తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Shakib Al Hasan: మాథ్యూస్ టైమ్డ్ ఔట్ వివాదంలో ట్విస్ట్.. అతడు చెప్పడంతోనే అప్పీల్ చేశానన్న షకీబల్ హసన్

Shakib Al Hasan: మాథ్యూస్ టైమ్డ్ ఔట్ వివాదంలో ట్విస్ట్.. అతడు చెప్పడంతోనే అప్పీల్ చేశానన్న షకీబల్ హసన్

07 November 2023, 19:30 IST

    • Shakib Al Hasan on Angelo Mathews Timed Out: అంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్ వివాదంలో మరో ట్విస్ట్ వచ్చింది. ముందుగా తాను అప్పీల్ మొదలుపెట్టలేదని, తమ జట్టులోని ఓ ఫీల్డర్ చెప్పడంతోనే చేశానని బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబల్ హసన్ చెప్పాడు.
Shakib Al Hasan: మాథ్యూస్ టైమ్డ్ ఔట్ వివాదంలో ట్విస్ట్.. అతడు చెప్పడంతోనే అప్పీల్ చేశానన్న షకీబల్ హసన్
Shakib Al Hasan: మాథ్యూస్ టైమ్డ్ ఔట్ వివాదంలో ట్విస్ట్.. అతడు చెప్పడంతోనే అప్పీల్ చేశానన్న షకీబల్ హసన్

Shakib Al Hasan: మాథ్యూస్ టైమ్డ్ ఔట్ వివాదంలో ట్విస్ట్.. అతడు చెప్పడంతోనే అప్పీల్ చేశానన్న షకీబల్ హసన్

Shakib Al Hasan on Angelo Mathews Timed Out: శ్రీలంక సీనియర్ బ్యాటర్ అంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్ వివాదం పెద్దదవుతోంది. వన్డే ప్రపంచకప్‍లో సోమవారం శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‍లో మాథ్యూస్ టైమ్డ్ ఔట్ అయ్యాడు. గ్రౌండ్లోకి వచ్చి బ్యాటింగ్ మొదలుపెట్టేందుకు ఆలస్యం కావడంతో బంగ్లాదేశ్ ఆటగాళ్లు మాథ్యూస్‍ను ఔట్‍గా ప్రకటించాలని అప్పీల్ చేశారు. దీంతో అంపైర్లు ఔట్ ఇచ్చారు. అంతర్జాతీయ క్రికెట్‍లో టైమ్డ్ ఔట్ అయిన తొలి బ్యాటర్‌గా మాథ్యూస్ నిలిచాడు. అయితే, బంగ్లాదేశ్ అసలు క్రీడాస్ఫూర్తి చూపలేదనే విమర్షలు వస్తున్నాయి. చాలా మంది మాజీలు బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్‍తో పాటు ఆ జట్టుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ వివాదంలో తాజాగా ట్విస్ట్ ఇచ్చాడు షకీబల్ హసన్.

ట్రెండింగ్ వార్తలు

RCB vs CSK : ధోనీ కోపం.. కోహ్లీ ఎమోషనల్​- ట్రెండింగ్​లో ‘డెఫినెట్లీ నాట్​’! క్రికెట్​ అంటే ఇదే..

Virat Kohli: అంపైర్‌తో గొడవకు దిగిన విరాట్ కోహ్లీ.. అలా చేయమంటూ ఒత్తిడి.. చివరికీ..!

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

RCB vs CSK: బాదేసిన బెంగళూరు.. డుప్లెసిస్, కోహ్లీ, పాటిదార్ మెరుపులు.. చెన్నై ముందు భారీ టార్గెట్.. ప్లేఆఫ్స్ చేరాలంటే..

టైమ్డ్ ఔట్ అప్పీల్ వెనక్కి తీసుకోవాలని అంజెలో మాథ్యూస్.. షకీబ్‍ను అడిగినా అతడు నిరాకరించాడు. అంపైర్లు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో షకీబ్‍పై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. అలా చేసినందుకు తనకు ఏ మాత్రం బాధలేదని షకీబ్ కూడా అన్నాడు. అయితే, ఈ వివాదంలో తాజాగా ఓ కొత్త విషయం చెప్పాడు. టైమ్డ్ ఔట్ కోసం అప్పీల్ చేయాలని తమ జట్టులోని ఓ ఫీల్డర్ తనకు చెప్పాడని షకీబ్ వెల్లడించాడు.

“మాలో ఒక ఫీల్డర్ నా దగ్గరికి వచ్చి.. ఒకవేళ అప్పీల్ చేస్తే నిబంధనల ప్రకారం మాథ్యూస్ ఔట్ అవుతాడని చెప్పాడు. అప్పీల్ చేస్తే రూల్ ప్రకారం క్రీజులోకి వచ్చి ఆడకపోవటంతో అతడిని ఔట్‍గా ప్రకటిస్తారని చెప్పాడు. దీంతో ఆ తర్వాత నేను అంపైర్లకు అప్పీల్ చేశా. అయితే, మాథ్యూస్‍ను వెనక్కి పిలుస్తారా అని అంపైర్లు నన్ను అడిగారు. ఒకవేళ రూల్ ప్రకారం అతడు ఔట్ అయితే.. వెనక్కి పిలవడం బాగోదని నేను అనుకున్నా. అందుకే వెనక్కి పిలవలేదు” అని షకీబ్.. మీడియా సమావేశంలో చెప్పాడు. అయితే, ఆ ఫీల్డర్ ఎవరో షకీబ్ పేరు చెప్పలేదు. అయితే, ఆ విషయం షకీబ్‍కు చెప్పింది నజ్ముల్ హుసేన్ షాంతో అని మ్యాచ్ వీడియో చూస్తే తెలుస్తోంది.

అయితే, తాను రెండు నిమిషాల్లోగానే బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమయ్యానని శ్రీలంక సీనియర్ ప్లేయర్ మాథ్యూస్ వీడియో ఆధారాలను కూడా బయటపెట్టాడు. షకీబ్ చేసిన పనిని తీవ్రంగా తప్పుబట్టాడు.

శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్‍లో 25వ ఓవర్లో మాథ్యూస్ టైమ్డ్ ఔట్ జరిగింది. సదీర సమరవిక్రమ ఔట్ కావటంతో గ్రౌండ్‍లోకి వచ్చాడు మాథ్యూస్. అయితే, తన హెల్మెట్ సరిగా లేదని గుర్తించాడు. వేరే హెల్మెట్ తీసుకురావాలని డకౌట్‍లోని ఇతర ప్లేయర్లను అడిగారు. ఆ తర్వాత వేరే హెల్మెట్ తీసుకొని బ్యాటింగ్‍కు రెడీ అయ్యాడు. అయితే, ఇంతలోనే 2 నిమిషాల టైమ్ అయిపోయిందని, నిబంధనల ప్రకారం మాథ్యూస్‍ను ఔట్‍గా ప్రకటించాలని టైమ్డ్ ఔట్ కోసం అప్పీల్ చేశాడు బంగ్లా కెప్టెన్ షకీబ్. దీంతో మాథ్యూస్‍ను టైమ్డ్ ఔట్‍గా అంపైర్లు ప్రకటించారు. ఈ మ్యాచ్‍లో బంగ్లా 3 వికెట్ల తేడాతో గెలిచింది.

తదుపరి వ్యాసం