తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sl Vs Ned: ప్రపంచకప్‍లో ఎట్టకేలకు బోణీ కొట్టిన శ్రీలంక

SL vs NED: ప్రపంచకప్‍లో ఎట్టకేలకు బోణీ కొట్టిన శ్రీలంక

21 October 2023, 18:39 IST

    • SL vs NED World Cup 2023: వన్డే ప్రపంచకప్‍లో శ్రీలంక ఎట్టకేలకు గెలుపు ఖాతా తెరిచింది. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‍లో చోమటోడ్చి నెగ్గింది లంక. వివరాలివే..
SL vs NED: ప్రపంచకప్‍లో ఎట్టకేలకు బోణీ కొట్టిన శ్రీలంక
SL vs NED: ప్రపంచకప్‍లో ఎట్టకేలకు బోణీ కొట్టిన శ్రీలంక (AFP)

SL vs NED: ప్రపంచకప్‍లో ఎట్టకేలకు బోణీ కొట్టిన శ్రీలంక

SL vs NED World Cup 2023: వన్డే ప్రపంచకప్‍లో శ్రీలంక ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఈ మెగాటోర్నీలో తొలి మూడు మ్యాచ్‍ల్లో వరుసగా ఓడిన లంక జట్టు.. నేడు (అక్టోబర్ 21) నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‍లో గెలిచింది. ప్రపంచకప్‍లో పాయింట్ల ఖాతా తెరిచింది. లక్నోలో నేడు జరిగిన మ్యాచ్‍లో శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌పై చెమటోడ్చి గెలిచింది.

ట్రెండింగ్ వార్తలు

RCB vs CSK : ధోనీ కోపం.. కోహ్లీ ఎమోషనల్​- ట్రెండింగ్​లో ‘డెఫినెట్లీ నాట్​’! క్రికెట్​ అంటే ఇదే..

Virat Kohli: అంపైర్‌తో గొడవకు దిగిన విరాట్ కోహ్లీ.. అలా చేయమంటూ ఒత్తిడి.. చివరికీ..!

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

RCB vs CSK: బాదేసిన బెంగళూరు.. డుప్లెసిస్, కోహ్లీ, పాటిదార్ మెరుపులు.. చెన్నై ముందు భారీ టార్గెట్.. ప్లేఆఫ్స్ చేరాలంటే..

ఈ మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్‌ 49.4 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌటైంది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు సైబ్రాండ్ ఇంగెల్‍బ్రెచ్ (70 పరుగులు), లోగాన్ వాన్ బీక్ (59) అర్ధ శతకాలతో సత్తాచాటడంతో నెదర్లాండ్స్‌ ఆ స్కోరు చేయగలిగింది. లంక బౌలర్లలో దిల్షాన్ మధుశంఖ, కసున్ రజిత చెరో నాలుగు వికెట్లతో సత్తాచాటారు. అనంతరం, 48.2 ఓవర్లలో 5 వికెట్లకు 263 పరుగులు చేసి విజయం సాధించింది శ్రీలంక. సదీర సమరవిక్రమ (91 పరుగులు; నాటౌట్), పాతుమ్ నిస్సంక (54) అర్ధ శతకాలతో సత్తాచాటారు. నెదర్లాండ్స్‌ బౌలర్లలో ఆర్యన్ దత్ మూడు, మీకీరన్, అకెర్మన్ చెరో వికెట్ తీశారు. మరోవైపు, గత మ్యాచ్‍లో దక్షిణాఫ్రికాపై సంచలన విజయం సాధించిన నెదర్లాండ్స్.. శ్రీలంకపై చివరి వరకు పోరాడి ఓడినా భళా అనిపించింది.

కుప్పకూలి.. ఆ తర్వాత నిలబడి..

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‍కు దిగిన నెదర్లాండ్స్‌కు శ్రీలంక బౌలర్లు రజిత, మధుశంఖ చుక్కలు చూపారు. వరుసగా వికెట్లు తీస్తూ డచ్ టీమ్‍ను కుప్పకూల్చారు. దీంతో ఓ దశలో ఏకంగా 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది నెదర్లాండ్స్. అయితే, అప్పుడే ఆ జట్టు లోయర్ ఆర్డర్ బ్యాటర్లు సిబ్రండ్ ఇంగెల్‍బ్రెచ్, వాన్ బీక్ అద్భుతంగా ఆడారు. లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. ఎదురుదాడికి కూడా దిగారు. ఈ క్రమంలో ఇంగెల్‍బ్రెచ్ 65 బంతుల్లో హాఫ్ సెంచరీకి చేరుకోగా.. వాన్ బీక్ 68 బంతుల్లో అర్ధ శతకానికి చేరాడు. ఏడో వికెట్‍కు వీరిద్దరూ ఏకంగా 130 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించటంతో నెదర్లాండ్స్ పుంజుకుంది. వీరు ఔటయ్యాక టేలెండర్లు ఎక్కువ సేపు నిలువలేదు.

చెమటోడ్చి గెలిచిన లంక

మోస్తరు లక్ష్యాన్ని శ్రీలంక చెమటోడ్చి ఛేదించింది. ఓపెనర్ పాతుమ్ నిస్సంక (54) అర్ధ శకతంతో రాణించాడు. కుషార్ పెరీరా (5), కుషాల్ మెండిస్ (11) త్వరగా ఔటయ్యారు. అయితే, సదీర సమరవిక్రమ చివరి వరకు నిలకడగా ఆడి.. వికెట్లు పడకుండా జాగ్రత్త పడ్డాడు. చరిత్ అసలంక (44), ధనుంజయ డిసిల్వ (30) అతడికి సహకరించారు. నెదర్లాండ్స్ బౌలర్ ఆర్యన్ దత్ మూడు వికెట్లతో రాణించాడు.

తదుపరి వ్యాసం