తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Skoda Kodiaq: బంపర్ ఆఫర్.. స్కోడా కొడియాక్ పై ఏకంగా 2 లక్షల డిస్కౌంట్

Skoda Kodiaq: బంపర్ ఆఫర్.. స్కోడా కొడియాక్ పై ఏకంగా 2 లక్షల డిస్కౌంట్

HT Telugu Desk HT Telugu

23 March 2024, 17:17 IST

    • స్కోడా కొడియాక్ ఎల్ అండ్ కే వేరియంట్ ధరను ఏకంగా రూ .2 లక్షలు తగ్గించారు. ఈ తగ్గింపు అనంతరం ఈ లగ్జరీ కారు ధర రూ .39.99 లక్షలకు (ఎక్స్-షోరూమ్) తగ్గింది. ప్రస్తుతం స్కోడా కొడియాక్ (Skoda Kodiaq) లో ఎల్ అండ్ కే వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది.
స్కోడా కోడియాక్ ఎస్ యూ వీ
స్కోడా కోడియాక్ ఎస్ యూ వీ

స్కోడా కోడియాక్ ఎస్ యూ వీ

స్కోడా ఆటో ఇండియా భారత్ లో కొడియాక్ వేరియంట్ లైనప్ లో నుంచి నిశ్శబ్దంగా రెండు వేరియంట్ లను తొలగించింది. స్కోడా నుంచి వచ్చిన ఫ్లాగ్ షిప్ మోడల్ కొడియాక్ (Skoda Kodiaq) లో మొదట మూడు వేరియంట్లు అందుబాటులో ఉండేవి. అవి స్టైల్, స్పోర్ట్ లైన్, ఎల్ అండ్ కె వేరియంట్లు. వీటిలో నుంచి ఇటీవల మొదటి రెండు వేరియంట్లు అయిన స్టైల్, స్పోర్ట్ లైన్ లను స్కోడా నిలిపివేసింది. ప్రస్తుతం ఈ మోడల్ ఇప్పుడు టాప్- ఎండ్ వేరియంట్ అయిన ఎల్ అండ్ కె వేరియంట్ లో మాత్రమే లభిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

Stocks to buy today : భారీగా పతనమైన టాటా మోటార్స్​ షేర్లు ఇప్పుడు కొంటే.. భారీ ప్రాఫిట్స్​!

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో​ కొత్త వేరియంట్లు​..

7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్​! గ్రాట్యుటీ పెంపును హోల్డ్​లో పెట్టిన ఈపీఎఫ్​ఓ..

Tecno Camon 30 launch : ఇండియాలో టెక్నో కామోన్​ 30 సిరీస్​​ లాంచ్​- ధర ఎంతంటే..

మూడవ వరుస సీట్ కూడా..

మరోవైపు, స్కోడా కొడియాక్ ఎల్ అండ్ కె (Skoda Kodiaq L&K variant) ధరను సంస్థ రూ .2 లక్షలు తగ్గించింది. ఈ ఈ తగ్గింపు అనంతరం ఈ లగ్జరీ కారు ధర రూ .39.99 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది. ఈ ధర తగ్గింపునకు కారణమేంటనే విషయాన్ని స్కోడా వెల్లడించలేదు. కానీ, ఈ రూ. 2 లక్షల డిస్కౌంట్ అనంతరం, సౌకర్యవంతమైన, విలాసవంతమైన స్కోడా కొడియాక్ ఎస్యూవీని ఇంటికి తీసుకురావడానికి ఇదే సరైన సమయంగా కనిపిస్తోంది. టాప్-నాచ్ బిల్డ్ క్వాలిటీ, ఫీచర్-రిచ్ క్యాబిన్ కు స్కోడా కొడియాక్ (Skoda Kodiaq) పెట్టింది పేరు. స్కోడా కొడియాక్ లో సౌకర్యవంతమైన రెండు వరుసల సీట్లతో పాటు, అవసరమైతే, ఉపయోగించదగిన మూడవ వరుస సీట్లను కూడా ఉపయోగించుకునేలా రూపొందించారు.

రెండు లక్షల తగ్గింపు..

స్కోడా కొడియాక్ ఎల్ అండ్ కె వేరియంట్ గతంలో రూ .41.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ధర తగ్గింపు అనంతరం ఆ ధర రూ. 39.99 లక్షలకు లభిస్తుంది. ధరను తగ్గించినప్పటికీ, ఈ ఎస్యూవీ లో అన్ని ఫీచర్లను కొనసాగిస్తున్నారు. ఇందులో 2.0-లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజన్ 188 బీహెచ్పీ పవర్, 320ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 7-స్పీడ్ డీఎస్జీ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఉంటుంది.

స్కోడా సూపర్బ్, స్కోడా ఆక్టావియా

స్కోడా ఈ ఏడాది చివర్లో సూపర్బ్ (Skoda Superb), ఆక్టావియా (Skoda Octavia) ల అప్ డేటెడ్ మోడల్స్ ను కూడా భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ప్రస్తుత తరం సూపర్బ్ ను కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (CBU)గా తిరిగి ప్రవేశపెట్టనున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. మరోవైపు, ఎన్యాక్ ఎలక్ట్రిక్ ఎస్ యూవీ (ELECTRIC SUV) కూడా త్వరలో భారత్ లో ప్రవేశపెట్టాలని స్కోడా భావిస్తోంది.

తదుపరి వ్యాసం