తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus 12 Launch Date India : వన్​ప్లస్​ 12.. ఇండియా లాంచ్​ డేట్​ ఫిక్స్​!

OnePlus 12 launch date India : వన్​ప్లస్​ 12.. ఇండియా లాంచ్​ డేట్​ ఫిక్స్​!

Sharath Chitturi HT Telugu

09 December 2023, 8:05 IST

    • OnePlus 12 launch date India : వన్​ప్లస్​ 12.. త్వరలోనే ఇండియాలో లాంచ్​కానుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఇండియాలో వన్​ప్లస్​ 12 లాంచ్​ ఎప్పుడు?
ఇండియాలో వన్​ప్లస్​ 12 లాంచ్​ ఎప్పుడు? (OnePlus)

ఇండియాలో వన్​ప్లస్​ 12 లాంచ్​ ఎప్పుడు?

OnePlus 12 launch date India : చైనాలో ఇటీవలే లాంచ్​ అయిన వన్​ప్లస్​ 12 ఫ్లాగ్​షిప్​ గ్యాడ్జెట్​.. స్మార్ట్​ఫోన్​ మార్కెట్​ను షేక్​ చేస్తోంది. 2023లో లాంచ్​ అయిన ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్​ ఇదేనని టెక్​ వర్గాలు చెబుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో ఇండియాలో వన్​ప్లస్​ 12 లాంచ్​తో పాటు ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

వన్​ప్లస్​ 12 ఫీచర్స్​- స్పెసిఫికేషన్స్​..

వన్​ప్లస్​ 12 డిజైన్​.. వన్​ప్లస్​ 11ని పోలి ఉంటుంది. కొన్ని మార్పులు మాత్రం కనిపిస్తున్నాయి. కాగా.. ఈ స్మార్ట్​ఫోన్​లో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 3 చిప్​సెట్​ ఉంది. 120 హెజ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.82 ఇంచ్​ కర్వ్​డ్​ ఓఎల్​ఈడీ డిస్​ప్లే దీని సొంతం. 4500 నిట్స్​ పీక్​ బ్రైట్​నెస్​ లెవల్​ ఇందులో కనిపిస్తుంది.

OnePlus 12 India launch : ఈ వన్​ప్లస్​ కొత్త గ్యాడ్జెట్​లో 50ఎంపీ ప్రైమరీ, 64ఎంపీ సెకెండరీ, 48ఎంపీ అల్ట్రావైడ్​ సెన్సార్​తో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంటుంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఇందులో 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరా లభిస్తోంది.

అంతేకాకుండా.. ఈ డివైజ్​లో డ్యూయెల్​ సిమ్​, 5జీ, వైఫై 7, బ్లూటూత్​ 5.4, జీఎన్​ఎస్​ఎస్​, ఎన్​ఎఫ్​సీ, యూఎస్​బీ 3.2 జెన్​1 వంటి కనెక్టివిటీ ఫీచర్స్​ కూడా వస్తున్నాయి. అలర్ట్​ స్లైడర్​, ఐఆర్​ బ్లాస్టర్​, ఎక్స్​ యాక్సిస్​ లీనియర్​ వైబ్రేషన్​ మోషన్​, డ్యూయెల్​ స్టీరియో స్పీకర్స్​ వంటివి కూడా ఉంటాయి.

5,400ఎంఏహెచ్​ బ్యాటరీతో పాటు 100 వాట్​ వయర్డ్​- 50వాట్​ వయర్​లెస్ ఛార్జింగ్​ సపోర్ట్​ దీనికి లభిస్తుండటం విశేషం. ఆండ్రాయిడ్​ 14 ఆధారిత కలర్​ఓఎస్​ 14 సాఫ్ట్​వేర్​పై ఈ మోడల్​ పనిచేస్తుంది.

చైనాలో వన్​ప్లస్​ 12 ధర..

OnePlus 12 price in India : వన్​ప్లస్​ 12లో నాలుగు వేరియంట్లు ఉన్నాయి. వాటి ధరలు..

వన్​ప్లస్​ 12- 12జీబీ ర్యామ్​- 256 జీబీ స్టోరేజ్​- సుమారు రూ. 50,500.

16జీబీ ర్యామ్​- 512జీబీ స్టోరేజ్​- సుమారు రూ. 56,350.

16జీబీ ర్యామ్​- 1టీబీ స్టోరేజ్​- సుమారు రూ. 62,200.

24జీబీ ర్యామ్​- 1టీబీ స్టోరేజ్​- సుమారు రూ. 68,100.

ఇండియాలో లాంచ్​ ఎప్పుడు..?

OnePlus 12 India : వన్​ప్లస్​ 12ని చైనాలో ఈ నెల 5న లాంచ్​ చేసింది సంస్థ. 2024 తొలినాళ్లల్లో.. ఇండియాతో పాటు అంతర్జాతీయంగా కూడా లాంచ్​ చేయనున్నట్టు ప్రకటించింది. లాంచ్​ డేట్​పై క్లారిటీ లేదు కానీ.. ఈ స్మార్ట్​ఫోన్​.. 2024 జనవరి 23న ఇండియాలోకి అడుగుపెడుతుందని పలు నివేదికలు వెల్లడించాయి.

తదుపరి వ్యాసం