తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Under 19 World Cup Final: ప్రపంచకప్ ఫైనల్ పోరుకు భారత్, ఆస్ట్రేలియా రెడీ.. టైమింగ్, లైవ్, జట్ల వివరాలివే

Under 19 World Cup Final: ప్రపంచకప్ ఫైనల్ పోరుకు భారత్, ఆస్ట్రేలియా రెడీ.. టైమింగ్, లైవ్, జట్ల వివరాలివే

10 February 2024, 18:10 IST

    • IND vs AUS - Under 19 World Cup Final: అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‍ సమరంలో భారత్, ఆస్ట్రేలియా యువ జట్లు తలపడనున్నాయి. టైటిల్ ఫైట్‍లో హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ వివరాలు ఇవే..
Under 19 World Cup Final: ప్రపంచకప్ ఫైనల్ పోరుకు భారత్, ఆస్ట్రేలియా రెడీ
Under 19 World Cup Final: ప్రపంచకప్ ఫైనల్ పోరుకు భారత్, ఆస్ట్రేలియా రెడీ

Under 19 World Cup Final: ప్రపంచకప్ ఫైనల్ పోరుకు భారత్, ఆస్ట్రేలియా రెడీ

Under 19 World Cup Final - India vs Austalia: అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ ఫైట్‍కు అంతా రెడీ అయింది. టైటిల్ కోసం ఈ తుదిపోరులో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. డిఫెండింగ్ చాంపియన్‌ భారత యువ జట్టు.. ఆరో టైటిల్‍పై కన్నేసింది. దక్షిణాఫ్రికాలోని బెనోనీ వేదికగా ఆదివారం (ఫిబ్రవరి 11) భారత్, ఆస్ట్రేలియా అండర్-19 జట్ల మధ్య ప్రపంచకప్ ఫైనల్ జరగనుంది. తుదిపోరుకు భారత్ వరుసగా ఐదోసారి చేరింది. ఈ ఫైనల్ మ్యాచ్ వివరాలు ఇక్కడ చూడండి.

ట్రెండింగ్ వార్తలు

SRH vs PBKS: ఉప్పల్‍లో దుమ్మురేపిన సన్‍రైజర్స్ హైదరాబాద్.. అదరగొట్టిన అభిషేక్.. పంజాబ్‍పై సూపర్ గెలుపు

Virat Kohli IPL : ‘విరాట్​ కోహ్లీ ఆడినా ఆర్సీబీ ఓడిపోతుంది’!

RCB vs CSK : ధోనీ కోపం.. కోహ్లీ ఎమోషనల్​- ట్రెండింగ్​లో ‘డెఫినెట్లీ నాట్​’! క్రికెట్​ అంటే ఇదే..

Virat Kohli: అంపైర్‌తో గొడవకు దిగిన విరాట్ కోహ్లీ.. అలా చేయమంటూ ఒత్తిడి.. చివరికీ..!

భారత క్రికెట్‍లోకి విరాట్ కోహ్లీ అడుగుపెట్టిన తర్వాత అండర్-19 ప్రపంచకప్ బాగా పాపులర్ అయింది. 2008లో కోహ్లీ సారథ్యంలో భారత యువ జట్టు టైటిల్ గెలిచింది. దీంతో అప్పటి నుంచి అండర్-19పై క్రికెట్ అభిమానుల దృష్టి పెరిగింది. టీవీల్లోనూ అండర్-19 మ్యాచ్‍ లైవ్ కవరేజ్ పెరిగింది. భారత జట్టులోకి వచ్చాక విరాట్ కోహ్లీ అసామాన్యమైన ఆటతో చాలా రికార్డులను బద్దలు కొడుతున్నాడు.

యువరాజ్ సింగ్, మహమ్మద్ కైఫ్, సురేశ్ రైనా, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్ లాంటి ఆటగాళ్లు కూడా వివిధ ఎడిషన్ల అండర్-19 ప్రపంచకప్‍లో సత్తాచాటి వెలుగులోకి వచ్చారు. భారత్ ఇప్పటి వరకు 2000, 2008, 2012, 2018, 2022ల్లో అండర్-19 ప్రపంచకప్ టైటిల్ గెలిచింది. ఇప్పుడు మరోసారి ఫైనల్ చేరి ఆరో టైటిల్ కోసం ఆస్ట్రేలియాతో తలపడనుంది.

ప్రస్తుతం అండర్ 19 ప్రపంచకప్-2024 టోర్నీలో భారత కెప్టెన్ ఉదయ్ సహరన్ 389 పరుగులతో రాణించటంతో పాటు జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ టోర్నీలో లీడింగ్ రన్ స్కోరర్‌గా ఉన్నాడు. లెఫ్మార్మ్ స్పిన్నర్ సౌమీ పాండే 17 వికెట్లతో చెలరేగాడు. బ్యాటర్ సచిన్ దాస్ కూడా ఈ టోర్నీలో అదరగొడుతున్నాడు. భారత్ ఫైనల్ చేరడంలో వీరు కీలకపాత్ర పోషించారు.

భారత్, ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ టైమ్, వేదిక

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం (ఫిబ్రవరి 11) భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట 30 నిమిషాలకు (1:30 గంటలకు) మొదలవుతుంది. దక్షిణాఫ్రికాలోని బెనోనిలో ఈ మ్యాచ్ జరగనుంది.

లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్

టీమిండియా, ఆసీస్ మధ్య ఈ అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లలో ప్రసారం అవుతుంది. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.

జట్లు

భారత్: ఉదయ్ సహరన్ (కెప్టెన్), అర్ణిష్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాన్షు మోలియా, ముషీర్ ఖాన్, అరవెల్లి అవనీశ్ రావు (వికెట్ కీపర్), సౌమ్య్ కుమార్ పాండే (వైస్ కెప్టెన్), ఇన్నేశ్ మహరాజన్ (వికెట్ కీపర్), మురుగున్ అభిషేక్, ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబానీ, నమన్ తివారీ

ఆస్ట్రేలియా: హుజ్ వెబ్‍గెన్ (కెప్టెన్), చార్లీ ఆండర్సన్, లచ్లన్ ఐట్కెన్, హార్కియాత్ బాజ్వా, మహిల్ బియర్డ్ మ్యాన్, టామ్ చాంప్‍బెల్, హ్యారీ డిక్సాన్, ర్యాన్ హిక్స్ (వికెట్ కీపర్), సామ్ కొన్‍స్టాట్స్, రఫేల్ మ్యాక్‍మిలాన్, ఐజాన్ ఓకొన్నోర్, హర్జస్ సింగ్, టామ్ స్ట్రేకర్, కాలమ్ విడ్లెర్, ఓలీ పీక్

టాస్ తర్వాత రెండు టీమ్‍లు తుది జట్లను ప్రకటిస్తాయి.

తదుపరి వ్యాసం