తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Nz Vs Sl Score: కుప్పకూలిన శ్రీలంక.. న్యూజిలాండ్ టార్గెట్ 172

NZ vs SL Score: కుప్పకూలిన శ్రీలంక.. న్యూజిలాండ్ టార్గెట్ 172

Hari Prasad S HT Telugu

09 November 2023, 17:33 IST

    • NZ vs SL Score: వరల్డ్ కప్ సెమీఫైనల్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో న్యూజిలాండ్ బౌలర్లను శ్రీలంకను కట్టడి చేశారు. అయితే టెయిలెండర్లు ప్రతిఘటించడంతో శ్రీలంక 171 రన్స్ చేయగలిగింది.
సమష్టిగా రాాణించిన న్యూజిలాండ్ బౌలర్లు
సమష్టిగా రాాణించిన న్యూజిలాండ్ బౌలర్లు (PTI)

సమష్టిగా రాాణించిన న్యూజిలాండ్ బౌలర్లు

NZ vs SL Score: వరల్డ్ కప్ 2023లో డూ ఆర్ డై మ్యాచ్ ఆడుతున్న న్యూజిలాండ్ బౌలింగ్ లో రాణించింది. శ్రీలంకను 171 పరుగులకే కట్టడి చేసి.. విజయంపై ఆశలు రేపుతోంది. శ్రీలంక టాప్, మిడిలార్డర్ బ్యాటర్లు చేతులెత్తేసినా.. టెయిలెండర్లు వీరోచితంగా పోరాడటంతో ఆ టీమ్ ఈ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. ఓపెనర్ కుశల్ పెరీరా 51 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా.. చివర్లో తీక్షణ 38 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు.

ట్రెండింగ్ వార్తలు

IPL 2024 SRH vs GT: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ చేరిన సన్ రైజర్స్.. హైదరాబాద్‌లో వర్షంతో టాస్ పడకుండానే జీటీతో మ్యాచ్ రద్దు

Nitish Kumar Reddy: ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో నితీష్ కుమార్ రెడ్డికి భారీ ధర.. ఐపీఎల్ మెరుపులే కారణం

Virat Kohli on retirement: మళ్లీ మీకు కనిపించను.. రిటైర్మెంట్‌పై విరాట్ కోహ్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

IPL 2024: ఒక్క మ్యాచ్ ఆడ‌కుండా కోట్లు సంపాదించారు - ఈ ఐపీఎల్‌లో బెంచ్‌కే ప‌రిమిత‌మైన స్టార్ క్రికెట‌ర్లు వీళ్లే

ఒక దశలో శ్రీలంక టీమ్ 113 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. అయితే చివర్లో తీక్షణ, చమీర, మదుషంక న్యూజిలాండ్ బౌలర్లను ప్రతిఘటించారు. ఈ ముగ్గురూ మరో 23 ఓవర్ల పాటు న్యూజిలాండ్ బౌలర్లను విసిగించారు. ముఖ్యంగా తీక్షణ, మదుషంక చివరి వికెట్ కు ఏకంగా 43 పరుగులు జోడించడం విశేషం. లంక టీమ్ లో నిస్సంక (2), మెండిల్ (6), సమరవిక్రమ (1), అసలంక (8), మాథ్యూస్ (16), ధనంజయ డిసిల్వా (19) విఫలమయ్యారు.

చివర్లో తీక్షణ (38 నాటౌట్), మదుషంక (19) ఒక్కో పరుగూ జోడిస్తూ లంకకు ఓ మోస్తరు స్కోరు అందించగలిగారు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3, ఫెర్గూసన్, సాంట్నర్, రచిన్ రవీంద్ర తలా రెండు వికెట్లు తీసుకున్నారు. బ్యాటింగ్ కు అనుకూలించే బెంగళూరు పిచ్ పై శ్రీలంక భారీ స్కోరు చేయలేకపోయింది. మరి ఈ టార్గెట్ ను న్యూజిలాండ్ చేజ్ చేస్తుందా? ఘన విజయం సాధించి సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటుందా చూడాలి.

తదుపరి వ్యాసం