Australia Team For World Cup: ఓపెన‌ర్‌గా స్మిత్‌కు ప్ర‌మోష‌న్ - వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌నున్న ఆస్ట్రేలియా జ‌ట్టు ఇదే!-australia team for world cup 2023 smith promotes as opener ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  Australia Team For World Cup 2023 Smith Promotes As Opener

Australia Team For World Cup: ఓపెన‌ర్‌గా స్మిత్‌కు ప్ర‌మోష‌న్ - వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌నున్న ఆస్ట్రేలియా జ‌ట్టు ఇదే!

HT Telugu Desk HT Telugu
Aug 07, 2023 11:56 AM IST

Australia Team For World Cup: వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం ఆస్ట్రేలియా జ‌ట్టును సోమ‌వారం ప్ర‌క‌టించారు. ఇండియా, సౌతాఫ్రికాతో జ‌రుగ‌నున్న ముక్కోణ‌పు సిరీస్‌లోనూ ఇదే టీమ్ ఆడ‌నున్న‌ట్లు బోర్డ్ అనౌన్స్‌చేసింది.

స్టీవ్ స్మిత్
స్టీవ్ స్మిత్

Australia Team For World Cup: వ‌ర‌ల్డ్ క‌ప్‌తో పాటు ఇండియా, సౌతాఫ్రికాతో జ‌రుగ‌నున్న ముక్కోణ‌పు సిరీస్ కోసం ఆస్ట్రేలియా జ‌ట్టును బోర్డ్ అనౌన్స్‌చేసింది. 15 మంది స‌భ్యుల‌తో కూడిన జ‌ట్టును ప్ర‌క‌టించారు. లెగ్ స్పిన్స‌ర్ త‌న్వీర్ సంగాతో పాటు ఆల్ రౌండ‌ర్ అరోన్ హ‌ర్డీ ట్రాయంగిల్ సిరీస్‌తో ఆస్ట్రేలియా జ‌ట్టులోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. గాయంతో చాలా కాలంగా టీమ్‌కు దూరంగా ఉంటోన్న క‌మిన్స్‌కు సెలెక్ట‌ర్లు కెప్టెన్సీ బాధ్య‌త‌ల్ని అప్ప‌గించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు

అలాగే గ్లెన్ మ్యాక్స్‌వెల్‌తో పాటు టెస్టు ప్లేయ‌ర్‌గా ముద్ర‌ప‌డిన ల‌బుషేన్‌ను ఎంపిక‌చేశారు. ట్రాయాంగిల్ సిరీస్‌తో పాటు వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఓపెన‌ర్‌గా వార్న‌ర్‌తో క‌లిసి స్టీవ్ స్మిత్ ను బరిలోకి దించాల‌నే ఆలోచ‌న‌లో ఆస్ట్రేలియా బోర్డ్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. ట్రాయాంగిల్ సిరీస్‌లో ఈ ప్ర‌యోగం చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది. ఒక‌వేళ ఈ ప్ర‌యోగం స‌క్సెస్ అయితే వ‌ర‌ల్డ్ క‌ప్‌లోనూ కొన‌సాగించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతోన్నారు.

ఇండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ట్రాయాంగిల్ సిరీస్ సెప్టెంబ‌ర్ ఏడు నుంచి 27 వ‌ర‌కు జ‌రుగ‌నుంది. వ‌ర‌ల్డ్ క‌ప్ అక్టోబ‌ర్ 8 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు జ‌రుగ‌నుంది. ట్రాయంగిల్ సిరీస్‌తో పాటు వ‌ర‌ల్డ్ క‌ప్‌కు ఇండియా ఆతిథ్యం ఇవ్వ‌బోతున్న‌ది.

ఆస్ట్రేలియా జ‌ట్టు ఇదే

పాట్ క‌మిన్స్ (కెప్టెన్‌), సీన్ అబాట్‌, వార్న‌ర్‌, స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌, లబుషేన్‌, అలెక్స్ క్యారీ, అగ‌ర్‌, ట్రావిస్‌హెడ్‌, మిచెల్ మార్స్‌, నాథ‌న్ ఎల్లీస్‌, కామెరూన్ గ్రీన్‌, అరోన్ హార్డీ, హెజ‌ల్‌వుడ్‌, ఇంగ్లీస్‌, త‌న్వీర్ సంగా, మిచెల్ స్టార్క్‌, స్టోయిన‌స్‌, ఆడ‌మ్ జంపా

WhatsApp channel