తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sl Vs Ban Angelo Mathews: లేటైందని మాథ్యూస్ ఔట్.. ఇలా ఔటైన తొలి అంతర్జాతీయ క్రికెటర్‌గా..

SL vs BAN Angelo Mathews: లేటైందని మాథ్యూస్ ఔట్.. ఇలా ఔటైన తొలి అంతర్జాతీయ క్రికెటర్‌గా..

06 November 2023, 17:18 IST

    • SL vs BAN Angelo Mathews: బంగ్లాదేశ్‍తో మ్యాచ్‍లో శ్రీలంక బ్యాటర్ అంజెలో మాథ్యూస్ విచిత్రంగా ఔటయ్యాడు. టైమ్డ్ ఔట్ అయిన తొలి అంతర్జాతీయ క్రికెటర్‌గా అతడు నిలిచాడు.
అంజెలో మాథ్యూస్
అంజెలో మాథ్యూస్ (REUTERS)

అంజెలో మాథ్యూస్

SL vs BAN Angelo Mathews: వన్డే ప్రపంచకప్‍లో భాగంగా ఢిల్లీ వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య నేడు (నవంబర్ 11) జరుగుతున్న మ్యాచ్‍లో ఓ విచిత్రమైన విషయం జరిగింది. శ్రీలంక సీనియర్ ఆల్‍రౌండర్ అంజెలో మాథ్యూస్ విచిత్రంగా ఔటయ్యాడు. ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే పెవిలియన్‍కు చేరాడు. ఆడేందుకు ఆలస్యం చేశాడనే కారణంతో మాథ్యూస్ టైమ్డ్ ఔట్ అయ్యాడు. వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

IPL 2024 Playoffs: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్.. 8 మ్యాచ్‌లు, 7 టీమ్స్, 3 బెర్తులు.. ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయంటే?

RCB Playoffs Chances: ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలు.. చెన్నై సూపర్ కింగ్స్‌పై ఇలా గెలిస్తే టాప్ 4లోకి..

RCB vs DC: వరుసగా ఐదో మ్యాచ్ గెలిచిన బెంగళూరు.. నిలిచిన ప్లేఆఫ్స్ ఆశలు.. అక్షర్ పోరాడినా ఢిల్లీకి భారీ ఓటమి దెబ్బ

MS Dhoni: ఊపిరి పీల్చుకున్న ధోనీ ఫ్యాన్స్.. కానీ!

ఈ మ్యాచ్‍లో శ్రీలంక బ్యాటర్ సదీర సమరవిక్రమ (41) ఔటయ్యాక బ్యాటింగ్ చేసేందుకు అంజెలో మాథ్యూస్ గ్రౌండ్‍లోకి వచ్చాడు. అయితే, హెల్మెట్‍కు ఉన్న స్ట్రాప్ సరిగా లేని విషయాన్ని గమనించకుండా దాన్నే తీసుకొచ్చాడు. తప్పుడు హెల్మెట్ తీసుకొచ్చాడు. దీంతో వేరే హెల్మెట్ తీసుకురావాలని డగౌట్‍లోని శ్రీలంక ప్లేయర్లకు సూచన చేశాడు. దీంతో వారు వేరే హెల్మెట్ తీసుకొచ్చారు. అయితే, ఇదంతా జరిగేలోపు కాస్త సమయం గడిచింది.

దీంతో క్రీజులోకి వచ్చి ఆడేందుకు అంజెలో మాథ్యూస్ ఎక్కువ సమయం తీసుకున్నాడని, ఔట్‍గా ప్రకటించాలని బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్ అంపైర్లకు అప్పీల్ చేశాడు. ఔట్ ఇవ్వాలని కోరాడు. దీంతో నిబంధనల ప్రకారం అంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్ అయినట్టుగా అంపైర్లు ప్రకటించారు. అప్పీల్‍ను వెనక్కి తీసుకోవాలని మాథ్యూస్ అడిగినా.. అందుకు షకీబ్ నిరాకరించాడు. దీంతో మాథ్యూస్ పెవిలియన్ చేరాడు.

అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‍లో టైమ్డ్ ఔట్ అయిన తొలి ఆటగాడిగా అంజెలో మాథ్యూస్ నిలిచాడు. ఊహించని రీతిలో ఔటయ్యాక నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు.

“ఓ బ్యాటర్ ఔట్/రిటైర్మెంట్ అయ్యాక.. తదుపరి వచ్చే బ్యాటర్ మూడు నిమిషాల్లోగా తర్వాతి బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలి లేదా ఆ టైమ్‍లోగా అవతలి ఎండ్‍లో ఉన్న బ్యాటర్ అయినా బంతిని ఆడాలి. లేకపోతే కొత్తగా వచ్చిన బ్యాటర్‌ను ఔట్‍గా ప్రకటించవచ్చు” అని ఎంసీసీ రూల్‍ బుక్‍లో నిబంధన ఉంది. అయితే, ఈ వన్డే ప్రపంచకప్‍కు ఆ సమయం 2 నిమిషాలుగానే ఉంది.

బ్యాటింగ్ కోసం మైదానంలోకి వచ్చినా.. నిర్ణీత నిమిషాల్లోగా బంతిని ఎదుర్కోకపోవటంతో నిబంధనల ప్రకారం అంజెలో మాథ్యూస్‍ను ఔట్‍గా ప్రకటించారు అంపైర్లు. అయితే, బంగ్లా కెప్టెన్ షకీబుల్ హసన్ అసలు క్రీడాస్ఫూర్తి చూపలేదని విమర్శలు కూడా వస్తున్నాయి.

ఫస్ట్ క్లాస్ క్రికెట్‍లో ఇప్పటి వరకు ఆరుగురు మాత్రమే టైమ్డ్ ఔట్ అయ్యారు. అయితే, అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో టైమ్డ్ ఔట్ అయిన తొలి ఆటగాడిగా అంజెలో మాథ్యూస్ నిలిచాడు.

తదుపరి వ్యాసం