తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Punch Ev Price: కాంపిటీటివ్ ధరలో టాటా పంచ్ ఈవీ ని లాంచ్ చేసిన టాటా మోటార్స్

Tata Punch EV price: కాంపిటీటివ్ ధరలో టాటా పంచ్ ఈవీ ని లాంచ్ చేసిన టాటా మోటార్స్

HT Telugu Desk HT Telugu

17 January 2024, 13:01 IST

    • Tata Punch EV price: నాలుగు వేరియంట్లలో టాటా పంచ్ ఈవీ (Tata Punch EV) ఎస్ యూ వీ ని టాటా మోటార్స్ లాంచ్ చేసింది. టాటా మోటార్స్ నుంచి వచ్చిన నాలుగో ఎలక్ట్రిక్ మోడల్ ఈ టాటా పంచ్ ఈవీ.
టాటా పంచ్ ఈవీ
టాటా పంచ్ ఈవీ

టాటా పంచ్ ఈవీ

Tata Punch EV price: టాటా మోటార్స్ తన రెండవ ఎలక్ట్రిక్ SUV అయిన పంచ్ ఈవీ (Tata Punch EV) ని భారతదేశంలో రూ. 10.99 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఇది ఇంట్రడక్టరీ ఎక్స్ షో రూమ్ ధర. ప్రస్తుతం టాటా పంచ్ ఈవీ (Tata Punch EV) స్మార్ట్, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్+ అనే నాలుగు వేరియంట్‌లలో లభిస్తుంది. ఇందులో టాప్ ఎండ్ వేరియంట్ అయిన టాటా పంచ్ EV ఎంపవర్డ్+ ధర రూ. 14.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇంట్రడక్టరీ) ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో​ కొత్త వేరియంట్లు​..

7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్​! గ్రాట్యుటీ పెంపును హోల్డ్​లో పెట్టిన ఈపీఎఫ్​ఓ..

Tecno Camon 30 launch : ఇండియాలో టెక్నో కామోన్​ 30 సిరీస్​​ లాంచ్​- ధర ఎంతంటే..

Upcoming electric cars : మారుతీ సుజుకీ ఈవీఎక్స్​ నుంచి టాటా హారియర్​ ఈవీ వరకు.. క్రేజీ లైనప్​!

బుకింగ్స్ ప్రారంభం

టాటా మోటార్స్ ఇప్పటికే టాటా పంచ్ ఎలక్ట్రిక్ SUV బుకింగ్‌లను ప్రారంభించింది. టాటా కొత్త EV-only డీలర్‌షిప్‌ల ద్వారా కానీ లేదా టాటా మోటార్స్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కానీ రూ. 21,000 టోకెన్ అమౌంట్ ను చెల్లించి టాటా పంచ్ EVని రిజర్వ్ చేసుకోవచ్చు. పంచ్ EV ల డెలివరీలు వచ్చే నెల నుండి ప్రారంభమవుతాయి.

నాలుగో ఈవీ

టాటా మోటార్స్ (Tata Motors) నుంచి వచ్చిన విద్యుత్ కార్లలో పంచ్ (Tata Punch EV) నాలుగో కారు. అంతేకాదు, సంప్రదాయ ఇంజన్ తో పాటు సీఎన్జీ, ఎలక్ట్రిక్ మోడల్స్ ఉన్న రెండో కారు టాటా పంచ్. ఇప్పటివరకు టాటా నెక్సాన్ మాత్రమే సంప్రదాయ, సీఎన్జీ, ఎలక్ట్రిక్ వర్షన్లలో లభిస్తోంది. అలాగే, భారతదేశంలో టాటా విక్రయించే ఇతర EVలలో, టిగోర్ మాత్రమే పూర్తి స్థాయి పవర్‌ట్రైన్‌ను కలిగి ఉంది. అలాగే, ఇప్పటివరకు టాటా మోటార్స్ నుంచి నెక్సాన్ EV, టిగోర్ EV, టియాగో EV మోడల్స్ వచ్చాయి.

Tata Punch specifications: స్పెసిఫికేషన్స్

కొత్త Gen-2 ప్యూర్ EV ప్లాట్‌ఫారమ్‌ ఆధారపడి నిర్మించిన తొలి మోడల్ టాటా పంచ్ ఈవీ అని టాటా మోటార్స్ ఇటీవల ప్రకటించింది. ఈ ప్లాట్ ఫామ్ ను Acti.EV అని కూడా పిలుస్తారు. ఇది అధిక బలం కలిగిన మెటీరియల్‌ని ఉపయోగించి నిర్మించిన చాలా సురక్షితమైన ఆర్కిటెక్చర్ అని టాటా చెబుతోంది. వాహనం లోపల విశాలంగా ఉండేలా దీన్ని రూపొందించారు. అలాగే, ఈ టాటా పంచ్ ఈవీ గ్రౌండ్ క్లియరెన్స్ 190 mm ఉంటుంది.

