తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Shami On Kohli And Rohit: కోహ్లి బెస్ట్ బ్యాటరే కానీ రోహితే..: షమి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Shami on Kohli and Rohit: కోహ్లి బెస్ట్ బ్యాటరే కానీ రోహితే..: షమి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu

07 February 2024, 20:14 IST

    • Shami on Kohli and Rohit: టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమి.. కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బెస్ట్ బ్యాటర్ కోహ్లియే అయినా.. డేంజరస్ మాత్రం రోహిత్ అని అతడు అనడం గమనార్హం.
కోహ్లి బెస్ట్ బ్యాటరే కానీ రోహితే ప్రమాదకర బ్యాటర్ అంటున్న మహ్మద్ షమి
కోహ్లి బెస్ట్ బ్యాటరే కానీ రోహితే ప్రమాదకర బ్యాటర్ అంటున్న మహ్మద్ షమి (AP)

కోహ్లి బెస్ట్ బ్యాటరే కానీ రోహితే ప్రమాదకర బ్యాటర్ అంటున్న మహ్మద్ షమి

Shami on Kohli and Rohit: విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలలో ఎవరు గొప్ప? ఈ ప్రశ్నపై చాలా ఏళ్లుగా ఈ ఇద్దరు క్రికెటర్ల అభిమానుల మధ్య వార్ నడుస్తూనే ఉంటుంది. అయితే దీనికి పేస్ బౌలర్ మహ్మద్ షమి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు. వరల్డ్ బెస్ట్ బ్యాటర్ విరాట్ కోహ్లియే అని చెబుతూనే.. మోస్ట్ డేంజరస్ బ్యాటర్ మాత్రం రోహిత్ శర్మ అని షమి చెప్పడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

Virat Kohli IPL : ‘విరాట్​ కోహ్లీ ఆడినా ఆర్సీబీ ఓడిపోతుంది’!

RCB vs CSK : ధోనీ కోపం.. కోహ్లీ ఎమోషనల్​- ట్రెండింగ్​లో ‘డెఫినెట్లీ నాట్​’! క్రికెట్​ అంటే ఇదే..

Virat Kohli: అంపైర్‌తో గొడవకు దిగిన విరాట్ కోహ్లీ.. అలా చేయమంటూ ఒత్తిడి.. చివరికీ..!

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

కోహ్లి, రోహిత్‌లపై షమి కామెంట్స్

గతేడాది వరల్డ్ కప్ తర్వాత మళ్లీ టీమిండియా జెర్సీలో కనిపించని మహ్మద్ షమి.. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఈ మధ్యే మళ్లీ ట్రైనింగ్ మొదలుపెట్టాడు. ఇంగ్లండ్ తో మిగిలిన మూడు టెస్టుల కోసం తిరిగి జట్టులోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ మధ్యే అతడు న్యూస్ 18 ఛానెల్ తో మాట్లాడుతూ వరల్డ్ బెస్ట్ బ్యాటర్ ఎవరన్న ప్రశ్నపై స్పందించాడు.

"ప్రపంచంలో బెస్ట్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లియే. అతడు చాలా రికార్డులు బ్రేక్ చేశాడు. విరాట్ బెస్ట్ అని నేను అనుకుంటాను. కానీ ప్రపంచంలో చాలా ప్రమాదకర బ్యాటర్ ఎవరు అని అడిగితే మాత్రం రోహిత్ శర్మ అని చెబుతాను" అని షమి అన్నాడు. ఈ ఇద్దరు క్రికెటర్లలో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఎవరు అన్న చర్చపై షమి ఇలా ఆసక్తికర సమాధానమిచ్చాడు.

టీమిండియా బెస్ట్ కెప్టెన్ అతడే

ఇక టీమిండియా బెస్ట్ కెప్టెన్ ఎవరు అన్న ప్రశ్నకు కూడా మహ్మద్ షమి స్పందించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఎమ్మెస్ ధోనీల్లో ఎవరు బెస్ట్ అని ప్రశ్నించగా.. ధోనీకి ఓటేశాడు. "ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కానీ పోలిక వచ్చినప్పుడు మాత్రం సహజంగానే ఎవరు ఎక్కువ విజయవంతమైన కెప్టెనో వాళ్ల వైపే మొగ్గు చూపుతారు. అందుకే నేను కూడా ధోనీకే ఓటేస్తాను. ఎందుకంటే ధోనీ సాధించిన దానిని మరెవరూ అధిగమించలేకపోయారు" అని షమి స్పష్టం చేశాడు.

గతేడాది వరల్డ్ కప్ లో ఇండియా ఫైనల్ చేరడంలో షమి కీలకపాత్ర పోషించాడు. ఇండియా మొత్తం 11 మ్యాచ్ లు ఆడగా.. అందులో షమి 7 మ్యాచ్ లే ఆడాడు. మొదటి నాలుగు మ్యాచ్ లకు అతన్ని పక్కన పెట్టిన టీమ్ మేనేజ్‌మెంట్.. న్యూజిలాండ్ తో ఐదో మ్యాచ్ కు అవకాశం ఇచ్చింది. ఈ ఏడు మ్యాచ్ లలో షమి ఏకంగా 24 వికెట్లు తీశాడు. ఒక వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు క్రియేట్ చేశాడు.

ఇక ఇదే వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లి కూడా 765 పరుగులతో ఒక ఎడిషన్ లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్ రికార్డును సొంతం చేసుకున్నాడు. దీంతో గతేడాది ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును కోహ్లి దక్కించుకున్నాడు. ఈ రేసులో షమి ఉన్నా కూడా అతన్ని వెనక్కి నెట్టి కోహ్లి ఈ ఘనత సాధించాడు. ఇంగ్లండ్ తో జరిగిన తొలి రెండు టెస్టులకు కోహ్లి, షమి అందుబాటులో లేదు. మూడో టెస్టుకు కోహ్లి రావడం ఖాయమే అయినా.. షమి సంగతి ఇంకా తెలియడం లేదు.

తదుపరి వ్యాసం