తెలుగు న్యూస్  /  క్రికెట్  /  David Warner Book: 2 వేల పేజీలతో వార్నర్ ఆటోబయోగ్రఫీ.. చదివి ఆశ్చర్యపోతారంటున్న స్టార్ బ్యాటర్

David Warner book: 2 వేల పేజీలతో వార్నర్ ఆటోబయోగ్రఫీ.. చదివి ఆశ్చర్యపోతారంటున్న స్టార్ బ్యాటర్

Hari Prasad S HT Telugu

09 January 2024, 10:13 IST

    • David Warner book: ఈ మధ్యే టెస్టులు, వన్డేల నుంచి రిటైరైన ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 2 వేల పేజీలతో తన ఆటోబయోగ్రఫీ తీసుకురానున్నాడు. ఇది చదివి అందరూ ఆశ్చర్యపోవడం ఖాయమని అతడు చెప్పడం గమనార్హం.
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ (via REUTERS)

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్

David Warner book: ఆస్ట్రేలియన్ క్రికెట్ లోకి ఓ దూకుడైన ప్లేయర్ గా అడుగుపెట్టి.. ఓ లెజెండ్ గా టెస్ట్, వన్డే కెరీర్ ముగించిన డేవిడ్ వార్నర్.. తన కెరీర్ మొత్తాన్ని ఆటోబయోగ్రఫీ రూపంలో తీసుకురానున్నాడు. ఈ విషయాన్ని వార్నరే వెల్లడించాడు. అంతేకాదు ఇందులో తాను వెల్లడించబోయే విషయాలు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తాయని అతడు స్పష్టం చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

RCB vs CSK : వర్షం వల్ల సీఎస్కే వర్సెస్​ ఆర్సీబీ మ్యాచ్​ జరగకపోతే.. ప్లేఆఫ్స్​ పరిస్థితేంటి?

LSG vs MI: చిట్ట‌చివ‌రి స్థానంతో ఇంటిముఖం ప‌ట్టిన ముంబై - ల‌క్నోను గెలిపించిన పూర‌న్‌, రాహుల్

MI vs LSG: దంచికొట్టిన పూరన్.. రాహుల్ హాఫ్ సెంచరీ.. ముంబై ఇండియన్స్‌పై లక్నో భారీ స్కోరు

Gambhir as Coach: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్.. బీసీసీఐ చూపు అతని వైపే..

ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ లతో ప్రైరీ క్లబ్ ఫైర్ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో డేవిడ్ వార్నర్ మాట్లాడాడు. ఈ సందర్భంగా తన ఆటోబయోగ్రఫీ చాలా ఇంట్రెస్టింగా ఉంటుందని అతడు చెప్పడం విశేషం. ఈ బుక్ ఏకంగా 2 వేలపేజీల వరకూ ఉంటుందని వార్నర్ చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది.

బాల్ టాంపరింగ్ గురించి చెబుతాడా?

డేవిడ్ వార్నర్ ఆటోబయోగ్రఫీ వస్తుందనగానే చాలా మంది అభిమానులు.. అతడు 2018లో జరిగిన బాల్ టాంపరింగ్ ఉదంతం గురించి ఏం చెబుతాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆస్ట్రేలియా క్రికెట్ ను కుదిపేసిన ఈ ఘటన జరిగిన సమయంలో కెప్టెన్ గా స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ ఉన్నారు. ఈ బాల్ టాంపరింగ్ ఘటన తర్వాత వీళ్లు ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం కూడా ఎదుర్కొన్నారు.

ఇప్పటికే వార్నర్ దీనిపై విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. దీంతో తన పుస్తకంలో ఆ ఘటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనున్నట్లు కూడా వార్నర్ చెప్పాడు. పుస్తకం చివరి దశలో ఉందని, కొన్ని ఎడిట్స్ చేస్తున్నట్లు తెలిపాడు. ఇప్పటికే 1500 పేజీలు ఉన్న పుస్తకానికి మరికొన్ని పేజీలు జోడిస్తున్నానని, ఇది 2 వేల పేజీల వరకూ వెళ్తుందని అతడు అన్నాడు.

తన పుస్తకం చూసి కొందరు ఆశ్చర్యపోవడం ఖాయమని కూడా స్పష్టం చేశాడు. "సాండ్ పేపర్ బాల్ టాంపరింగ్ ఉదంతం గతం. అయినా ఇప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉంది. ఎన్నో పుకార్లు వచ్చాయి. ఎన్నో కామెంట్స్ వస్తున్నాయి. కానీ నా వరకూ టీమ్ వీటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతూనే ఉండాలి. బాల్ టాంపరింగ్ ఘటనలో నా తరఫు స్టోరీ సరైన సమయంలో చెబుతాను. ఈ పుస్తకంలో కొన్ని విషయాలు మాత్రం 2018లో జరిగిన ఈ ఘటన గురించి చర్చిస్తాయి" అని వార్నర్ అన్నాడు.

37 ఏళ్ల డేవిడ్ వార్నర్ వన్డే, టెస్ట్ కెరీర్ ముగించినా.. టీ20ల్లో మాత్రం కొనసాగనున్నాడు. అయితే ఈ రెండు ఫార్మాట్లలో తన ఓపెనింగ్ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరని అడిగితే.. మార్కస్ హ్యారిస్ పేరు అతడు చెప్పాడు. అయితే స్టీవ్ స్మిత్ కూడా ఆ స్థానంలో సక్సెస్ కాగలడని అభిప్రాయపడ్డాడు. పాకిస్థాన్ తో సిడ్నీలో ముగిసిన మూడో టెస్టే వార్నర్ కెరీర్లో చివరి మ్యాచ్. తన చివరి ఇన్నింగ్స్ లో వార్నర్ హాఫ్ సెంచరీ చేయడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్ లో పాంటింగ్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్ వార్నరే.

తదుపరి వ్యాసం