తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Whatsapp Channel : వాట్సాప్​ ఛానెల్​లో కొత్త ఫీచర్​.. ఇక 'షేరింగ్​' మరింత ఈజీ!

WhatsApp channel : వాట్సాప్​ ఛానెల్​లో కొత్త ఫీచర్​.. ఇక 'షేరింగ్​' మరింత ఈజీ!

Sharath Chitturi HT Telugu

17 December 2023, 11:47 IST

    • WhatsApp channel new feature : వాట్సాప్​ ఛానెల్​కు కొత్త ఫీచర్​ యాడ్​ అవ్వనుంది. అది చాలా ఉపయోగకరంగా ఉండనుంది. అదేంటంటే..
వాట్సాప్​ ఛానెల్​లో కొత్త ఫీచర్​.. ఇక 'షేరింగ్​' మరింత ఈజీ!
వాట్సాప్​ ఛానెల్​లో కొత్త ఫీచర్​.. ఇక 'షేరింగ్​' మరింత ఈజీ! (AP)

వాట్సాప్​ ఛానెల్​లో కొత్త ఫీచర్​.. ఇక 'షేరింగ్​' మరింత ఈజీ!

WhatsApp channel new feature : సోషల్​ మీడియా దిగ్గజం వాట్సాప్​.. ఇండియాలో ఇటీవలే లాంచ్​ చేసిన ఛానెల్​ ఫీచర్​కు క్రేజీ స్పందన లభిస్తోంది. టెలిగ్రామ్​కు పోటీగా వచ్చిన ఈ ఛానెల్​ ఫీచర్​ని ఇప్పటికే చాలా మంది వినియోగించుకుంటున్నారు. ఇక ఇప్పుడు.. ఇందులో సరికొత్త ఫీచర్​ని తీసుకొచ్చింది మెటా ఆధారిత వాట్సాప్​. అదేంటంటే..

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

వాట్సాప్​ ఛానెల్​లో కొత్త ఫీచర్​..

వాట్సాప్​ ఛానెల్​లో ప్రస్తుతం.. కేవలం ఒక్క ఫొటో లేదా వీడియోను షేర్​ చేయడానికి మాత్రమే వీలవుతోంది. నార్మల్​ వాట్సాప్​లో ఇలా కాదు. అనేక ఫొటోలు, వీడియోలను ఒకేసారి షేర్​ చేయవచ్చు. దీనిని.. ఆటోమెటిక్​ ఆల్బమ్​ ఫీచర్​ అంటారు. ఇక ఇప్పుడు.. ఈ ఆటోమెటిక్​ ఆల్బమ్​ ఫీచర్​ని ఛానెల్​లో కూడా ప్రవేశపెడుతోంది వాట్సాప్​. ఆండ్రాయిడ్​ బీటా అప్డేట్​ వర్షెన్​ 2.23.26.16 లో ఇది ప్రస్తుతం ఉంది. బీటా టెస్టర్స్​కు ఇది ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే అందరి ఛానెల్స్​లో ఈ ఫీచర్​ ఉంటుందని తెలుస్తోంది. మల్టిపుల్​ ఫొటోలు, వీడియోలు చూసేందుకు ఛానెల్​ ఫాలోవర్స్​ వాటిని సులభంగా డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. ఒక్కో ఫొటోకు లేదా మొత్తం అల్బంకు రియాక్షన్​ ఇవ్వొచ్చు.

WhatsApp new features : యూజర్​ ఎక్స్​పీరియెన్స్​ని మెరుగుపరిచి, మీడియా కంటెంట్స్​ని ఒకేసారి షేర్​ చేసుకోవడం కోసం ఈ ఫీచర్​ని తీసుకొస్తున్నట్టు వాట్సాప్​ స్పష్టం చేసింది.

ఈ ఆటోమెటిక్​ ఆల్బమ్​ ఫీచర్​.. ఛానెల్​ ఓనర్స్​కి, ఫాలోవర్స్​కి ఉపయోగకరమేనని టెక్​ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అటు ఓనర్స్​ తమ ప్రెజంటేషన్​ని మరింత మెరుగ్గా ఇవ్వొచ్చని, ఇటు ఫాలోవర్లు.. వాటిని సులభంగా యాక్సెస్​ చేసుకోవచ్చని చెబుతున్నారు.

ఇక వాట్సాప్​ ఛానెల్​కు ఇండియాలో మంచి స్పందన లభిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి బాలీవుడ్​ సెలబ్రెటీలు, క్రికెటర్ల వరకు చాలా మందికి ఛానెల్​ ఉంది. తమకు నచ్చిన వారి గురించి అప్డేట్స్​ తెలుసుకునేందుకు ఫాలోవర్లు కూడా ఇష్టపడుతున్నారు.

వాట్సాప్​ ఛానెల్​ ఎలా క్రియేట్​ చేయాలి?

How to create WhatsApp channels : వాట్సాప్​ ఛానెల్​ క్రియేట్​ చేయడం చాలా సింపుల్​. అది ఎలా అంటే..

స్టెప్​ 1:- ముందుగా వాట్సాప్​ యాప్​ను ఓపెన్​ చేయండి.

స్టెప్​ 2:- ఆప్డేట్స్​లోకి వెళ్లి 'ఛానెల్స్​' ఐకాన్​ మీద క్లిక్​ చయండి. '+' ఆప్షన్​ను వాడండి.

స్టెప్​ 3:- అక్కడ.. క్రియేట్​ ఛానెల్​ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్​ చేయండి. అక్కడ కనిపించే ఇన్​స్ట్రుక్షన్స్​ను ఫాలో అవ్వండి.

స్టెప్​ 4:- ఇప్పుడు మీ ఛానెల్​ పేరు, డిస్క్రిప్షన్​, ప్రొఫైల్​ ఫొటో వంటివి యాడ్​ చేయండి.

స్టెప్​ 5:- చివరిగా.. క్రియేట్​ ఛానెల్​ మీద క్లిక్​ చేయండి. అంతే.. మీ వాట్సాప్​ ఛానెల్​ క్రియేట్​ అయిపోతుంది!

తదుపరి వ్యాసం