ చేశాడు. పాకిస్థాన్ ను ఫైనల్ రాకుండా చేయడానికి శ్రీలంక చేతుల్లో ఇండియా కావాలనే ఓడిపోవాలని చూసిందన్న విమర్శలపై అతడిలా స్పందించాడు.
భారత్ గెలుపు తర్వాత పాకిస్థాన్ మాజీలపై మండిపడిన గవాస్కర్
భారత్ గెలుపు తర్వాత పాకిస్థాన్ మాజీలపై మండిపడిన గవాస్కర్ (PTI/HT)

భారత్ గెలుపు తర్వాత పాకిస్థాన్ మాజీలపై మండిపడిన గవాస్కర్

Sunil Gavaskar: టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ ను ఆసియా కప్ ఫైనల్ రాకుండా చేయడానికి సూపర్ 4లో శ్రీలంక చేతుల్లో ఇండియా కావాలనే ఓడిపోవడానికి ప్రయత్నించిందన్న విమర్శలపై సన్నీ స్పందించాడు. ఆసియా కప్ ఫైనల్లో ఇండియా గెలిచిన తర్వాత ఇది దేశ పశ్చిమ సరిహద్దు (పాకిస్థాన్)లోని మూర్ఖుల చెంప చెళ్లుమనిపించే విజయమని అనడం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు

RCB vs CSK : ధోనీ కోపం.. కోహ్లీ ఎమోషనల్​- ట్రెండింగ్​లో ‘డెఫినెట్లీ నాట్​’! క్రికెట్​ అంటే ఇదే..

Virat Kohli: అంపైర్‌తో గొడవకు దిగిన విరాట్ కోహ్లీ.. అలా చేయమంటూ ఒత్తిడి.. చివరికీ..!

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

RCB vs CSK: బాదేసిన బెంగళూరు.. డుప్లెసిస్, కోహ్లీ, పాటిదార్ మెరుపులు.. చెన్నై ముందు భారీ టార్గెట్.. ప్లేఆఫ్స్ చేరాలంటే..

ఆసియా కప్ ఫైనల్లో ఇండియా 10 వికెట్లతో శ్రీలంకను చిత్తు చేసి 8వసారి టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తర్వాతి మిడ్ డే పత్రికకు రాసిన కాలమ్ లో పాకిస్థానీ విమర్శకులపై గవాస్కర్ తీవ్రంగా స్పందించాడు. ఈ కాలమ్ మొత్తం అతడు భారత్ అని రాయడం విశేషం.

"పశ్చిమ సరిహద్దు అవతల ఉన్న వారి ముఖాలపై కొట్టిన గట్టి దెబ్బ ఇది. వీళ్లంతా శ్రీలంకపై భారత్ 213 పరుగులకు ఆలౌటైనప్పుడు పాకిస్థాన్ ను ఫైనల్ రాకుండా చేయడానికి కావాలనే ఓడిపోవాలని ప్రయత్నిస్తోందని మొత్తుకున్నవాళ్లే. శ్రీలంక చేతుల్లో భారత్ ఓడిపోయి, శ్రీలంకను పాకిస్థాన్ ఓడించి, భారత్ - బంగ్లాదేశ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే భారతే ఫైనల్ కు అర్హత సాధించదు అన్న విషయం ఈ మెదడు లేని వాళ్లకు తెలుసా? మరి శ్రీలంక చేతుల్లో భారత్ ఎందుకు కావాలని ఓడిపోతుంది? మూర్ఖులారా" అంటూ గవాస్కర్ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు.

"శ్రీలంక చేతుల్లో పాకిస్థాన్ ఓడిపోయి టోర్నీ నుంచి వెళ్లిపోయినప్పుడు ఈ ఓటమికి భారత్ కారణమంటూ మరికొన్ని కుట్ర సిద్ధాంతాలు వస్తాయని ఊహించాం. కానీ వాళ్లు మాత్రం అన్నీ మరచిపోయి తమ కెప్టెన్ బాబర్ ఆజంను నిందించడం మొదలుపెట్టారు" అని గవాస్కర్ అన్నాడు. 2019 వరల్డ్ కప్ సందర్భంగా కూడా భారత్ పై ఇలాగే కుట్ర సిద్ధాంతాలు వచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా అతడు గుర్తు చేశాడు.

"2019 వరల్డ్ కప్ గ్రూప్ మ్యాచ్ లో ఇంగ్లండ్ చేతుల్లో భారత్ ఓడినప్పుడు కూడా ఇలాంటి కుట్ర సిద్ధాంతమే తెరపైకి వచ్చింది. ఎమ్మెస్ ధోనీ కావాలనే నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెస్డీ గురించి తెలిసిన వాళ్లకు అతడు మ్యాచ్ ను చివరి వరకూ తీసుకెళ్లి తర్వాత చెలరేగుతాడని తెలుసు. ఇంగ్లండ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో అతడు ఆ పని చేయలేకపోయాడు. కానీ ఈ మూర్ఖులు మాత్రం తమకు సెమీఫైనల్స్ లో ఛాన్స్ దక్కకూడదని కావాలనే ఇలా చేసినట్లు భావించారు" అని గవాస్కర్ రాశాడు.

"వరల్డ్ కప్ జట్ల విషయానికి వస్తే ఫైనల్ చేరడానికి వాళ్లు ఏదైనా చేస్తారన్న విషయం గుర్తుంచుకోవాలి. అలాంటప్పుడు మీ టీమ్ ముందుకెళ్లాలంటే మరో టీమ్ పై ఎందుకు ఆధారపడాలి? మీరే అన్ని మ్యాచ్ లూ గెలిచి ఎందుకు టోర్నీ గెలవరు? ఎందుకు ఇతర జట్లను ఎత్తి చూపుతారు? ఓ టోర్నీ నాకౌట్ స్టేజ్ కు వెళ్లడానికి భారత్ పై వాళ్లు ఆధారపడటం వాళ్లకే అవమానకరం" అని సన్నీ ఘాటుగా స్పందించాడు.

తదుపరి వ్యాసం