తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Nissan Magnite Ez-shift: సరసమైన ఏఎంటీ ఎస్‌యూవీ.. పరిచయ ధర నవంబరు 11 వరకే..

Nissan Magnite EZ-Shift: సరసమైన ఏఎంటీ ఎస్‌యూవీ.. పరిచయ ధర నవంబరు 11 వరకే..

HT Telugu Desk HT Telugu

11 October 2023, 7:41 IST

    • Nissan Magnite EZ-Shift: నిస్సాన్ మాగ్నైట్ ఈజీ షిఫ్ట్ ఆటో గేర్ ఎస్‌యూవీ సరసమైన ధరకే లాంఛ్ అయింది. వివరాలు ఇవీ
నిస్సాన్ మాగ్నైట్ ఈజీ షిఫ్ట్
నిస్సాన్ మాగ్నైట్ ఈజీ షిఫ్ట్

నిస్సాన్ మాగ్నైట్ ఈజీ షిఫ్ట్

నిస్సాన్ తన మాగ్నైట్ ఈజీ షిఫ్ట్ (Magnite EZ-Shift)ను రూ. 6,49,900 ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేసింది. ఇది పరిచయ ధరగా పేర్కొంది. మాగ్నైట్ ఈజీ-షిఫ్ట్ భారత మార్కెట్లో అత్యంత సరసమైన ఆటో గేర్ డ్రైవ్ ఎస్‌యూవీ అని నిస్సాన్ తెలిపింది. 10 నవంబర్'23 వరకు చేసిన అన్ని బుకింగ్‌లకు ప్రారంభ ధర వర్తిస్తుంది. బుకింగ్ ధర రూ. 11,000 మాత్రమే. మాగ్నైట్ AMT XE, XL, XV, XV ప్రీమియం వేరియంట్‌లలో, ఇటీవల ప్రారంభించబడిన కురో స్పెషల్ ఎడిషన్‌లో లభ్యమవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో​ కొత్త వేరియంట్లు​..

7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్​! గ్రాట్యుటీ పెంపును హోల్డ్​లో పెట్టిన ఈపీఎఫ్​ఓ..

Tecno Camon 30 launch : ఇండియాలో టెక్నో కామోన్​ 30 సిరీస్​​ లాంచ్​- ధర ఎంతంటే..

Upcoming electric cars : మారుతీ సుజుకీ ఈవీఎక్స్​ నుంచి టాటా హారియర్​ ఈవీ వరకు.. క్రేజీ లైనప్​!

మాగ్నైట్ EZ-Shift 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్. ఇది గరిష్టంగా 71 బీహెచ్‌పీ శక్తిని, 96 ఎన్ఎం గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త ఏఎంటీ ట్రాన్స్‌మిషన్ 5-స్పీడ్ యూనిట్‌తో వస్తోంది. ఇంధన సామర్థ్యం లీటర్‌కు 19.70 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ 19.35 కేఎంపీఎల్ ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది.

గేర్‌బాక్స్‌లో డ్యూయల్ డ్రైవింగ్ మోడ్ ఉంది. ఇది గేర్‌బాక్స్‌పై మాన్యువల్ నియంత్రణను తీసుకోవడానికి సులువవుతుంది. నిస్సాన్ క్రీప్ ఫంక్షన్‌ను కూడా అందిస్తోంది. ఇది డ్రైవర్ బ్రేక్‌ను వదిలివేసినప్పుడు కారు ముందుకు సాగడానికి అనుమతిస్తుంది. ఆఫర్‌లో యాంటీ-స్టాల్ అండ్ కిక్-డౌన్ ఫీచర్ కూడా ఉంది. అంతేకాకుండా, వాహనం వెహికల్ డైనమిక్ కంట్రోల్ (వీడీసీ), హిల్ స్టార్ట్ అసిస్ట్ (హెచ్ఎస్ఏ)తో ప్రామాణికంగా లభిస్తుంది.

నిస్సాన్ ఇటీవలే నిస్సాన్ మాగ్నైట్ కురో స్పెషల్ ఎడిషన్‌ను పరిచయం చేసింది. దీని ప్రారంభ ధర రూ. 8.27 లక్షలు. జపనీస్‌లో కురో అంటే నలుపు. కురో అనే పేరుకు తగినట్టుగా ఈ ప్రత్యేక ఎడిషన్‌ కోసం కారు బయటా, లోపల నలుపు రంగును విస్తృతంగా ఉపయోగించారు.

నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రాకేష్ శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడుతూ "నిస్సాన్ మాగ్నైట్ గేమ్-ఛేంజర్‌గా నిలుస్తుంది. విలువ ప్రతిపాదన, అగ్రశ్రేణి భద్రతా రేటింగ్‌, తక్కువ ధరతో కొత్త బెంచ్‌మార్క్‌ ఏర్పాటు చేసింది. నిస్సాన్ మాగ్నైట్ EZ- SUV, సెడాన్, హ్యాచ్‌బ్యాక్ కేటగిరీలలో అత్యంత సరసమైన సరసమైన AMTగా నిలుస్తుంది.

తదుపరి వ్యాసం