తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Eng 5th Test: సెంచ‌రీల‌తో చెల‌రేగిన రోహిత్‌, శుభ్‌మ‌న్‌గిల్ - రికార్డులు బ్రేక్ చేసిన టీమిండియా క్రికెటర్లు

IND vs ENG 5th Test: సెంచ‌రీల‌తో చెల‌రేగిన రోహిత్‌, శుభ్‌మ‌న్‌గిల్ - రికార్డులు బ్రేక్ చేసిన టీమిండియా క్రికెటర్లు

08 March 2024, 11:33 IST

  • IND vs ENG 5th Test: ఇంగ్లండ్‌తో జ‌రుగుతోన్న ఐదో టెస్ట్‌లో రోహిత్ శ‌ర్మ‌, శుభ్‌మ‌న్‌గిల్ సెంచ‌రీల‌తో అద‌ర‌గొట్టారు. వ‌న్డే త‌ర‌హాలో చెల‌రేగిన వీరిద్ద‌రు ఫ‌స్ట్ సెష‌న్‌లోనే త‌మ సెంచ‌రీల‌ను పూర్తిచేసుకున్నారు.

శుభ్‌మ‌న్‌గిల్‌, రోహిత్ శ‌ర్మ‌
శుభ్‌మ‌న్‌గిల్‌, రోహిత్ శ‌ర్మ‌

శుభ్‌మ‌న్‌గిల్‌, రోహిత్ శ‌ర్మ‌

IND vs ENG 5th Test: ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌రుగుతోన్న ఐదో టెస్ట్‌లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌తో పాటు శుభ్‌మ‌న్ గిల్ సెంచ‌రీలు చేశారు. వీరిద్ద‌రి శ‌త‌కాల‌తో టీమిండియా భారీ స్కోరు దిశ‌గా సాగుతోంది వ‌న్డే త‌ర‌హాలో చెల‌రేగిన రోహిత్ శ‌ర్మ‌, శుభ్‌మ‌న్‌గిల్ ఎడాపెడా ఫోర్లు, సిక్స‌ర్ల‌తో ఇంగ్లండ్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు.

ట్రెండింగ్ వార్తలు

RR vs KKR: రాజస్థాన్, కోల్‍కతా మ్యాచ్‍ వర్షార్పణం.. హైదరాబాద్‍కు జాక్‍పాట్.. రెండో ప్లేస్‍ దక్కించుకున్న సన్‍రైజర్స్

SRH vs PBKS: ఉప్పల్‍లో దుమ్మురేపిన సన్‍రైజర్స్ హైదరాబాద్.. అదరగొట్టిన అభిషేక్.. పంజాబ్‍పై సూపర్ గెలుపు

Virat Kohli IPL : ‘విరాట్​ కోహ్లీ ఆడినా ఆర్సీబీ ఓడిపోతుంది’!

RCB vs CSK : ధోనీ కోపం.. కోహ్లీ ఎమోషనల్​- ట్రెండింగ్​లో ‘డెఫినెట్లీ నాట్​’! క్రికెట్​ అంటే ఇదే..

రోహిత్ శ‌ర్మ 154 బాల్స్‌లో సెంచ‌రీ సాధించాడు. ప‌ద‌మూడు ఫోర్లు, మూడు సిక్స‌ర్ల‌తో రోహిత్ శ‌ర్మ‌ 100 ప‌రుగులు చేశాడు. శుభ్‌మ‌న్‌గిల్ 137 బాల్స్‌లోనే శ‌త‌కం సాధించాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో ప‌దిఫోర్లు, ఐదు సిక్స‌ర్లు ఉన్నాయి. లంచ్ టైమ్‌కు ఒక వికెట్ న‌ష్టానికి టీమిండియా ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో 264 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం రోహిత్ శ‌ర్మ 102, శుభ్‌మ‌న్ గిల్ 101 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. 44 ప‌రుగుల ఆధిక్యంలో టీమిండియా కొన‌సాగుతోంది.

64 బాల్స్‌లో హాఫ్ సెంచ‌రీ...

