తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ravi Bishnoi: టీ20ల్లో నంబర్ వన్ బౌలర్‌ను పక్కన పెట్టడమేంటి: టీమిండియా ఎంపికపై మాజీ క్రికెటర్లు షాక్

Ravi Bishnoi: టీ20ల్లో నంబర్ వన్ బౌలర్‌ను పక్కన పెట్టడమేంటి: టీమిండియా ఎంపికపై మాజీ క్రికెటర్లు షాక్

Hari Prasad S HT Telugu

13 December 2023, 10:42 IST

  • Ravi Bishnoi: సౌతాఫ్రికాతో రెండో టీ20కి టీమిండియాను ఎంపిక చేసిన తీరుపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. టీ20ల్లో నంబర్ వన్ బౌలర్‌ అయిన రవి బిష్ణోయ్ ని పక్కన పెట్టడమేంటని వాళ్లు ప్రశ్నిస్తున్నారు.

టీమిండియా తుది జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు ఘాటు విమర్శలు
టీమిండియా తుది జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు ఘాటు విమర్శలు (Getty-AP)

టీమిండియా తుది జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు ఘాటు విమర్శలు

Ravi Bishnoi: సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓటమి కంటే కూడా ఈ మ్యాచ్ కోసం ఎంపిక చేసిన తుది జట్టు మాజీ క్రికెటర్లను, అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్ లాంటి ప్లేయర్స్ కు తుది జట్టులో చోటు దక్కలేదు. దీనిపై గంభీర్‌తోపాటు సంజయ్ మంజ్రేకర్, ఆకాశ్ చోప్రా, పియూష్ చావ్లాలాంటి మాజీలు తీవ్రంగా స్పందించారు.

ట్రెండింగ్ వార్తలు

Rohit Sharma vs Star Sports: ప్రైవసీ లేకుండా పోతుందన్న రోహిత్ ఆరోపణలపై స్టార్ స్పోర్ట్స్ రియాక్షన్ ఇదీ

IPL 2024 Orange, Purple Cap: ఇక మిగిలింది ప్లేఆఫ్స్.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో ఎవరు ఉన్నారంటే..

IPL 2024 Playoffs: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ షెడ్యూల్ ఇదే.. క్వాలిఫయర్-1లో హైదరాబాద్

RR vs KKR: రాజస్థాన్, కోల్‍కతా మ్యాచ్‍ వర్షార్పణం.. హైదరాబాద్‍కు జాక్‍పాట్.. రెండో ప్లేస్‍ దక్కించుకున్న సన్‍రైజర్స్

రవి బిష్ణోయ్ ఆస్ట్రేలియాతో సిరీస్ లో చెలరేగిపోయి టీ20ల్లో నంబర్ వన్ బౌలర్ అయ్యాడు. అలాంటి ప్లేయర్ ను సౌతాఫ్రికాతో రెండో టీ20కి పక్కన పెట్టారు. ఇక గత సిరీస్ లో వైస్ కెప్టెన్, చివరి టీ20లో హాఫ్ సెంచరీ చేసిన శ్రేయస్ అయ్యర్ ను కూడా తీసుకోలేదు. రుతురాజ్ గైక్వాడ్ నూ పట్టించుకోలేదు. ఈ మ్యాచ్ లో ఇండియా ఓటమితో తుది జట్టు ఎంపికపై విమర్శలు మరింత ఎక్కువయ్యాయి.

తుది జట్టుపై ఎవరేమన్నారంటే?

రవి బిష్ణోయ్ లేకపోవడాన్ని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తప్పుబట్టాడు. "శ్రేయస్ ను ఎందుకు తీసుకోలేదో నాకు తెలియదు. బెంగళూరులో ఆడిన చివరి మ్యాచ్ లో అతడు హాఫ్ సెంచరీ చేశాడు. మరి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండర్ల కోసం చూస్తున్నారా లేక అయ్యర్ కు ఏమైనా గాయమైందా టీమ్ మేనేజ్‌మెంటే చెప్పాలి. ఇక వరల్డ్ నంబర్ వన టీ20 బౌలర్ కూడా జట్టులో లేడు. ఇది ఇంకా ప్రధాన జట్టు కూడా కాదు. యువకులకు అవకాశాలు ఇస్తున్నారు. దీనికి సూర్యకుమార్ యాదవే సమాధానం చెప్పాలి" అని గంభీర్ అన్నాడు.

ఇక మరో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా దీనిపై స్పందించాడు. "ఈ జట్టులో ఆసక్తి రేపుతున్న విషయం మీకు చెబుతాను. శ్రేయస్ అయ్యర్ ఆడటం లేదు. మూడో స్థానంలో తిలక్ వర్మ ఉన్నాడు. వరల్డ్ కప్ లో ఆరుగురు రైట్ హ్యాండర్లు ఆడారు. ఇప్పుడు మాత్రం ఓ రైట్, ఓ లెఫ్ట్, ఓ రైట్ ఓ లెఫ్ట్ కాంబినేషన్ తీసుకున్నారు. ఆ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారా లేక ప్లేయర్స్ ను వాళ్ల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తున్నారా అర్థం కావడం లేదు" అని మంజ్రేకర్ అన్నాడు.

ఇక ఆకాశ్ చోప్రా ట్వీట్ చేస్తూ.. "అయ్యర్, బిష్ణోయ్ గురించి ఏమైనా సమాచారం ఉందా? అయ్యర్ గత సిరీస్ లో వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. బిష్ణోయ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్. నేను ఏదో మిస్ అవుతున్నట్లు అనిపిస్తోంది?" అని అన్నాడు. రెండో టీ20లో ఇండియా 5 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా చేతుల్లో ఓడిన విషయం తెలిసిందే. మూడు టీ20ల సిరీస్ లో తొలి మ్యాచ్ రద్దవగా.. ఇప్పుడు సౌతాఫ్రికా 1-0 ఆధిక్యంలో ఉంది.

తదుపరి వ్యాసం