LPG cylinder price hike : ఎల్పీజీ సిలిండర్ ధర పెంపు.. 2023 మొదటి రోజే బాదుడు షురూ!
01 January 2023, 11:59 IST
- LPG cylinder price hike : వాణిజ్య సిలిండర్ ధర పెరిగింది. పెంచిన ధర ఆదివారం నుంచే అమల్లోకి వచ్చింది.
ఎల్పీజీ సిలిండర్ ధర పెంపు
LPG cylinder price hike : దేశ ప్రజలకు.. నూతన ఏడాది మొదటి రోజునే షాక్ తగిలింది! వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 25 పెరిగింది. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,769కి చేరింది. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు వెల్లడించాయి.
అయితే.. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర మాత్రం పెరగలేదు.
వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పెంపుతో రెస్టారెంట్, హోటల్ ఖర్చులు పెరుగుతాయి. అయితే.. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను పెంచకపోవడంతో.. సామాన్యులపై భారం పడలేదు.
వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు..
- ఢిల్లీ- సిలిండర్‌కు రూ. 1768
- Commercial LPG cylinder price in Hyderabad : ముంబై- సిలిండర్‌కు రూ. 1721
- కోల్‌కతా- సిలిండర్‌కు రూ. 1870
- చెన్నై- సిలిండర్‌కు రూ. 1917
- హైదరాబాద్- సిలిండర్‌కు రూ. 1798.5
డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలు..
- హైదరాబాద్- సిలిండర్‌కు రూ. 1,002
- ఢిల్లీ- సిలిండర్‌కు రూ. 1053
- Domestic LPG cylinder price in Hyderabad : ముంబై- సిలిండర్‌కు రూ. 1052.5
- కోల్‌కతా- సిలిండర్‌కు రూ. 1079
- చెన్నై- సిలిండర్‌కు రూ. 1068.5
2022లో బాదుడే.. బాదుడు..!
LPG cylinder price hike latest news : చివరిగా.. 2022 జులై 6న డొమెస్టిక్ సిలిండర్ ధరలను పెంచాయి చెమురు సంస్థలు. నాడు సిలిండర్‌పై రూ. 153.3 పెరిగింది. అయితే.. ద్రవ్యోల్బణం కారణంగా గతేడాది సిలిండర్ ధరలు భారీగానే పెరిగాయి. 2022 మార్చ్‌లో సిలిండర్‌పై రూ. 50 పెంచిన చమురు సంస్థలు.. మే నెలలో రూ. 3.50 పెంచాయి. ఆ తర్వాత జులైలో రూ. 50 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే.. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు కూడా పెరిగాయి. ఆ తర్వాత కమర్షియల్, డొమెస్టిక్ సిలిండర్ల ధరలు మళ్లీ కాస్త తగ్గాయి.