తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs England Live: రోహిత్, జడేజా సెంచరీల మోత.. సర్ఫరాజ్ అదిరే అరంగేట్రం.. తొలి రోజు పడిలేచిన టీమిండియా

India vs England Live: రోహిత్, జడేజా సెంచరీల మోత.. సర్ఫరాజ్ అదిరే అరంగేట్రం.. తొలి రోజు పడిలేచిన టీమిండియా

Hari Prasad S HT Telugu

15 February 2024, 17:20 IST

    • India vs England Live: రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా సెంచరీల మోత మోగించడంతో ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి రోజు టీమిండియా పైచేయి సాధించింది. సర్ఫరాజ్ ఖాన్ తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లోనే హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.
సెంచరీల మోత మోగించిన జడేజా, రోహిత్.. టీమిండియా భారీ స్కోరు
సెంచరీల మోత మోగించిన జడేజా, రోహిత్.. టీమిండియా భారీ స్కోరు (ANI )

సెంచరీల మోత మోగించిన జడేజా, రోహిత్.. టీమిండియా భారీ స్కోరు

India vs England Live: ఇంగ్లండ్ తో మూడో టెస్ట్ కు అంతగా అనుభవం లేని బ్యాటింగ్ లైనప్ తో బరిలోకి దిగిన టీమిండియా.. తొలి రోజు సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా సెంచరీలు.. తొలి టెస్ట్ ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ మెరుపులతో పైచేయి సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 326 రన్స్ చేసింది. రోహిత్ 131, సర్ఫరాజ్ 62 రన్స్ చేసి ఔటవగా.. జడేజా 110 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Rohit Sharma: రోహిత్ శర్మతో మాట్లాడిన నీతా అంబానీ.. వీడియో వైరల్.. ఆ అంశం గురించే అంటున్న ఫ్యాన్స్

Virat Kohli : విరాట్​ కోహ్లీ గల్లీ క్రికెట్​ టీమ్​లో నలుగురు స్టార్​ ప్లేయర్స్​..

RCB vs CSK : వర్షం వల్ల సీఎస్కే వర్సెస్​ ఆర్సీబీ మ్యాచ్​ జరగకపోతే.. ప్లేఆఫ్స్​ పరిస్థితేంటి?

LSG vs MI: చిట్ట‌చివ‌రి స్థానంతో ఇంటిముఖం ప‌ట్టిన ముంబై - ల‌క్నోను గెలిపించిన పూర‌న్‌, రాహుల్

రోహిత్, జడేజా.. సూపర్ హీరోస్

మూడో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. మొదటి 45 నిమిషాల ఆట ముగిసే సరికి 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. యశస్వి (10), శుభ్‌మన్ గిల్ (0), రజత్ పటీదార్ (5) విఫలమయ్యారు. ఈ సమయంలో క్రీజులో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మకు బ్యాటింగ్ లో ప్రమోషన్ పొందిన రవీంద్ర జడేజా జత కలిశాడు. అసలు అనుభవం లేని మిడిలార్డర్ కు వెన్నెముకగా నిలుస్తూ జడేజా అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు.

ఈ ఇద్దరూ నాలుగో వికెట్ కు ఏకంగా 204 పరుగులు జోడించారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ టెస్టుల్లో తన 11వ సెంచరీ చేశాడు. ఇంగ్లండ్ పై అతనికిది మూడో సెంచరీ కావడం విశేషం. సాధారణంగా ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చే జడేజా.. ఈ ఇన్నింగ్స్ లో టీమ్ ను కష్టకాలంలో ఆదుకునేందుకు తొలి టెస్టు ఆడుతున్న సర్ఫరాజ్, ధృవ్ జురెల్ కంటే ముందుగా ఐదో స్థానంలో వచ్చాడు.

తనపై ఉంచిన నమ్మకాన్ని అతడు వమ్ము చేయలేదు. రోహిత్ కు మంచి సహకారం అందిస్తూ ఇంగ్లండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. దీంతో లంచ్ లోపే కాదు.. లంచ్ నుంచి టీ వరకూ కూడా టీమిండియా మరో వికెట్ కోల్పోలేదు. దీంతో అనుభవం లేని ఇండియా బ్యాటింగ్ లైనప్ ను కుప్పకూల్చాలని చూసిన ఇంగ్లండ్ ఆశలు నెరవేరలేదు.

సర్ఫరాజ్ ఖాన్.. అదిరిపోయిన అరంగేట్రం

సెంచరీ తర్వాత కూడా జోరు మీద కనిపించిన రోహిత్ శర్మ 131 రన్స్ చేసిన తర్వాత ఔటయ్యాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ అదరగొట్టాడు. అసలు తొలి టెస్ట్ ఆడుతున్న ప్లేయర్ గా కనిపించలేదు. వచ్చీ రాగానే ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ముఖ్యంగా స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుంటూ బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 48 బంతుల్లో ఆడిన తొలి టెస్ట్ ఇన్నింగ్స్ లోనే హాఫ్ సెంచరీ చేశాడు.

జడేజాతో కలిసి ఐదో వికెట్ కు సర్ఫరాజ్ 77 పరుగులు జోడించాడు. అందులో సర్ఫరాజ్ స్కోరే 62 పరుగులంటే అతడు ఏ వేగంతో ఆడాడో అర్థం చేసుకోవచ్చు. చివరికి 99 పరుగులు దగ్గర ఉన్న జడేజా తన సెంచరీ పరుగు కోసం తొందరపడటంతో సర్ఫరాజ్ రనౌటయ్యాడు. ఆ తర్వాతి బంతికే జడేజా టెస్టుల్లో నాలుగో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తన సొంతగడ్డ అయిన రాజ్‌కోట్ లో అతనికిది రెండో సెంచరీ.

తదుపరి వ్యాసం