తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Hardik Pandya Earnings: ముంబై ఇండియన్స్‌కు తిరిగి వచ్చిన హార్దిక్ పాండ్యా ఎన్ని కోట్లు సంపాదించాడో తెలుసా?

Hardik Pandya Earnings: ముంబై ఇండియన్స్‌కు తిరిగి వచ్చిన హార్దిక్ పాండ్యా ఎన్ని కోట్లు సంపాదించాడో తెలుసా?

Hari Prasad S HT Telugu

27 November 2023, 14:48 IST

    • Hardik Pandya Earnings: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు తిరిగి వచ్చిన హార్దిక్ పాండ్యాపై కోట్ల వర్షం కురిసింది. రెండు సీజన్ల పాటు గుజరాత్ టైటన్స్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్.. తిరిగి ముంబైకి వచ్చిన విషయం తెలిసిందే.
ముంబై ఇండియన్స్ కు తిరిగి వచ్చి భారీగా సంపాదించిన హార్దిక్ పాండ్యా
ముంబై ఇండియన్స్ కు తిరిగి వచ్చి భారీగా సంపాదించిన హార్దిక్ పాండ్యా (BCCI-IPL)

ముంబై ఇండియన్స్ కు తిరిగి వచ్చి భారీగా సంపాదించిన హార్దిక్ పాండ్యా

Hardik Pandya Earnings: ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యా విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడిన విషయం తెలిసిందే. గడువులోపు గుజరాత్ టీమ్ అతన్ని రిటెయిన్ చేసుకున్నా.. తర్వాత అనూహ్యంగా ముంబై ఇండియన్స్ అతన్ని తిరిగి దక్కించుకుంది. 2022 సీజన్ కు ముందు కొత్త ఫ్రాంఛైజీ అయిన గుజరాత్ టైటన్స్ కు వెళ్లిన హార్దిక్.. రెండు సీజన్ల తర్వాత మళ్లీ తన పాత టీమ్ కు తిరిగి రావడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

SRH vs PBKS: ఉప్పల్‍లో దుమ్మురేపిన సన్‍రైజర్స్ హైదరాబాద్.. అదరగొట్టిన అభిషేక్.. పంజాబ్‍పై సూపర్ గెలుపు

Virat Kohli IPL : ‘విరాట్​ కోహ్లీ ఆడినా ఆర్సీబీ ఓడిపోతుంది’!

RCB vs CSK : ధోనీ కోపం.. కోహ్లీ ఎమోషనల్​- ట్రెండింగ్​లో ‘డెఫినెట్లీ నాట్​’! క్రికెట్​ అంటే ఇదే..

Virat Kohli: అంపైర్‌తో గొడవకు దిగిన విరాట్ కోహ్లీ.. అలా చేయమంటూ ఒత్తిడి.. చివరికీ..!

అయితే హార్దిక్ పాండ్యా ఇలా ముంబైకి తిరిగి రావడం వల్ల సంపాదించింది ఎంత అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. 2015లో తొలిసారి కేవలం రూ.10 లక్షలకు పాండ్యాను దక్కించుకున్న ఐదుసార్లు ఛాంపియన్ ముంబై టీమ్.. ఈసారి మాత్రం భారీగానే సమర్పించుకోవాల్సి వచ్చింది. 2022 సీజన్ కు ముందు వేలంలో హార్దిక్ ను గుజరాత్ టైటన్స్ ఏకంగా రూ.15 కోట్లకు కొనుగోలు చేసింది.

హార్దిక్ పాండ్యాకు దక్కింది ఎంత?

హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో 2022లో తొలి సీజన్ లోనే విజేతగా నిలిచిన గుజరాత్ టైటన్స్.. తర్వాత 2023లోనూ ఫైనల్ వరకూ వచ్చి చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లో ఓడిపోయింది. ముంబై నుంచి గుజరాత్ వెళ్లి తిరిగి వచ్చే సరికి హార్దిక్ విలువ మరింత పెరిగింది. అయితే ఈ ట్రాన్స్‌ఫర్ తర్వాత కూడా హార్దిక్ పాండ్యాకు ఒక్కో సీజన్ కు అదే రూ.15 కోట్లు దక్కనున్నాయి.

ఇవి కాకుండా అదనంగా ట్రాన్స్‌ఫర్ ఫీజు కింద గుజరాత్ టైటన్స్ కు ముంబై ఇండియన్స్ మరిన్ని కోట్లు చెల్లించింది. ఈ మొత్తంలో సగం హార్దిక్ పాండ్యాకు దక్కుతాయి. దీంతో సీజన్ కు దక్కే రూ.15 కోట్లతోపాటు అదనంగా మరిన్ని కోట్లు హార్దిక్ ఖాతాలో చేరాయి. పాండ్యాను తిరిగి తీసుకోవడం కోసం తన దగ్గర డబ్బులు లేకపోవడంతో ముంబై ఇండియన్స్ కామెరాన్ గ్రీన్ తోపాటు మరో 11 మంది ప్లేయర్స్ ను ఇతర ఫ్రాంఛైజీలకు ట్రాన్స్‌ఫర్ చేసింది.

దీంతో ఐపీఎల్ 2024 మినీ వేలానికి ముందు ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ఖాతాలో రూ.15.25 కోట్లు ఉన్నాయి. ఇక గత వేలంలో ఏకంగా రూ.17.5 కోట్లకు కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ముంబై ఇచ్చేసింది. ఇది ముగిసిన తర్వాత వచ్చిన డబ్బులను గుజరాత్ కు చెల్లించి అక్కడి నుంచి హార్దిక్ పాండ్యాను వెనక్కి తీసుకొచ్చింది.

రెండు రకాల ట్రేడ్స్

ఐపీఎల్లో ప్లేయర్స్ ను రెండు రకాలుగా ఫ్రాంఛైజీలు ఇచ్చి పుచ్చుకుంటాయి. వన్ వే, టూ వే ట్రేడ్స్ ఉంటాయి. వన్ వే అంటే ఓ ప్లేయర్ ను ఓ ఫ్రాంఛైజీ మరో ఫ్రాంఛైజీకి పంపించి డబ్బులు తీసుకోవడం. రెండోది ఓ ప్లేయర్ ను ఇచ్చి, మరో ప్లేయర్ ను తీసుకోవడం. హార్దిక్ పాండ్యాను ముంబై వన్ వే ట్రేడ్ గా తీసుకోగా.. అటు గ్రీన్ ను ఆర్సీబీకి అలాగే ఇచ్చేసింది. ఇక ఆర్సీబీ తన బ్యాటర్ దేవదత్ పడిక్కల్ ను లక్నోకు ఇచ్చేసి బదులుగా పేసర్ అవేష్ ఖాన్ ను తీసుకుంది.

తదుపరి వ్యాసం