135 ప‌రుగుల‌తో రెండో రోజును ప్రారంభించింది టీమిండియా. ఆరంభం నుంచే ఇంగ్లండ్ బౌల‌ర్ల‌ను శుభ్‌మ‌న్‌గిల్‌, రోహిత్ శ‌ర్మ చిత‌క్కొట్ట‌డం మొద‌లుపెట్టారు. చెత్త బంతుల‌ను వ‌దిలివేస్తూ మంచి బాల్స్‌ను ఫోర్లు, సిక్స‌ర్లుగా మ‌లిచారు. రోహిత్ శ‌ర్మ కాస్తంత నెమ్మ‌దిగా ఆడ‌గా శుభ్‌మ‌న్ మాత్రం ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. కేవ‌లం 64 బాల్స్‌లోనే హాఫ్ సెంచ‌రీ చేశాడు.

రోహిత్ శ‌ర్మ‌కు 12వ సెంచ‌రీ...

హాఫ్ సెంచ‌రీ త‌ర్వాత కూడా శుభ్‌మ‌న్ జోరు కొన‌సాగింది. వీరిద్ద‌రి జోడీని విడ‌గొట్టేందుకు ఇంగ్లండ్ కెప్టెన్ బౌల‌ర్ల‌ను మార్చిన ఉప‌యోగం లేక‌పోయింది. ఒకే ఓవ‌ర్ తేడాతో రోహిత్ శ‌ర్మ‌, శుభ్‌మ‌న్‌గిల్ సెంచ‌రీలు చేశారు. రోహిత్ శ‌ర్మ‌కు టెస్టుల్లో ఇది 12వ సెంచ‌రీ కాగా...శుభ్‌మ‌న్‌గిల్‌కు నాలుగోది. ఈ సిరీస్‌లో రోహిత్‌, శుభ్‌మ‌న్‌గిల్ ఇద్ద‌రికి ఇది రెండో సెంచ‌రీలు కావ‌డం గ‌మ‌నార్హం. రోహిత్ శ‌ర్మ‌కు మూడు ఫార్మెట్స్‌లో క‌లిసి 48వ సెంచ‌రీ. స‌చిన్‌, కోహ్లి త‌ర్వాత అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన క్రికెట‌ర్ల జాబితాలో ద్రావిడ్‌తో క‌లిసి రోహిత్ మూడో స్థానంలో కొన‌సాగుతోన్నాడు.

య‌శ‌స్వి త‌ర్వాత‌...

ఈ సిరీస్‌లో శుభ్‌మ‌న్‌గిల్ నాలుగు వంద‌ల‌కుపైగా ప‌రుగులు చేశాడు. య‌శ‌స్వి జైస్వాల్ త‌ర్వాత సెకండ్ హ‌య్యెస్ట్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో జ‌రుగుతోన్న ఐదో టెస్ట్‌లో రోహిత్ శ‌ర్మ‌, శుభ్‌మ‌న్‌గిల్ సెంచ‌రీల‌తో అద‌ర‌గొట్టారు. వ‌న్డే త‌ర‌హాలో చెల‌రేగిన వీరిద్ద‌రు ఫ‌స్ట్ సెష‌న్‌లోనే త‌మ సెంచ‌రీల‌ను పూర్తిచేసుకున్నారు. య‌శ‌స్వి జైస్వాల్ 57 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు.

జైస్వాల్ రికార్డులు...

నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 3-2 తేడాతో టీమిండియా కైవ‌సం చేసుకున్న‌ది. ఫ‌స్ట్ టెస్ట్‌లో ఇంగ్లండ్ గెల‌వ‌గా...మిగిలిన మూడు టెస్ట్‌లో టీమిండియా గెలుపొందింది. ఈ సిరీస్‌లోయ‌శ‌స్వి జైస్వాల్ 700ల‌కు పైగా ప‌రుగులు చేశాడు. గ‌వాస్క‌ర్ త‌ర్వాత ఓ టెస్ట్ సిరీస్‌లో హ‌య్యెస్ట్ ర న్స్ చేసిన ప్లేయ‌ర్‌గా య‌శ‌స్వి జైస్వాల్ రికార్డు నెల‌కొల్పాడు. అంతే కాకుండా టెస్టుల్లో అత్యంత వేగంగా వెయ్యి ప‌రుగులు పూర్తిచేసుకున్న క్రికెట‌ర్‌గా నిలిచాడు..

తదుపరి వ్యాసం