Tata Punch dimension: డైమెన్షన్స్

ఈ టాటా పంచ్ ఈవీ () డైమెన్షన్స్ లో పెద్దగా మార్పులేవీ చేయలేదు. ICE లేదా CNG వెర్షన్‌ల డైమెన్షన్స్ నే కొనసాగించారు. అయితే, పంచ్ EV కూడా నెక్సాన్ EV ఫేస్‌లిఫ్ట్ తరహా డిజైన్ లోనే ఉంటుంది. అలాగే, స్లిమ్ LED హెడ్‌లైట్‌లు, క్లోజ్డ్ గ్రిల్, LED DRLలు ఉంటాయి. ఈ కారులో 366 లీటర్ల సాధారణ బూట్ స్పేస్‌తో పాటు, బోనెట్ కింద 14 లీటర్ల అదనపు స్టోరేజ్ కెపాసిటీ లభిస్తుంది.

Tata Punch EV price list: టాటా పంచ్ ఈవీ ధరలు

Punch EV variantsPrice (ex-showroom)
Punch.ev Smart 10.99 lakh
Punch.ev Smart+ 11.49 lakh
Punch.ev Adventure 11.99 lakh
Punch.ev Empowered 12.79 lakh
Punch.ev Empowered+ 13.29 lakh
Punch.ev LR Adventure 12.99 lakh
Punch.ev LR Empowered 13.99 lakh
Punch.ev LR Empowered+ 14.49 lakh

టాటా పంచ్ ఈవీ బేసిక్ మోడల్ టాటా పంచ్ ఈవీ స్మార్ట్ రూ. 10.99 లక్షల ప్రారంభ ధరతో లభ్యమవుతుంది. ఇది ఎక్స్ షో రూమ్, ఇంట్రడక్టరీ ధర అన్న విషయం గమనార్హం. అలాగే, టాటా పంచ్ ఈవీ హై ఎండ్ మోడల్ అయిన ఎల్ ఆర్ ఎంపవర్డ్ ప్లస్ ఎక్స్ షో రూమ్, ఇంట్రడక్టరీ ధర రూ. 14.49 లక్షలుగా నిర్ణయించారు.

Tata Punch EV Battery, range:బ్యాటరీ, రేంజ్

టాటా మధ్య శ్రేణి, దీర్ఘ శ్రేణి బ్యాటరీ ప్యాక్‌లతో పంచ్ EVని పరిచయం చేసింది. చిన్నది 25 kWh బ్యాటరీ యూనిట్ కాగా, పెద్ద యూనిట్ 35 kWh సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ కొత్త బ్యాటరీ ప్యాక్‌లను తన కొత్త Gen-2 ప్యూర్ EV ప్లాట్‌ఫారమ్ కోసం టాటా మోటార్స్ అభివృద్ధి చేసింది. ఇవి విస్తృతమైన, అధిక సాంద్రత కలిగిన సెల్‌లతో వస్తాయి. ఇవి EVల సామర్ధ్యాన్ని దాదాపు 10 శాతం వరకు మెరుగుపరుస్తాయని కంపెనీ చెబుతోంది. టాటా పంచ్ EV మధ్య శ్రేణి వెర్షన్ 80 bhp శక్తిని, 114 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేయగలదు. పంచ్ లాంగ్-రేంజ్ వెర్షన్ 120 bhpని, 190 Nm టార్క్ అవుట్‌పుట్‌ ను విడుదల చేయగలదు. ఈ ఎలక్ట్రిక్ SUV 9.5 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం 140 kmph.

Tata Punch EV Features: ఫీచర్స్

సంప్రదాయ ICE, CNG మోడల్స్ ఫీచర్స్ తో పాటు అదనంగా లెథెరెట్ సీట్లు, ముందు వరుసలో సీట్ వెంటిలేషన్, ఎయిర్ ప్యూరిఫైయర్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అదే పరిమాణంలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ మొదలైన ఫీచర్స్ టాటా పంచ్ ఈవీ లో ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ SUV వైర్‌లెస్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి ఇతర ఫీచర్స్ కూడా ఉన్నాయి. అలాగే, ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో-హోల్డ్ ఫంక్షన్‌ తదితర ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఆప్షన్ కూడా ఉంది.

Tata Punch EV Colour options: టాటా పంచ్ ఈవీ కలర్స్

టాటా పంచ్ EV ఐదు రంగులలో లభిస్తుంది. ఇవి ప్రిస్టైన్ వైట్, డేటోనా గ్రే, ఫియర్‌లెస్ రెడ్, సీవీడ్ గ్రీన్, ఎంపవర్డ్ ఆక్సైడ్. ఈ రంగులన్నీ డ్యూయల్-టోన్ ఎక్స్టీరియర్ థీమ్‌లో భాగంగా అందించబడతాయి. అలాగే, ఇవి బ్లాక్-అవుట్ రూఫ్‌తో వస్తాయి.

తదుపరి వ్యాసం