తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Eng 5th Test: కోచ్‌ల‌ను ఫీల్డ‌ర్స్‌గా మార్చేశారు - ఐదో టెస్ట్ కోసం ఇంగ్లండ్ టీమ్ నిర్ణ‌యం

IND vs ENG 5th Test: కోచ్‌ల‌ను ఫీల్డ‌ర్స్‌గా మార్చేశారు - ఐదో టెస్ట్ కోసం ఇంగ్లండ్ టీమ్ నిర్ణ‌యం

08 March 2024, 9:00 IST

  • IND vs ENG 5th Test: ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌రుగుతోన్న ఐదో టెస్ట్‌లో స‌బ్‌స్టిట్యూట్ ప్లేయ‌ర్లుగా ఇంగ్లండ్ జ‌ట్టు త‌మ కోచ్‌ల పేర్ల‌ను ప్ర‌క‌టించింది. ప్లేయ‌ర్ల కొర‌త కార‌ణంగానే ఇంగ్లండ్ కోచ్ పేర్ల‌ను స‌బ్‌స్టిట్యూట్స్‌గా ప్ర‌క‌టించిన‌ట్లు స‌మాచారం.

మార్క‌స్ ట్రెస్కోథిక్‌, పాల్ కాలింగ్‌వుడ్
మార్క‌స్ ట్రెస్కోథిక్‌, పాల్ కాలింగ్‌వుడ్

మార్క‌స్ ట్రెస్కోథిక్‌, పాల్ కాలింగ్‌వుడ్

IND vs ENG 5th Test: ఐదో టెస్ట్‌లో ఇంగ్లండ్ టీమ్‌ను ప్లేయ‌ర కొర‌త ఇబ్బందిపెడుతోంది. వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల‌తో సిరీస్ మ‌ధ్య‌లోనే కొంద‌రు ప్లేయ‌ర్లు ఇంగ్లండ్ వెళ్లిపోవ‌డం, మ‌రికొంద‌రు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతుండ‌టంతో స‌బిస్టిట్యూట్ ఫీల్డ‌ర్లు లిస్ట్‌లో కోచ్‌ల పేర్ల‌ను ఇంగ్లండ్ ప్ర‌క‌టించింది.

ట్రెండింగ్ వార్తలు

RR vs KKR: రాజస్థాన్, కోల్‍కతా మ్యాచ్‍ వర్షార్పణం.. హైదరాబాద్‍కు జాక్‍పాట్.. రెండో ప్లేస్‍ దక్కించుకున్న సన్‍రైజర్స్

SRH vs PBKS: ఉప్పల్‍లో దుమ్మురేపిన సన్‍రైజర్స్ హైదరాబాద్.. అదరగొట్టిన అభిషేక్.. పంజాబ్‍పై సూపర్ గెలుపు

Virat Kohli IPL : ‘విరాట్​ కోహ్లీ ఆడినా ఆర్సీబీ ఓడిపోతుంది’!

RCB vs CSK : ధోనీ కోపం.. కోహ్లీ ఎమోషనల్​- ట్రెండింగ్​లో ‘డెఫినెట్లీ నాట్​’! క్రికెట్​ అంటే ఇదే..

న‌లుగురు స‌బ్‌స్టిట్యూట్స్‌...

టెస్ట్ ల్లో మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్ర‌తి టీమ్ స‌బ్‌స్టిట్యూట్ ఫీల్డ‌ర్లుగా న‌లుగురు ప్లేయ‌ర్ల‌ పేర్ల‌ను ప్ర‌క‌టించాల్సి వుంటుంది. ధ‌ర్మ‌శాల టెస్ట్‌లో ఇంగ్లండ్ ఇద్ద‌రు క్రికెట‌ర్ల‌తో పాటు ఇద్ద‌రు కోచ్‌ల‌ను స‌బ్‌స్టిట్యూట్ ప్లేయ‌ర్లుగా ఉంటార‌ని వెల్ల‌డించింది. ఓలి రాబిన్స‌న్ లూజ్ మోష‌న్స్ కార‌ణంగా ఫీల్డింగ్‌కు దిగే ప‌రిస్థితి లేద‌ని తెలిసింది. వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల‌తో రెహాన్ అహ్మ‌ద్ నాలుగో టెస్ట్ త‌ర్వాత ఇంగ్లండ్ వెళ్లిపోయాడు. దాంతో స‌బిస్టిట్యూట్ ప్లేయ‌ర్లుగా ఇద్ద‌రు త‌క్కువ‌ కావ‌డంతో వారి స్థానంలో ఇంగ్లండ్ టీమ్‌కు స‌హాయక కోచ్‌లుగా ప‌నిచేస్తోన్న మార్క‌స్ ట్రెస్కోథిక్‌, పాల్ కాలింగ్‌వుడ్ పేర్ల‌ను లిస్ట్‌లో చేర్చింది. జ‌ట్టుకు అత్య‌వ‌స‌రం అయితే, లేదంటే గాయంతో ఏ ప్లేయ‌ర్ అయిన మైదానాన్ని వీడినా వీరు ఫీల్డింగ్ చేయాల్సివుంటుంది.

