తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs Afghanistan 3rd T20: క్లీన్ స్వీప్‍పై భారత్ గురి.. పిచ్ ఎలా ఉండనుంది? శాంసన్‍కు చోటు దక్కుతుందా?

India vs Afghanistan 3rd T20: క్లీన్ స్వీప్‍పై భారత్ గురి.. పిచ్ ఎలా ఉండనుంది? శాంసన్‍కు చోటు దక్కుతుందా?

16 January 2024, 22:02 IST

    •  India vs Afghanistan 3rd T20: అఫ్గానిస్థాన్‍తో ఆఖరి పోరుకు భారత్ సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య బుధవారం (జనవరి 17) మూడో టీ20 జరగనుంది. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న రోహిత్‍సేన.. క్లీన్ స్వీప్‍పై గురి పెట్టనుంది.
India vs Afghanistan 3rd T20: క్లీన్ స్వీప్‍పై భారత్ గురి.. పిచ్ ఎలా ఉండనుంది? శాంసన్‍కు చోటు దక్కుతుందా?
India vs Afghanistan 3rd T20: క్లీన్ స్వీప్‍పై భారత్ గురి.. పిచ్ ఎలా ఉండనుంది? శాంసన్‍కు చోటు దక్కుతుందా? (PTI)

India vs Afghanistan 3rd T20: క్లీన్ స్వీప్‍పై భారత్ గురి.. పిచ్ ఎలా ఉండనుంది? శాంసన్‍కు చోటు దక్కుతుందా?

India vs Afghanistan 3rd T20: ఈ ఏడాది జూన్‍లో జరగనున్న టీ20 ప్రపంచకప్‍ టోర్నీకి ముందు తన ఆఖరి అంతర్జాతీయ టీ20 ఆడేందుకు టీమిండియా రెడీ అయింది. అఫ్గానిస్థాన్‍తో మూడో టీ20 కూడా గెలిచి సిరీస్‍ను క్లీన్ స్వీప్ చేయడంపై కన్నేసింది. భారత్, అఫ్గానిస్థాన్ మధ్య బుధవారం (జనవరి 17) మూడో టీ20 జరగనుంది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మూడు టీ20ల సిరీస్‍లో అప్పటికే తొలి రెండు మ్యాచ్‍ల్లో విజయం సాధించి 2-0తో పక్కా చేసుకుంది భారత్. ఆఖరి పోరులోనూ సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Virat Kohli: అంపైర్‌తో గొడవకు దిగిన విరాట్ కోహ్లీ.. అలా చేయమంటూ ఒత్తిడి.. చివరికీ..!

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

RCB vs CSK: బాదేసిన బెంగళూరు.. డుప్లెసిస్, కోహ్లీ, పాటిదార్ మెరుపులు.. చెన్నై ముందు భారీ టార్గెట్.. ప్లేఆఫ్స్ చేరాలంటే..

Rohit Sharma: రోహిత్ శర్మతో మాట్లాడిన నీతా అంబానీ.. వీడియో వైరల్.. ఆ అంశం గురించే అంటున్న ఫ్యాన్స్

ఈ ఏడాది జూన్‍ 1 నుంచి 29వ తేదీ వరకు వెస్టిండీస్, అమెరికా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. దానికి ముందు భారత్ ఆడే చివరి అంతర్జాతీయ టీ20 అఫ్గానిస్థాన్‍తో ఆడే ఈ మూడో మ్యాచే. అయితే, వరల్డ్ కప్ టీమ్ కాంబినేషన్‍పై ఇప్పుడే స్పష్టత వచ్చేలా కనిపించడం లేదు. ప్రపంచకప్ టోర్నీకి ముందు జరిగే ఐపీఎల్‍ కీలకంగా మారనుంది. ఐపీఎల్‍లో ఆటగాళ్ల ఫామ్‍ను బట్టి టీ20 ప్రపంచకప్‍కు జట్టు కూర్పుపై సెలెక్టర్లు తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది.

ఇక, ఈ అఫ్గాన్ సిరీస్‍తో చాలా కాలం తర్వాత భారత టీ20 జట్టులోకి మళ్లీ వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ తొలి రెండు మ్యాచ్‍ల్లో డకౌట్ అయ్యాడు. దీంతో మూడో మ్యాచ్‍లో దుమ్మురేపాలని కసిగా ఉన్నాడు. రెండో మ్యాచ్ ఆడిన విరాట్ కోహ్లీ మంచి టచ్‍లో కనిపించాడు.

భారత్, అఫ్గానిస్థాన్ మూడో టీ20 టైమ్, లైవ్

భారత్, అఫ్గానిస్థాన్ మధ్య మూడో టీ20 బుధవారం (జనవరి 17) జరనుంది. సాయంత్రం 7 గంటలకు మొదలుకానుంది. ఇందుకు అరగంట ముందు టాస్ ఉంటుంది. ‘స్పోర్ట్స్ 18’ టీవీ ఛానెళ్లలో ఈ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ చూడొచ్చు. జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో లైవ్ స్ట్రీమింగ్ వస్తుంది.

పిచ్ ఎలా..

టీమిండియా, అఫ్గాన్ మధ్య ఈ మూడో టీ20 మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనుంది. ఈ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‍కు ఎక్కువగా అనుకూలిస్తుంది. బౌండరీలు కూడా కాస్త దగ్గరగా ఉంటాయి. దీంతో ఈ మ్యాచ్‍లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫ్లాట్‍గా ఉండే ఈ పిచ్‍పై పరుగుల వరద పారే ఛాన్స్ ఉంది.

శాంసన్‍కు ప్లేస్ ఉంటుందా..

అఫ్గానిస్థాన్‍తో టీ20 సిరీస్‍కు భారత యంగ్ ప్లేయర్ సంజూ శాంసన్ ఎంపికయ్యాడు. అయితే, తొలి రెండు మ్యాచ్‍ల్లో అతడు బెంచ్‍కే పరిమితమయ్యాడు. జితేశ్ శర్మకే తుది జట్టులో చోటు కల్పించింది టీమిండియా మేనేజ్‍మెంట్. అయితే, ఇప్పటికే సిరీస్ కైవసం అవటంతో మూడో టీ20 కోసం తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. జితేశ్ స్థానంలో శాంసన్‍ను జట్టులోకి తీసుకోవచ్చు. అలాగే, రవి బిష్ణోయ్ ప్లేస్‍లో కుల్దీప్ యాదవ్‍ను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు.

3వ టీ20కి భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శివం దూబే, జితేశ్ శర్మ/ సంజూ శాంసన్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్/ కుల్‍దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, ముకేశ్ కుమార్

అఫ్గానిస్థాన్ తుది జట్టు (అంచనా): రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, మహమ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీమ్ జన్నత్, ముజీబుర్ రహ్మాన్, నూర్ అహ్మద్ / క్వాస్ అహ్మద్, నవీనుల్ హక్, ఫజల్‍హక్ ఫారూకీ

తదుపరి వ్యాసం