తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ben Stokes Century: రిటైర్మెంట్ నుంచి వచ్చాడు.. సెంచరీ బాదాడు.. స్టోక్స్ మెరుపు ఇన్నింగ్స్

Ben Stokes Century: రిటైర్మెంట్ నుంచి వచ్చాడు.. సెంచరీ బాదాడు.. స్టోక్స్ మెరుపు ఇన్నింగ్స్

Hari Prasad S HT Telugu

13 September 2023, 19:58 IST

    • Ben Stokes Century: రిటైర్మెంట్ నుంచి వచ్చి సెంచరీ బాదాడు బెన్ స్టోక్స్. న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో అతడు మెరుపు ఇన్నింగ్స్ ఆడి కేవలం 76 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం.
బెన్ స్టోక్స్
బెన్ స్టోక్స్ (AFP)

బెన్ స్టోక్స్

Ben Stokes Century: వరల్డ్ కప్ 2023కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ చెలరేగుతోంది. కిందటిసారి రన్నరప్ అయిన న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా మూడో వన్డే బుధవారం (సెప్టెంబర్ 13) జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మెరుపు సెంచరీ చేశాడు. అతడు ఈ మధ్యే వన్డే రిటైర్మెంట్ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు

Virat Kohli IPL : ‘విరాట్​ కోహ్లీ ఆడినా ఆర్సీబీ ఓడిపోతుంది’!

RCB vs CSK : ధోనీ కోపం.. కోహ్లీ ఎమోషనల్​- ట్రెండింగ్​లో ‘డెఫినెట్లీ నాట్​’! క్రికెట్​ అంటే ఇదే..

Virat Kohli: అంపైర్‌తో గొడవకు దిగిన విరాట్ కోహ్లీ.. అలా చేయమంటూ ఒత్తిడి.. చివరికీ..!

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

ఆరేళ్ల తర్వాత వన్డే క్రికెట్ లో బెన్ స్టోక్స్ సెంచరీ చేయడం విశేషం. ఆ సెంచరీ కూడా కేవలం 76 బంతుల్లోనే కావడం విశేషం. లండన్ లోని ది ఓవల్లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో స్టోక్స్ మూడంకెల స్కోరు అందుకున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన అతడు.. వన్డేల్లో తన నాలుగో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఇదే అతనికి ఫాస్టెస్ట్ సెంచరీ.

చివరిసారి 2017 జూన్ లో ఆస్ట్రేలియాపై వన్డేల్లో సెంచరీ చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన ఆ మ్యాచ్ లో స్టోక్స్ మూడంకెల స్కోరు అందుకున్నాడు. అయితే గతేడాది అనూహ్యంగా అతడు వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కానీ ఇప్పుడు వరల్డ్ కప్ దగ్గర పడుతున్న సమయంలో తన మనసు మార్చుకొని రిటైర్మెంట్ నుంచి బయటకు వచ్చాడు.

2019లో ఇంగ్లండ్ వరల్డ్ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన స్టోక్స్.. మళ్లీ టీమ్ లోకి రావడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇక తాజా సెంచరీతో అతడు ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు జారీ చేశాడు. ఇప్పటికే ఇంగ్లండ్ వరల్డ్ కప్ జట్టులో స్టోక్స్ ఉన్నాడు. న్యూజిలాండ్ తో నాలుగు వన్డేల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి వన్డేలోనూ స్టోక్స్ హాఫ్ సెంచరీ చేశాడు.

ఇక రెండో వన్డేలో ఒక పరుగుకే ఔటయ్యాడు. కానీ మూడో వన్డేలో తన విశ్వరూపం చూపించాడు. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోగా.. డేవిడ్ మలన్ తో కలిసి స్టోక్స్ మూడో వికెట్ కు ఏకంగా 199 పరుగులు జోడించాడు. ఇప్పటికే టెస్టుల్లో బజ్‌బాల్ స్టైల్ అలవాటు చేసిన స్టోక్స్.. వన్డేల్లోనూ అదే స్థాయిలో ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నాడు.

ఈ మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేసేలా కనిపించినా.. చివరికి 124 బంతుల్లోనే 182 పరుగులు చేసి ఔటయ్యాడు. స్టోక్స్ ఇన్నింగ్స్ లో మొత్తం 15 ఫోర్లు, 9 సిక్స్ లు ఉండటం విశేషం. అతని ధాటికి న్యూజిలాండ్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు.

తదుపరి వ్యాసం