కాలింగ్‌వుడ్ దే రికార్డ్‌...

గ‌తంలో టీమ్‌లో స‌హాయ‌క సిబ్బందిగా ప‌నిచేస్తూ స‌బ్‌స్టిట్యూట్ ఫీల్డ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన‌ రికార్డ్ కాలింగ్ వుడ్ పేరు మీద‌నే ఉంది. 2014లో న్యూజిలాండ్‌తో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌లో కాలింగ్‌వుడ్ ఫీల్డింగ్ చేశాడు. అలాగే 2017లో మ‌రోసారి ఇంగ్లండ్‌, క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవెన్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో కాలింగ్‌వుడ్ స‌బ్‌స్టిట్యూట్‌గా వ్య‌వ‌హ‌రించాడు. 2022లో ఇంగ్లండ్‌, పాకిస్థాన్ సిరీస్‌లో ప్లేయ‌ర్ల‌కు డ్రింక్స్‌ అందించాడు కాలింగ్‌వుడ్‌.

టీమిండియా ఆధిప‌త్యం...

ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌రుగుతోన్న ఐదో టెస్ట్‌లో టీమిండియా ఆధిప‌త్యం కొన‌సాగుతోంది. ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 218 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఓపెన‌ర్ క్రాలీ (79 ప‌రుగులు) మిన‌హా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. ఇంగ్లండ్‌ను టీమిండియా స్పిన్న‌ర్లు కుల్దీప్‌, అశ్విన్ దెబ్బ‌కొట్టారు. కుల్దీప్ యాద‌వ్ ఐదు వికెట్లు తీశాడు. అశ్విన్ నాలుగు వికెట్లు ద‌క్కించుకున్నాడు. జ‌డేజా ఓ వికెట్ సొంతం చేసుకున్నాడు.

దంచికొట్టిన ఓపెన‌ర్లు...

ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో తొలి ఆట ముగిసే స‌మ‌యానికి టీమిండియా ఓ వికెట్ న‌ష్ట‌పోయి 135 ప‌రుగులు చేసింది. టీమిండియా ఓపెన‌ర్లు య‌శ‌స్వి జైస్వాల్‌, రోహిత్ శ‌ర్మ వ‌న్డే త‌ర‌హాలో ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో అద‌ర‌గొట్టారు. హాఫ్ సెంచ‌రీలు చేశారు. య‌శ‌స్వి జైస్వాల్ ఫోర్లు, సిక్స‌ర్ల‌తో ఇంగ్లండ్ బౌల‌ర్ల‌ను చిత‌క్కొట్టాడు. 58 బాల్స్‌లోనే మూడు సిక్స‌ర్లు, ఐదు ఫోర్ల‌తో 57 ర‌న్స్ చేశాడు. ఓ భారీ షాట్ కొట్టే ప్ర‌య‌త్నంలో ఔట‌య్యాడు. ప్ర‌స్తుతం రోహిత్ శ‌ర్మ (52 ప‌రుగులు), శుభ్‌మ‌న్ గిల్ (26 ర‌న్స్‌)తో క్రీజులో ఉన్నారు.

ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 3-1తో టీమిండియా కైవ‌సం చేసుకున్న‌ది. హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత జ‌రిగిన మూడు టెస్టుల్లో టీమిండియా జ‌య‌కేత‌నం ఎగురువేసింది.

For latest cricket news, live score, IPL stay connected with HT Telugu
తదుపరి వ్యాసం