తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Heath Streak: తీవ్ర విషాదంలో క్రికెట్ ప్రపంచం.. జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ కన్నుమూత

Heath Streak: తీవ్ర విషాదంలో క్రికెట్ ప్రపంచం.. జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ కన్నుమూత

Hari Prasad S HT Telugu

23 August 2023, 8:38 IST

    • Heath Streak: క్రికెట్ ప్రపంచం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ కన్నుమూశాడు. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న అతడు మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచాడు.
హీత్ స్ట్రీక్
హీత్ స్ట్రీక్

హీత్ స్ట్రీక్

Heath Streak: జింబాబ్వే లెజెండరీ క్రికెటర్, మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ కన్నుమూశాడు. అతని వయసు 49 ఏళ్లు. కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్న అతడు.. మంగళవారం (ఆగస్ట్ 22) రాత్రి తుదిశ్వాస విడిచాడు. సౌతాఫ్రికాకు చెందిన ప్రముఖ ఆంకాలజిస్ట్ దగ్గర అతడు చికిత్స తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని గత మే నెలలో స్ట్రీక్ కుటుంబ సభ్యులు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

Sehwag on Mumbai Indians: రోహిత్, హార్దిక్ ఇద్దరినీ ముంబై ఇండియన్స్ వదిలించుకుంటుంది: సెహ్వాగ్ కామెంట్స్ వైరల్

Virat Kohli : బ్యాట్​ పట్టిన వామిక.. క్రికెటర్​ అవుతుందా? కోహ్లీ సమాధానం ఇది..

ipl 2024: కోట్లు పెట్టి కొంటే తుస్‌మ‌నిపించారు - ఈ ఐపీఎల్‌లో దారుణంగా ఫ్లాపైన రిచెస్ట్ క్రికెట‌ర్లు వీళ్లే!

CSK vs RCB : ఆర్సీబీ కోసం సీఎస్కే ప్రత్యేక 'అస్త్రం'- ధోనీని..

అయితే ఇన్నాళ్లూ ఈ మహమ్మారితో పోరాడిన స్ట్రీక్.. చివరికి తలవంచక తప్పలేదు. జింబాబ్వే తరఫున 1990ల్లో స్టార్ ప్లేయర్స్ లో ఒకడిగా ఎదిగాడు స్ట్రీక్. 2005లో రిటైర్మెంట్ ప్రకటించిన అతడు.. టెస్టుల్లో 216 వికెట్లు తీయడంతోపాటు 1990 రన్స్ చేశాడు. ఇక వన్డేల్లో 239 వికెట్లు తీయడంతోపాటు 2943 రన్స్ చేయడం విశేషం. జింబాబ్వే తరఫున ఆడిన అత్యుత్తమ క్రికెటర్లలో స్ట్రీక్ కూడా ఒకడు.

అయితే 2021లో అతనిపై ఐసీసీ నిషేధం విధించింది. స్ట్రీక్ ఐసీసీ అవినీతి నిరోధక మార్గదర్శకాలను ఉల్లంఘించాడన్న ఆరోపణలపై ఈ నిషేధం విధించారు. జింబాబ్వేతోపాటు బంగ్లాదేశ్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు అతడు కోచ్ గానూ వ్యవహరించాడు. అయితే చిన్న వయసులోనే స్ట్రీక్ అకాల మరణం క్రికెట్ ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది.

స్ట్రీక్ మరణంపై పలువురు మాజీ క్రికెటర్లు నివాళులర్పించారు. అతనితో కలిసి క్రికెట్ ఆడిన జింబాబ్వే మాజీ బౌలర్ హెన్రీ ఒలాంగా ఎక్స్ ద్వారా స్పందిస్తూ.. హీత్ స్ట్రీక్ మరణించాడన్న బాధాకరమైన వార్త తెలిసింది.. జింబాబ్వే తరఫున ఆడిన అతి గొప్ప ఆల్ రౌండర్. నీతో కలిసి ఆడటం సంతోషంగా ఉంది అని అన్నాడు.

టీమిండియా స్పిన్నర్ అశ్విన్ కూడా స్పందించాడు. హీత్ స్ట్రీక్ కన్నుమూశాడు.. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం అని అశ్విన్ ట్వీట్ చేశాడు. జింబాబ్వే తరఫున ఆడిన గ్రేటెస్ట్ ప్లేయర్స్ లో స్ట్రీక్ కూడా ఒకడు. అతడు 2000 నుంచి 2004 వరకు కెప్టెన్ గానూ ఉన్నాడు. ఆ టీమ్ తరఫున మొత్తం 65 టెస్టులు, 189 వన్డేలు ఆడాడు.

తదుపరి వ్యాసం