తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rahul On Wellalage: అతని సంగతి తర్వాతి మ్యాచ్‌లో చూసుకుంటాం: వెల్లలాగెకు రాహుల్ వార్నింగ్

Rahul on Wellalage: అతని సంగతి తర్వాతి మ్యాచ్‌లో చూసుకుంటాం: వెల్లలాగెకు రాహుల్ వార్నింగ్

Hari Prasad S HT Telugu

13 September 2023, 17:35 IST

    • Rahul on Wellalage: అతని సంగతి తర్వాతి మ్యాచ్‌లో చూసుకుంటాం అంటూ శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ వెల్లెలాగెకు కేఎల్ రాహుల్ వార్నింగ్ ఇచ్చాడు. ఇండియాతో జరిగిన మ్యాచ్ లో ఈ స్పిన్నర్ ఐదు వికెట్లు తీసిన విషయం తెలిసిందే.
కేఎల్ రాహుల్, వెల్లెలాగె
కేఎల్ రాహుల్, వెల్లెలాగె

కేఎల్ రాహుల్, వెల్లెలాగె

Rahul on Wellalage: ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్ లో భాగంగా ఇండియాతో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక స్పిన్నర్ వెల్లలాగె ఎలా చెలరేగాడో తెలుసు కదా. వరల్డ్ క్లాస్ బ్యాటర్లు ఉన్న ఇండియన్ టాపార్డర్ ను ముప్పుతిప్పలు పెట్టాడు. రోహిత్, కోహ్లి, రాహుల్, గిల్ లాంటి బ్యాటర్లను ఔట్ చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ మెరిసి టీమిండియాను వణికించాడు.

ట్రెండింగ్ వార్తలు

RCB vs CSK : ధోనీ కోపం.. కోహ్లీ ఎమోషనల్​- ట్రెండింగ్​లో ‘డెఫినెట్లీ నాట్​’! క్రికెట్​ అంటే ఇదే..

Virat Kohli: అంపైర్‌తో గొడవకు దిగిన విరాట్ కోహ్లీ.. అలా చేయమంటూ ఒత్తిడి.. చివరికీ..!

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

RCB vs CSK: బాదేసిన బెంగళూరు.. డుప్లెసిస్, కోహ్లీ, పాటిదార్ మెరుపులు.. చెన్నై ముందు భారీ టార్గెట్.. ప్లేఆఫ్స్ చేరాలంటే..

అయితే ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత వెల్లలాగెకు వార్నింగ్ ఇచ్చాడు టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ కేఎల్ రాహుల్. తర్వాతి మ్యాచ్ లో అతని సంగతి చూసుకుంటామని అతడు అనడం విశేషం. ఈ మ్యాచ్ లో వెల్లెలాగె 5 వికెట్లు తీయడంతోపాటు 42 పరుగులు కూడా చేసిన విషయం తెలిసిందే.

"అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఐదు వికెట్లు తీసుకున్నాడు. తన టీమ్ తరఫున రాణించాడు. శ్రీలంక బౌలింగ్ అటాక్ లో అతడే చాలా ప్రమాదకరంగా కనిపించాడు. అతని గురించి ఇంకేం చెప్పాలి? అతడు ఐదుగురు టాపార్డర్ బ్యాటర్లను ఔట్ చేవాడు. ఈరోజు అతనికి కలిసొచ్చింది. బ్యాట్ తోనూ రాణించాడు" అని రాహుల్ అన్నాడు.

అదే సమయంలో అతనికి ఓ వార్నింగ్ కూడా ఇచ్చాడు. "మరొకసారి శ్రీలంకతో ఆడినప్పుడు అతనిపై ఎదురుదాడి చేస్తాం" అని రాహుల్ చెప్పడం విశేషం. ఒకవేళ గురువారం (సెప్టెంబర్ 14) జరగబోయే సూపర్ 4 మ్యాచ్ లో పాకిస్థాన్ ను శ్రీలంక ఓడిస్తే.. ఫైనల్లో ఇండియా, శ్రీలంక తలపడతాయి. అప్పుడు వెల్లెలాగెపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇండియన్ బ్యాటర్లకు దక్కుతుంది.

వెల్లెలాగె దెబ్బకు ఇండియా కేవలం 213 పరుగులకే ఆలౌటైంది. అయితే ఆ తర్వాత ఇండియన్ బౌలర్లు కూడా చెలరేగడంతో శ్రీలంక కేవలం 172 పరుగులకే కుప్పకూలింది. 41 పరుగులతో గెలిచిన ఇండియా ఆసియా కప్ ఫైనల్ చేరింది. అయితే ఈ మ్యాచ్ లో శ్రీలంక స్పిన్నర్లను రాహుల్ సమర్థంగా ఎదుర్కొన్నాడు. అలా ఆడటంలో తన వ్యూహమేంటో అతడు చెప్పాడు.

"మొదట కొన్ని బంతులు ఆడిన తర్వాత ఎలాంటి షాట్లు ఆడొచ్చో తెలుసుకోవడానికి ప్రయత్నించాను. మరీ డిఫెన్సివ్ గా ఆడి ముప్పు తప్పించుకోవచ్చు. కానీ నేను మాత్రం జాగ్రత్తగా ఉంటూ నా షాట్లు ఆడాలని నిర్ణయించుకున్నాను. నేను ఆడినంత వరకూ జాగ్రత్తగానే షాట్లు ఆడాను. నెక్ట్స్ టైమ్ కాస్త భిన్నంగా ఉండొచ్చు. ఓ బ్యాటర్ గా పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి షాట్లు ఆడాలో నిర్ణయించుకోవాలి" అని రాహుల్ అన్నాడు.

తదుపరి వ్యాసం