తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Jadeja Doubtful: టీమిండియాకు మరో దెబ్బ.. రెండో టెస్టుకు జడేజా డౌటే

Jadeja doubtful: టీమిండియాకు మరో దెబ్బ.. రెండో టెస్టుకు జడేజా డౌటే

Hari Prasad S HT Telugu

29 January 2024, 14:39 IST

    • Jadeja doubtful: ఇంగ్లండ్ చేతుల్లో తొలి టెస్టులో అవమానకర ఓటమి చవిచూసిన టీమిండియాకు రెండో టెస్టుకు ముందు గట్టి దెబ్బే తగిలేలా ఉంది. ఈ మ్యాచ్ కు స్టార్ ఆల్ రౌండర్ జడేజా దూరమయ్యే అవకాశాలు కనిస్తున్నాయి.
రవీంద్ర జడేజా, రాహుల్ ద్రవిడ్
రవీంద్ర జడేజా, రాహుల్ ద్రవిడ్ (ANI-PTI)

రవీంద్ర జడేజా, రాహుల్ ద్రవిడ్

Jadeja doubtful: ఇంగ్లండ్ తో విశాఖపట్నంలో జరగబోయే రెండో టెస్టుకు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అతడు తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Virat Kohli : విరాట్​ కోహ్లీ గల్లీ క్రికెట్​ టీమ్​లో నలుగురు స్టార్​ ప్లేయర్స్​..

RCB vs CSK : వర్షం వల్ల సీఎస్కే వర్సెస్​ ఆర్సీబీ మ్యాచ్​ జరగకపోతే.. ప్లేఆఫ్స్​ పరిస్థితేంటి?

LSG vs MI: చిట్ట‌చివ‌రి స్థానంతో ఇంటిముఖం ప‌ట్టిన ముంబై - ల‌క్నోను గెలిపించిన పూర‌న్‌, రాహుల్

MI vs LSG: దంచికొట్టిన పూరన్.. రాహుల్ హాఫ్ సెంచరీ.. ముంబై ఇండియన్స్‌పై లక్నో భారీ స్కోరు

హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్ట్ లోనే జడేజా గాయపడ్డాడు. రెండో ఇన్నింగ్స్ లో ఆ గాయం వల్లే వేగంగా పరుగెత్తలేక రనౌటయ్యాడు. టెస్ట్ క్రికెట్ లో జడేజా రనౌట్ కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

జడేజా గాయంపై ద్రవిడ్ ఏమన్నాడంటే?

క్రికెట్ లో వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తే అతికొద్ది మంది క్రికెటర్లలో జడేజా కూడా ఒకడు. అలాంటి ప్లేయర్ ఈ తొడ కండరాలు పట్టేయడంతో రెండో ఇన్నింగ్స్ లో వేగంగా పరుగెత్తలేకపోయాడు. మిడాన్ వైపు బంతిని ఆడిన జడేజా.. వేగంగా పరుగు తీయాలని భావించాడు. కానీ ఆలోపే కెప్టెన్ బెన్ స్టోక్స్ డైవ్ చేస్తూ అద్భుతమైన త్రో విసరడంతో రనౌటయ్యాడు.

ఈ రనౌట్ కూడా మ్యాచ్ ను మలుపు తిప్పింది. జడేజా గాయంపై మ్యాచ్ ముగిసిన తర్వాత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. మీడియాతో మాట్లాడిన అతడు.. జడ్డూ గాయం తీవ్రత ఎంత అన్నదానిపై తాను ఫిజియోతో మాట్లాడాల్సి ఉందని చెప్పాడు. "చూడాలి. ఇప్పటికీ ఫిజియోతో మాట్లాడే అవకాశం నాకు రాలేదు. అతడితో మాట్లాడిన తర్వాత ఆ గాయం ఎలాంటిదో తెలుస్తుంది" అని ద్రవిడ్ అన్నాడు.

జడేజా విశాఖ వెళ్తాడా?

ఇంగ్లండ్ తో రెండో టెస్ట్ విశాఖపట్నంలో జరగనుంది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ కోసం జడేజా విశాఖ వెళ్తాడా లేక అతన్ని నేషనల్ క్రికెట్ అకాడెమీకి పంపిస్తారా అన్నది తెలియలేదు. గతేడాది చివర్లో సౌతాఫ్రికాతో తొలి టెస్టుకు కూడా వెన్ను నొప్పితో జడేజా దూరమయ్యాడు. ఇప్పుడు రెండో టెస్టు అతడు ఆడకపోతే అది ఇండియాకు మరిన్ని తలనొప్పులు తెచ్చిపెడుతుంది.

తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో అతడు మొదట బంతితో, తర్వాత బ్యాట్ తో టీమ్ ను ఆదుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 87 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అయితే రెండో ఇన్నింగ్స్ లో మాత్రం కేవలం ఒక పరుగుకే రనౌటయ్యాడు. మొత్తంగా రెండు ఇన్నింగ్స్ కలిపి ఐదు వికెట్లు తీశాడు. టెస్ట్ క్రికెట్ లో జడేజా స్థానాన్ని భర్తీ చేయడం ఇండియాకు అంత సులువు కాదు.

అశ్విన్ తో కలిసి జడ్డూ చేసే స్పిన్ మ్యాజిక్.. లోయర్ ఆర్డర్ లో అతని బ్యాటింగ్ నైపుణ్యం ఎన్నోసార్లు ఇండియాకు విజయాలు సాధించి పెట్టింది. ఒకవేళ అతడు రెండో టెస్టు ఆడకపోతే అతని స్థానంలో ఎవరిని తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్ 196 రన్స్ తో వీరోచిత ఇన్నింగ్స్ ఆడటం టీమిండియా కొంప ముంచిన విషయం తెలిసిందే. ఇక రెండో ఇన్నింగ్స్ లో మన బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఇంగ్లండ్ తరఫున తొలి టెస్ట్ ఆడుతున్న హార్ట్‌లీ ఏకంగా 7 వికెట్లు తీశాడు.

తదుపరి వ్యాసం