తెలుగు న్యూస్ / ఫోటో /
Chiranjeevi: వెంకటేష్‌ను చూసి నాలో గుబులు మొదలైంది.. చిరంజీవి షాకింగ్ కామెంట్స్
Chiranjeevi Venkatesh: హైదరాబాద్‌లో వెంకీ 75 సైంధవ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ ఈవెంట్లో మొదట్లో వెంకటేష్‌ను చూసినప్పుడు తనలో గుబులు మొదలైందని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు.
(1 / 7)
విక్టరీ వెంకటేష్ తాజాగా నటిస్తున్న సినిమా సైంధవ్. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి తెలుగుతోపాటు ఇతర భాషల్లో పాన్ ఇండియాగా విడుదలకానుంది.
(2 / 7)
ప్రమోషన్స్‌లో భాగంగా వెంకీ 75 కలియుగ పాండవులు టు సైంధవ్ పేరుతో సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.
(3 / 7)
వెంకీ 75 సైంధవ్ సెలబ్రేషన్స్ ఈవెంట్లో నాని, అడవి శేష్, విశ్వక్ సేన్, శైలేష్ కొలను, బ్రహ్మానందం, అలీ, ఆర్య, ఆండ్రియా, రుహానీ శర్మ ప్రముఖ తారలు సందడి చేశారు.
(4 / 7)
వెంకీ 75 ఈవెంట్లో వెంకటేష్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు చిరంజీవి. 1983లో సురేష్ ప్రొడక్షన్స్‌లో సంఘర్షణ సినిమా చేస్తున్న సమయంలోని తనలోని భావనను పంచుకున్నాడు చిరంజీవి.
(5 / 7)
"రామానాయుడుకి రెండో అబ్బాయి కూడా ఉన్నాడని అప్పుడే తెలిసింది. ఎలా ఉంటాడని అడిగితే పర్వాలేదని చెప్పారు. కానీ, కొన్నాళ్ల తర్వాత అందంగా మెరిసిపోతున్న వెంకటేష్‌ను చూసి నాలో గుబులు మొదలైంది" అని చిరంజీవి అన్నారు.
(6 / 7)
"రామానాయాడు సంస్థలో సినిమా చేయడం నాలాంటి వాళ్లకు అప్పట్లో ఓ భరోసా, ధీమా. అలాంటిది వాళ్ల అబ్బాయి హీరో అయితే నాకు గట్టి పోటీ ఎదురవుతుందని భయపడ్డా. కానీ, తనకు సినిమాలపై ఆసక్తిలేదనడంతో ఊపిరి పీల్చుకున్నా" అని చిరు తెలిపాడు.
ఇతర గ్యాలరీలు