తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Team India: టీమిండియాకు ఎదురుదెబ్బ.. టెస్టు సిరీస్‍కు స్టార్ పేసర్ దూరం.. వన్డేల నుంచి చాహర్ ఔట్

Team India: టీమిండియాకు ఎదురుదెబ్బ.. టెస్టు సిరీస్‍కు స్టార్ పేసర్ దూరం.. వన్డేల నుంచి చాహర్ ఔట్

16 December 2023, 15:43 IST

    • Team India: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత్‍కు ఎదురుదెబ్బ తగిలింది. టెస్టులకు టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ దూరమయ్యాడు. వన్డేల నుంచి దీపక్ చాహర్ తప్పుకున్నాడు. వివరాలివే..
Team India: టీమిండియాకు ఎదురుదెబ్బ.. టెస్టు సిరీస్‍కు స్టార్ పేసర్ దూరం.. వన్డేల నుంచి చాహర్ ఔట్
Team India: టీమిండియాకు ఎదురుదెబ్బ.. టెస్టు సిరీస్‍కు స్టార్ పేసర్ దూరం.. వన్డేల నుంచి చాహర్ ఔట్ (AP)

Team India: టీమిండియాకు ఎదురుదెబ్బ.. టెస్టు సిరీస్‍కు స్టార్ పేసర్ దూరం.. వన్డేల నుంచి చాహర్ ఔట్

Team India: దక్షిణాఫ్రికా పర్యటనలో టీ20 సిరీస్‍ను సమం చేసుకుంది టీమిండియా. తదుపరి మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‍లను ఆడనుంది. వన్డేలకు కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చేయనున్నాడు. డిసెంబర్ 17నే వన్డే సిరీస్ మొదలుకానుంది. డిసెంబర్ 29న టెస్టు సిరీస్ షురూ అవుతుంది. అయితే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‍కు భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ దూరమయ్యాడు. అలాగే, వన్డే జట్టు నుంచి ఆల్‍రౌండర్ దీపక్ చాహర్ తప్పుకున్నాడు. ఆ వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

Virat Kohli: అంపైర్‌తో గొడవకు దిగిన విరాట్ కోహ్లీ.. అలా చేయమంటూ ఒత్తిడి.. చివరికీ..!

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

RCB vs CSK: బాదేసిన బెంగళూరు.. డుప్లెసిస్, కోహ్లీ, పాటిదార్ మెరుపులు.. చెన్నై ముందు భారీ టార్గెట్.. ప్లేఆఫ్స్ చేరాలంటే..

Rohit Sharma: రోహిత్ శర్మతో మాట్లాడిన నీతా అంబానీ.. వీడియో వైరల్.. ఆ అంశం గురించే అంటున్న ఫ్యాన్స్

షమీ దూరం ఎందుకు దూరమయ్యాడంటే..

పూర్తి ఫిట్‍నెస్ సాధించని కారణంగా టెస్టు సిరీస్‍కు భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ దూరమయ్యాడు. అతడి ఫిట్‍నెస్‍ క్లియరన్స్ ఉంటేనే టెస్టు సిరీస్ ఆడతాడని గతంలోనే బీసీసీఐ ప్రకటించింది. అయితే, షమీ ఇంకా పూర్తిస్థాయిలో ఫిట్‍నెస్ సాధించలేదు. దీంతో అతడు ఈ సిరీస్‍కు దూరం కావాల్సి వచ్చింది. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‍లో 24 వికెట్లతో షమీ సత్తాచాటాడు. ఆ తర్వాత అతడి చీలమండకు గాయమైంది.

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‍కు షమీ దూరమైనట్టు బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది.

వైదొలిగిన చాహర్

దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‍ నుంచి భారత పేసర్ దీపక్ చాహర్ తప్పుకున్నాడు. కుటుంబ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అతడు ఈ సిరీస్ నుంచి వైదొలిగాడు. అతడి స్థానంలో వన్డే జట్టులో ఆకాశ్ దీప్‍ను బీసీసీఐ తీసుకుంది.

దక్షిణాఫ్రికాతో డిసెంబర్ 17న తొలి వన్డే, 19న రెండో వన్డే, 21న మూడో వన్డే ఆడనుంది టీమిండియా. ఆ తర్వాత డిసెంబర్ 26 నుంచి డిసెంబర్ 30 వరకు భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు జరగనుంది. 2024 జనవరి 3 నుంచి జనవరి 7 వరకు రెండో టెస్టు ఉండనుంది.

వన్డే సిరీస్‍లో భారత్‍కు కేఎల్ రాహుల్ సారథ్యం వహించనున్నాడు. టెస్టు సిరీస్‍కు భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా జట్టులోకి వచ్చేయనున్నారు. టెస్టులకు రోహిత్ శర్మ కెప్టెన్సీ చేయనున్నాడు.

దక్షిణాఫ్రికాతో వన్డేలకు భారత జట్టు: రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్‍ పాటిదార్, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), సంజూ శాంసన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఆకాశ్ దీప్

దక్షిణాఫ్రికాతో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‍మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, మకేశ్ కుమార్, జస్‍ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ

తదుపరి వ్యాసం