తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Kohli Breaks Sachin Record: సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన విరాట్ కోహ్లి

Kohli Breaks Sachin Record: సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన విరాట్ కోహ్లి

Hari Prasad S HT Telugu

02 November 2023, 15:37 IST

    • Kohli Breaks Sachin Record: సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్ చేశాడు విరాట్ కోహ్లి. శ్రీలంకతో ముంబైలో జరుగుతున్న వరల్డ్ కప్ 2023 మ్యాచ్ లో కోహ్లి మరోసారి వన్డేల్లో ఒకే కేలండర్ ఏడాదిలో 1000 రన్స్ చేశాడు.
విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి (REUTERS)

విరాట్ కోహ్లి

Kohli Breaks Sachin Record: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు చెందిన మరో వరల్డ్ రికార్డును బ్రేక్ చేశాడు. శ్రీలంకతో గురువారం (నవంబర్ 2) ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో కోహ్లి వన్డేల్లో ఒకే కేలండర్ ఏడాదిలో 8వసారి 1000 పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాడు.

ట్రెండింగ్ వార్తలు

RCB vs CSK: బాదేసిన బెంగళూరు.. డుప్లెసిస్, కోహ్లీ, పాటిదార్ మెరుపులు.. చెన్నై ముందు భారీ టార్గెట్.. ప్లేఆఫ్స్ చేరాలంటే..

Rohit Sharma: రోహిత్ శర్మతో మాట్లాడిన నీతా అంబానీ.. వీడియో వైరల్.. ఆ అంశం గురించే అంటున్న ఫ్యాన్స్

Virat Kohli : విరాట్​ కోహ్లీ గల్లీ క్రికెట్​ టీమ్​లో నలుగురు స్టార్​ ప్లేయర్స్​..

RCB vs CSK : వర్షం వల్ల సీఎస్కే వర్సెస్​ ఆర్సీబీ మ్యాచ్​ జరగకపోతే.. ప్లేఆఫ్స్​ పరిస్థితేంటి?

ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లి బ్రేక్ చేయడం విశేషం. సచిన్ తన కెరీర్లో వన్డేల్లో ఏడు సార్లు ఒకే కేలండర్ ఇయర్ లో 1000 కంటే ఎక్కువ రన్స్ చేశాడు. ఇప్పుడు కోహ్లి ఆ ఘనతను 8వసారి అందుకొని రికార్డు క్రియేట్ చేశాడు. శ్రీలంకతో మ్యాచ్ కు ముందు కోహ్లి ఈ రికార్డుకు 34 పరుగుల దూరంలో ఉన్నాడు.

విరాట్ కోహ్లి 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2023లలో వన్డేల్లో 1000కిపైగా రన్స్ చేశాడు. ఇక సచిన్ విషయానికి వస్తే అతడు 1994, 1996, 1997, 1998, 2000, 2007లలో ఈ ఘనత సాధించాడు. ఇక 2023లో వన్డేల్లో 1000 రన్స్ చేసిన నాలుగో బ్యాటర్ విరాట్ కోహ్లి. ఇప్పటికే ఈ ఏడాది రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, పథుమ్ నిస్సంక 1000కి పైగా రన్స్ చేశారు.

శ్రీలంకతో మ్యాచ్ లో తొలి ఓవర్ రెండో బంతికే రోహిత్ శర్మ (4) ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లి.. తన కళ్లు చెదిరే ఫామ్ కొనసాగించాడు. మొదట్లోనే రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అతడు.. తర్వాత బౌండరీలు బాదుతూ లంక బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. ఇంగ్లండ్ తో మ్యాచ్ లో డకౌటైనా.. మళ్లీ లంకతో మ్యాచ్ లో గాడిలో పడ్డాడు.

కోహ్లి అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పటికే 26 వేలకుపైగా రన్స్ చేశాడు. సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర, రికీ పాంటింగ్ తర్వాత ఈ ఘనత అందుకున్న నాలుగో ప్లేయర్ విరాట్ కోహ్లి. ఈ ఏడాది వరల్డ్ కప్ లో టీమిండియా సాధిస్తున్న వరుస విజయాల్లో కోహ్లి కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఓ సెంచరీ కూడా చేశాడు.

తదుపరి వ్యాసం