తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Cwc 2023: ఫైనల్లో తలపడేది ఇండియా, న్యూజిలాండే: ఆకాశ్ చోప్రా

CWC 2023: ఫైనల్లో తలపడేది ఇండియా, న్యూజిలాండే: ఆకాశ్ చోప్రా

Hari Prasad S HT Telugu

19 October 2023, 14:53 IST

    • CWC 2023: ఫైనల్లో తలపడేది ఇండియా, న్యూజిలాండే అని అన్నాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. ఆఫ్ఘనిస్థాన్ పై న్యూజిలాండ్ గెలిచిన తర్వాత తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ అతడు ఈ కామెంట్స్ చేశాడు.
న్యూజిలాండ్ టీమ్
న్యూజిలాండ్ టీమ్ (ANI)

న్యూజిలాండ్ టీమ్

CWC 2023: వరల్డ్ కప్ 2023లో ఇప్పటి వరకూ ఓటమెరగిన టీమ్స్ ఇండియా, న్యూజిలాండ్. ఈ రెండు టీమ్సే ఫైనల్లో తలపడబోతున్నాయని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అనడం విశేషం. న్యూజిలాండ్ టీమ్ బుధవారం (అక్టోబర్ 18) ఆఫ్ఘనిస్థాన్ ను ఓడించిన తర్వాత చోప్రా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. ఈ కామెంట్స్ చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Virat Kohli : బ్యాట్​ పట్టిన వామిక.. క్రికెటర్​ అవుతుందా? కోహ్లీ సమాధానం ఇది..

ipl 2024: కోట్లు పెట్టి కొంటే తుస్‌మ‌నిపించారు - ఈ ఐపీఎల్‌లో దారుణంగా ఫ్లాపైన రిచెస్ట్ క్రికెట‌ర్లు వీళ్లే!

CSK vs RCB : ఆర్సీబీ కోసం సీఎస్కే ప్రత్యేక 'అస్త్రం'- ధోనీని..

IPL 2024 SRH vs GT: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ చేరిన సన్ రైజర్స్.. హైదరాబాద్‌లో వర్షంతో టాస్ పడకుండానే జీటీతో మ్యాచ్ రద్దు

గాయాలతోపాటు అంతగా ఫామ్ లో లేకపోవడంతో న్యూజిలాండ్ ను వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ఫేవరెట్స్ లో ఒకటిగానూ పరిగణించలేదు. అయితే టోర్నీ ప్రారంభమైన తర్వాత మాత్రం వరుసగా నాలుగు విజయాలతో టేబుల్లో టాప్ లో కొనసాగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ తోపాటు నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ లపై గెలిచింది.

సౌథీ, విలియమ్సన్ లాంటి వాళ్లు లేకపోయినా న్యూజిలాండ్ గెలుస్తుండటాన్ని ఆకాశ్ చోప్రా ప్రత్యేకంగా ప్రస్తావించాడు. "వాళ్లది అద్భుతమైన టీమ్. ఇండియా, న్యూజిలాండ్ ఫైనల్లో తలపడతాయనడంలో పెద్దగా ఆశ్చర్యమేమీ లేదు. న్యూజిలాండ్ వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలిచింది. దీంతో వాళ్ల సెమీఫైనల్ బెర్త్ దాదాపు ఖాయమైనట్లే. వాళ్లది ఎంత మంచి టీమ్ అంటే.. కేన్ ఉన్నాడా లేదా అన్నదాంతో కూడా సంబంధం లేదు. ఎలాగోలా గెలిచే మార్గం కనుగొంటారు" అని ఆకాశ్ చోప్రా చెప్పాడు.

ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్ లో మధ్యలో వరుసగా వికెట్లు కోల్పోయినా.. న్యూజిలాండ్ భారీ స్కోరు చేసిన విషయాన్ని చోప్రా గుర్తు చేశాడు. "కేన్ లేడు. మధ్యలో వరుసగా వికెట్లు కోల్పోయారు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడ్డాయి. అయినా టామ్ లేథమ్, గ్లెన్ ఫిలిప్స్ ఆదుకున్నారు. మొదట్లో విల్ యంగ్, రచిన్ రవీంద్ర బాగా ఆడారు. కాన్వే కూడా కొన్ని రన్స్ చేశారు. చెన్నైలో రన్స్ చేయడం అంత సులువు కాదు. అలాంటి చోట 280 ప్లస్ రన్స్ చాలా ఎక్కువ. బౌలింగ్ లో బౌల్ట్, హెన్రీ రాణించారు. ఫెర్గూసన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు" అని ఆకాశ్ చోప్రా అన్నాడు.

తదుపరి వ్యాసం