Jadeja: స్టోక్స్‌ను 12వ సారి ఔట్ చేసిన అశ్విన్ - ఆల్‌రౌండ‌ర్ల‌లో జ‌డేజా రికార్డ్‌-ind vs eng 1st test live ashwin dismissed ben stokes 12th time in test ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Jadeja: స్టోక్స్‌ను 12వ సారి ఔట్ చేసిన అశ్విన్ - ఆల్‌రౌండ‌ర్ల‌లో జ‌డేజా రికార్డ్‌

Jadeja: స్టోక్స్‌ను 12వ సారి ఔట్ చేసిన అశ్విన్ - ఆల్‌రౌండ‌ర్ల‌లో జ‌డేజా రికార్డ్‌

Nelki Naresh Kumar HT Telugu
Published Jan 27, 2024 03:24 PM IST

Jadeja: హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రుగుతోన్న ఫ‌స్ట్ టెస్ట్‌లో టీమిండియా స్పిన్న‌ర్లు అశ్విన్‌, జ‌డేజా కొత్త రికార్డులు క్రియేట్ చేశారు. ఆ రికార్డులు ఎవంటే...

జ‌డేజా
జ‌డేజా

Ashwin: ఇంగ్లాండ్‌తో జ‌రుగుతోన్న ఫ‌స్ట్ టెస్ట్‌లో టీమిండియా స్పిన్న‌ర్లు అశ్విన్‌, జ‌డేజా టెస్టుల్లో కొత్త రికార్డును క్రియేట్ చేశారు. ఈ టెస్ట్‌లో బ్యాట్‌తో పాటు బౌలింగ్‌లోనూ జ‌డేజా అద‌ర‌గొట్టాడు.మ‌రోవైపు అశ్విన్ స్పిన్ దెబ్బ‌కు ఇంగ్లాండ్ విల‌విల‌లాడుతోంది. 190 ప‌రుగుల లోటుతో సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లాండ్ క‌డ‌ప‌టివార్త‌లు అందేస‌రికి ఐదు వికెట్లు న‌ష్టానికి 200 ప‌రుగులు చేసింది. ఓలీ పోప్ 83 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నాడు. అత‌డితో పాటు వికెట్ కీప‌ర్ బెన్ ఫోక్స్ కూడా 12 ప‌రుగుల‌తో ఆడుతోన్నాడు.

అశ్విన్ రికార్డ్‌

ఫ‌స్ట్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్‌లో అశ్విన్ కొత్త రికార్డ్ నెల‌కొల్పాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో అశ్విన్ బౌలింగ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బోల్డ‌య్యాడు. 33 బాల్స్ ఆడిన స్టోక్స్ కేవ‌లం 6 ప‌రుగులు మాత్ర‌మే చేసి పెవిలియ‌న్ చేరుకున్నాడు. టెస్టుల్లో అశ్విన్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్ ఔట‌వ్వ‌డం ఇది 12వ సారి కావ‌డం గ‌మ‌నార్హం. అశ్విన్ బౌలింగ్‌లో అత్య‌ధిక సార్లు ఔటైన బ్యాట్స్‌మెన్‌గా చెత్త రికార్డును బెన్ స్టోక్స్ మూట‌గ‌ట్టుకున్నాడు.

ఈ జాబితాలో డేవివ్ వార్న‌ర్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. టెస్టుల్లో అశ్విన్ బౌలింగ్‌లో వార్న‌ర్ ఇప్ప‌టివ‌ర‌కు 11 సార్లు ఔట‌య్యాడు. అలిస్ట‌ర్ కుక్‌ 9 సార్లు, స్మిత్‌ను ఎనిమిది సార్లు ఔట్ చేశాడు అశ్విన్‌. వీరిద్ద‌రు మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నారు. ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన అశ్విన్‌, సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇప్ప‌టివ‌ర‌కు రెండు వికెట్లు తీసుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో స్టోక్స్‌తో పాటు క్రాలీ వికెట్ల‌ను అశ్విన్ తీశాడు.

ఆల్‌రౌండ‌ర్ల‌లో జ‌డేజా రికార్డ్‌...

ఫ‌స్ట్ టెస్ట్‌లో బ్యాట్‌తో పాటు బౌలింగ్‌లో జ‌డేజా అద‌ర‌గొట్టాడు. ఫ‌స్ట్ ఇన్నింగ్‌లో బ్యాటింగ్‌లో 87 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా జ‌డేజా నిలిచాడు. అత‌డి జోరుతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 436 ప‌రుగులు చేసింది. అంతే కాకుండా బౌలింగ్‌లో ఫ‌స్ట్ ఇన్నింగ్‌లో మూడు వికెట్లు, సెకండ్ ఇన్నింగ్స్‌లో ఓ వికెట్ తీసుకున్నాడు.

టెస్టుల్లో బ్యాటింగ్, బౌలింగ్ యావ‌రేజ్ మ‌ధ్య అతి త‌క్కువ డిఫ‌రెన్స్ క‌లిగిన రెండో ఆల్ రౌండ‌ర్‌గా జ‌డేజా నిలిచాడు. జ‌డేజా బ్యాటింగ్ యావ‌రేజ్ 37.05 ఉండ‌గా...బౌలింగ్ యావ‌రేజ్‌..24.12 ఉంది. 12.9 మాత్ర‌మే అంత‌రం ఉంది. ఈ జాబితాలో9.19 డిఫ‌రెన్స్‌తో సౌతాఫ్రికా ఆల్‌రౌండ‌ర్ షాన్ పొల్లాక్ ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్నాడు.

హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రుగుతోన్న ఫ‌స్ట్ టెస్ట్ ఫ‌స్ట్ ఇన్నింగ్‌లో టీమిండియా 436 ప‌రుగులు చేసింది. జ‌డేజా 87, కేఎల్ రాహుల్ 86, జైస్వాల్ 80 ర‌న్స్ చేశారు. ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 246 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. కెప్టెన్ స్టోక్స్ 70 ప‌రుగులు చేశాడు.

Whats_app_banner