తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli: విరాట్ కోహ్లీ నాకు బావ.. అతను ఎలాంటి వాడంటే.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన తెలుగు హీరోయిన్

Virat Kohli: విరాట్ కోహ్లీ నాకు బావ.. అతను ఎలాంటి వాడంటే.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన తెలుగు హీరోయిన్

Sanjiv Kumar HT Telugu

11 January 2024, 12:38 IST

  • Ruhani Sharma Virat Kohli: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తనకు బావ అవుతాడని చెప్పి షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది రుహానీ శర్మ. విక్టరీ వెంకటేష్ హీరోగా చేసిన సైంధవ్ ప్రమోషన్స్‌లో భాగంగా రుహానీ శర్మ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మతో ఉన్న రిలేషన్‌పై చెప్పుకొచ్చింది.

విరాట్ కోహ్లీ నాకు బావ అవుతాడు.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన సైంధవ్ హీరోయిన్
విరాట్ కోహ్లీ నాకు బావ అవుతాడు.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన సైంధవ్ హీరోయిన్

విరాట్ కోహ్లీ నాకు బావ అవుతాడు.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన సైంధవ్ హీరోయిన్

Ruhani Sharma Virat Kohli: భారత క్రికెట్ టీమ్ స్టార్ ప్లేయర్ తనకు బావ అవుతాడంటూ పెద్ద బాంబ్ పేల్చింది బ్యూటిఫుల్ హీరోయిన్ రుహానీ శర్మ. రుహానీ శర్మ తాజాగా నటించిన సినిమా సైంధవ్. విక్టరీ వెంకటేష్ హీరోగా హిట్ సిరీస్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా రుహానీ శర్మ చేసింది. సైంధవ్ మూవీలో డాక్టర్ పాత్రలో రుహానీ శర్మ నటించింది. జనవరి 13న సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానుంది సైంధవ్.

ట్రెండింగ్ వార్తలు

RCB vs CSK : ధోనీ కోపం.. కోహ్లీ ఎమోషనల్​- ట్రెండింగ్​లో ‘డెఫినెట్లీ నాట్​’! క్రికెట్​ అంటే ఇదే..

Virat Kohli: అంపైర్‌తో గొడవకు దిగిన విరాట్ కోహ్లీ.. అలా చేయమంటూ ఒత్తిడి.. చివరికీ..!

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

RCB vs CSK: బాదేసిన బెంగళూరు.. డుప్లెసిస్, కోహ్లీ, పాటిదార్ మెరుపులు.. చెన్నై ముందు భారీ టార్గెట్.. ప్లేఆఫ్స్ చేరాలంటే..

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సైంధవ్ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది ముద్దుగుమ్మ రుహానీ శర్మ. ఈ ఇంటర్వ్యూలోనే టీమిండియా ప్లేయలర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో తనకున్న రిలేషన్‌షిప్ గురించి బయట పెట్టింది ఈ సైంధవ్ బ్యూటి రుహాని శర్మ.

"నేను చిన్నప్పటి నుంచి వెంకీ సార్ సినిమాలు చూస్తూ పెరిగాను. సైంధవ్‌లో నటించాక వెంకటేష్‌కు ఇంకా పెద్ద అభిమానిగా మారాను. నేను ఎక్కువగా వెంకటేష్ డబ్బింగ్ చిత్రాలు చూశాను. ఇప్పుడు ఆయనతో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కోరికగా ఉండేది. కానీ, సినిమాల్లోకి వచ్చాను. ఇప్పుడు సైంధవ్ మూవీలో డాక్టర్ పాత్ర పోషించడం సంతోషంగా ఉంది. ఇలా నా డ్రీమ్ నెరవేరింది" అని రుహానీ శర్మ తెలిపింది.

ఈ క్రమంలోనే "అనుష్క శర్మతో మీ అనుబంధం ఎలా ఉంటుంది" అనే ప్రశ్న రుహానీ శర్మకు ఎదురైంది. అలా అడగడంతో రుహానీ శర్మ అవాక్కయింది. నేను ఈ విషయం గురించి ఎప్పుడూ.. ఎక్కడా మీడియా ముందు చెప్పలేదు. సీక్రెట్‌గానే ఉంచాను. మీకెలా తెలిసింది. అడిగారు కాబట్టి చెబుతున్నా.. అవును, నాకు అనుష్క సోదరి అవుతుంది" అని రుహానీ శర్మ అసలు విషయం చెప్పింది.

దానికి "అనుష్క అక్క అంటే విరాట్ కోహ్లీ బావ అవుతాడు. మీ బావ మీతో ఎలా ఉంటాడు" అని మరో ప్రశ్న వచ్చింది. అవును విరాట్ నాకు బావ వరుస అవుతాడు. నాతో విరాట్ చాలా బాగుంటాడు. వాళ్లిద్దరూ ఫిల్టర్ లేకుండా చాలా సింపుల్‌గా ఉంటారు. అది నాకు బాగా నచ్చుతుంది. విరాట్ చాలా మంచివాడు" అని రుహానీ శర్మ తెలిపింది. రుహానీ శర్మ మాటలతో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఆమెకు బంధువులు అని తెలిసింది. దీంతో ఈ విషయం వైరల్‌గా మారింది.

ఇదిలా ఉంటే రుహానీ శర్మ కడైసి బెంచ్ కార్తీ అనే తమిళ సినిమాతో చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టింది. తెలుగులో మాత్రం చి.ల.సౌ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. దీనికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా సుశాంత్ సింగ్ హీరోగా చేశాడు. ఈ సినిమా మంచి హిట్ కొట్టడమే కాకుండా రుహానీ శర్మ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలా తెలుగులో వరుసగా అవకాశాలు అందుకుంటూ వస్తోంది రుహానీ శర్మ. తెలుగుపాటు ఇతర భాషల్లో సైతం సినిమాలు చేసింది రుహానీ.

తెలుగులో అయితే సైంధవ్ డైరెక్టర్ శైలేష్ కొలను తొలిసారిగా దర్శకత్వం వహించిన హిట్ మూవీలో రుహానీ శర్మ హీరోయిన్‌గా చేసింది. అనంతరం డర్టీ హరి, 101 జిల్లాల అందగాడు, హర్ ది ఫస్ట్ చాప్టర్ సినిమాలు చేసింది. ఇప్పుడు సైంధవ్‌తో మరోసారి అలరించేందుకు సిద్ధంగా ఉంది.

తదుపరి వ్యాసం