Sachin Tendulkar Statue: టికెట్ కొన‌కుండా వ‌న్డే మ్యాచ్ చూశా - విగ్ర‌హావిష్క‌ర‌ణ వేడుక‌లో స‌చిన్ కామెంట్స్‌-sachin tendulkar recall memories with wankhede stadium at his statue inauguration event ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sachin Tendulkar Statue: టికెట్ కొన‌కుండా వ‌న్డే మ్యాచ్ చూశా - విగ్ర‌హావిష్క‌ర‌ణ వేడుక‌లో స‌చిన్ కామెంట్స్‌

Sachin Tendulkar Statue: టికెట్ కొన‌కుండా వ‌న్డే మ్యాచ్ చూశా - విగ్ర‌హావిష్క‌ర‌ణ వేడుక‌లో స‌చిన్ కామెంట్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Nov 02, 2023 12:05 PM IST

Sachin Tendulkar Statue: వాంఖ‌డే స్టేడియంలో అడుగుపెట్టిన ప్ర‌తిసారి వేలాది జ్ఞాప‌కాలు, మ‌ధురానుభూతులు క‌ళ్ల‌ముందు క‌ద‌లాడుతుంటాయ‌ని స‌చిన్ టెండూల్క‌ర్ అన్నాడు. క్రికెట‌ర్‌గా జీవితాన్ని ప్ర‌సాదించిన గ్రౌండ్‌లో త‌న విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌డం ఆనందంగా ఉంద‌ని స‌చిన్ తెలిపారు.

స‌చిన్ టెండూల్క‌ర్
స‌చిన్ టెండూల్క‌ర్

Sachin Tendulkar Statue: ముంబ‌యి వాంఖ‌డే స్టేడియంలో టీమిండియా క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ 22 అడుగుల విగ్ర‌హాన్ని బుధ‌వారం ఏర్పాటుచేశారు. స్టేడియంలో స‌చిన్ స్టాండ్‌కు స‌మీపంలో ఏర్పాటుచేసిన ఈ విగ్ర‌హాన్ని మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఏక్‌నాథ్ షిండే ఆవిష్క‌రించారు. ఈ విగ్ర‌హావిష్క‌ర‌ణ వేడుక‌లో స‌చిన్ టెండూల్క‌ర్‌తో పాటు ఆయ‌న భార్య అంజ‌లి, కూతురు సారా టెండూల్క‌ర్‌, కొడుకు అర్జున్ పాల్గొన్నారు.ఈ విగ్ర‌హావిష్క‌ర‌ణ వేడుక‌లో స‌చిన్ టెండూల్క‌ర్ ఎమోష‌న‌ల్ అయ్యాడు.

వాంఖ‌డేలో త‌న విగ్ర‌హాన్ని ఏర్పాటుచేయ‌డం గౌర‌వంగా భావిస్తున్న‌ట్లు తెలిపాడు. వాంఖ‌డే స్టేడియంతో త‌న‌కు విడ‌దీయ‌లేని అనుబంధ‌ముంద‌ని, ఈ గ్రౌండ్‌లో ఎప్పుడూ అడుగుపెట్టినా వేలాది అనుభ‌వాలు, జ్ఞాప‌కాలు క‌ళ్ల ముందు క‌ద‌లాడుతుంటాయ‌ని స‌చిన్ అన్నాడు. వాంఖ‌డే క్రికెట‌ర్‌గా త‌న జీవితాన్ని మార్చింద‌ని, ఈ గ్రౌండ్‌లో త‌న విగ్ర‌హాన్ని ఏర్పాటుచేయ‌డం గౌర‌వంగా భావిస్తున్న‌ట్లు స‌చిన్ తెలిపాడు.

త‌న లైఫ్‌లోనే ఇవి ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని మ‌ధుర క్ష‌ణాల‌ను స‌చిన్ తెలిపాడు. త‌న‌కు ప‌దేళ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడే వాంఖ‌డేతో అనుబంధం ఏర్ప‌డింద‌ని స‌చిన్ గుర్తుచేసుకున్నాడు. 1983 లో ఇండియా , వెస్టిండీస్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌ను వాంఖ‌డే స్టేడియంలో టికెట్ లేకుండానే చూసిన సంగ‌తిని స‌చిన్ గుర్తుచేసుకున్నాడు.

ఆ రోజే తాను ఎప్ప‌టికైనా ఇదే స్టేడియంలో క్రికెట‌ర్‌గా మ్యాచ్ ఆడాల‌ని క‌ల‌లు క‌న్నాన‌ని, ఆ క‌ల‌ను నిజం చేసుకోవ‌డం ఆనందంగా ఉంద‌ని తెలిపాడు. వాంఖ‌డే స్డేడియంలోనే స‌చిన్ టెండూల్క‌ర్ త‌న తొలి రంజీ మ్యాచ్ ఆడాడు. చివ‌రి టెస్ట్ మ్యాచ్‌ను కూడా ఆదే స్టేడియంలో ఆడ‌టం గ‌మ‌నార్హం.

WhatsApp channel